MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Other Sports
  • CWG 2026: ఒక్క పంచ్‌తో పాక్ కథ ఖతం.. గోల్డే టార్గెట్ అంటున్న జాదుమణి సింగ్ !

CWG 2026: ఒక్క పంచ్‌తో పాక్ కథ ఖతం.. గోల్డే టార్గెట్ అంటున్న జాదుమణి సింగ్ !

Jadumani Singh : కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్ బాక్సర్‌పై 5-0తో ఘనవిజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు భారత బాక్సర్ జాదుమణి సింగ్. ఈ విజయం తర్వాత, తన గెలుపును కార్గిల్ వీరులకు అంకితమిచ్చాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 27 2026, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాక్ బాక్సర్‌ను రింగ్‌లోనే పంచ్‌లతో కుమ్మేసిన భారతీయుడు.. విజయం కార్గిల్ వీరులకు అంకితం
Image Credit : instagram/bfi_official

పాక్ బాక్సర్‌ను రింగ్‌లోనే పంచ్‌లతో కుమ్మేసిన భారతీయుడు.. విజయం కార్గిల్ వీరులకు అంకితం

కామన్వెల్త్ గేమ్స్ (CWG 2026) లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ పోరులో పాక్ బాక్సర్‌ను రింగ్‌లోనే పంచ్‌లతో కుమ్మేసిన భారత బాక్సర్ జాదుమణి సింగ్. కార్గిల్ విజయ్ దివస్‌ రోజున మైండ్ బ్లాకింగ్ విక్టరీని అందుకున్నాడు. రింగ్‌లో దిగినప్పటి నుంచి చివరి వరకు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పంచ్‌లతో దడదడలాడించిన 22 ఏళ్ల జాదుమణి
Image Credit : instagram/bfi_official

పంచ్‌లతో దడదడలాడించిన 22 ఏళ్ల జాదుమణి

గ్లాస్గో లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 55 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 16 పోరు ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువ బాక్సర్ జాదుమణి సింగ్ మ్యాండెంగ్‌బామ్, పాకిస్తాన్‌కు చెందిన సుమామ రెహమాన్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొదటి సెకను నుంచే జాదుమణి తన పంచ్ పవర్ చూపించాడు. ఐదుగురు జడ్జిలు కూడా ఏకగ్రీవంగా భారత్‌కే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో జాదుమణి 5-0తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు మాస్ ఎంట్రీ ఇచ్చాడు.

36
కార్గిల్ విజయ్ దివస్ రోజున అద్భుత విజయం
Image Credit : instagram/bfi_official

కార్గిల్ విజయ్ దివస్ రోజున అద్భుత విజయం

ఈ విజయం కేవలం ఒక రౌండ్ గెలవడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప సందర్భం ఉంది. మ్యాచ్ జరిగిన రోజు జూలై 26, అంటే మన దేశం అంతా 27వ 'కార్గిల్ విజయ్ దివస్' జరుపుకుంటున్న రోజు. 1999లో పాకిస్తాన్‌పై కార్గిల్ యుద్ధంలో మన భారత సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును నిర్వహిస్తారు. సరిగ్గా అదే రోజున రింగ్‌లో మరోసారి పాకిస్తాన్ బాక్సర్‌ను మట్టికరిపించడం భారతీయులందరికీ గర్వకారణంగా మారింది. ఈ విజయం తర్వాత జాదుమణి మాట్లాడుతూ.. "నా ఈ విజయాన్ని మన కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం ఇస్తున్నా. పాకిస్తాన్‌పై గెలవడం చాలా సంతోషంగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లోనూ ఇదే జోరు చూపిస్తా, భారత్‌కు గోల్డ్ మెడల్ తీసుకరావడమే నా లక్ష్యం" అని ఎమోషనల్‌గా చెప్పాడు.

46
బై దక్కినా చెల్లని పాక్ ప్లాన్.. జాదుమణి రచ్చ
Image Credit : instagram/bfi_official

బై దక్కినా చెల్లని పాక్ ప్లాన్.. జాదుమణి రచ్చ

పాకిస్తాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌కు తొలి రౌండ్‌లో బై దక్కడంతో అతడు నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఛాన్స్ తో రింగ్‌లోకి దిగిన పాక్ బాక్సర్‌కు జాదుమణి అసలు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. అంతకుముందు రౌండ్ ఆఫ్ 32లో స్కాట్లాండ్‌కు చెందిన అరోన్ కల్లెన్‌ను కూడా 5-0తో ఊచకోత కోసిన జాదుమణి, అదే ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించాడు. గతేడాది నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 50 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఈ మణిపూర్ వీరుడు, ఈసారి 55 కేజీల కేటగిరీలోకి మారి పతకం దిశగా దూసుకుపోతున్నాడు.

56
క్వార్టర్స్‌లో గెలిస్తే మెడల్ ఖాయం
Image Credit : X/BFI_official

క్వార్టర్స్‌లో గెలిస్తే మెడల్ ఖాయం

ఇప్పుడు అందరి చూపు మంగళవారం జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ క్వార్టర్స్‌లో జాదుమణి గెలిస్తే భారత్‌కు కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఇద్దరు బాక్సర్లకు కూడా బ్రాంజ్ మెడల్స్ ఇస్తారు. కాబట్టి క్వార్టర్స్‌లో విజయం సాధిస్తే పతకం ఇండియా ఖాతాలో పడ్డట్లే.

66
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల హవా
Image Credit : X/Media_SAI

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల హవా

మరోవైపు గ్లాస్గోలో భారత్ పతకాల పంట పండిస్తోంది. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను మహిళల 48 కేజీల కేటగిరీలో వరుసగా మూడోసారి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే పురుషుల 60 కేజీల విభాగంలో చనంబమ్ రుషికాంత సింగ్, 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి సిల్వర్ మెడల్స్ సాధించి దేశ కీర్తిని పెంచారు. ఇప్పుడు బాక్సింగ్‌లో జాదుమణి కూడా గోల్డ్ వైపు వేగంగా అడుగులు వేస్తుండటంతో భారత అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mirabai Chanu: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Recommended image2
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
Recommended image3
Long Jump Queen: ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ ఈమెనే.. ఎవరీ ఆన్సీ సోజన్?
Related Stories
Recommended image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
Gold Rate: అమెరికాలో బిగ్ మీటింగ్.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? బంగారం రేట్లు ఏమవుతాయంటే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved