MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate: అమెరికాలో బిగ్ మీటింగ్.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? బంగారం రేట్లు ఏమవుతాయంటే !

Gold Rate: అమెరికాలో బిగ్ మీటింగ్.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? బంగారం రేట్లు ఏమవుతాయంటే !

Gold Rate: అమెరికా ఫెడ్ బ్యాంక్ భేటీ వేళ గోల్డ్ రేట్లలో భారీ ఊగిసలాట కొనసాగుతోంది. బంగారం ధర మరింత తగ్గుతుందా లేదా పెరుగుతుందా? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మీటింగ్ బంగారం ధరల పై ఎలాంటి ప్రభావం ఉంటుందో నిపుణులు చెప్పిన వివరాలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 27 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోల్డ్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?
Image Credit : ChatGPT

గోల్డ్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. సాధారణంగా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. కానీ ఈసారి ఇరాన్ యుద్ధం నడుస్తున్నా కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జనవరి 29 నుంచి పసిడి, వెండి ధరల్లో నిరంతరం ఒత్తిడి కనిపిస్తోంది. గత వారంలో కూడా గోల్డ్ మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైంది.

ఆల్‌టైమ్ హై రికార్డులతో పోలిస్తే ఇప్పటివరకు బంగారం దాదాపు ₹36,000 వరకు తగ్గగా, వెండి ఏకంగా ₹1.66 లక్షల మేర పడిపోయింది. మార్కెట్‌లో గత వారం 10 గ్రాముల బంగారం ధర ₹1.45 లక్షల గరిష్ఠ స్థాయిని తాకి, మళ్లీ పడిపోయి ₹1.42 లక్షల వద్దకు చేరింది. అదే సమయంలో కేజీ వెండి ధర ₹2,26,238 నుంచి ₹2,19,556 వరకు దిగొచ్చింది. ప్రస్తుతం పసిడి ధర ఆన్సస్‌కు $4,000 నుంచి $4,120 మధ్య ట్రేడ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేటి బంగారం, వెండి లెటెస్ట్ ధరలు ఇవే!
Image Credit : pexels

నేటి బంగారం, వెండి లెటెస్ట్ ధరలు ఇవే!

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ అందించిన లెటెస్ట్ రేట్ల ప్రకారం వివిధ క్యారెట్ల బంగారం, వెండి ధరలు గమనిస్తే..

హైదరాబాద్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

• 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,44,920

• 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,32,840

• కిలో వెండి ధర: ₹2,39,900

స్థానిక పన్నులు, దుకాణాల మేకింగ్ ఛార్జీల బట్టి ఈ ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Related Articles

Related image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Related image2
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
35
అమెరికా ఫెడ్ నిర్ణయంతో టెన్షన్ టెన్షన్
Image Credit : Asianet News

అమెరికా ఫెడ్ నిర్ణయంతో టెన్షన్ టెన్షన్

బంగారం ధర భవిష్యత్తులో ఏ వైపు వెళ్తుందనేది జులై 28-29 తేదీలలో జరగబోయే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ (FOMC) కీలక సమావేశంపై ఆధారపడి ఉంది. ఈ భేటీలో వడ్డీ రేట్లపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా వడ్డీ రేట్లు 3.50% నుంచి 3.75% వద్ద స్థిరంగా ఉంటాయని 85% కంటే ఎక్కువ మంది భావిస్తున్నారు.

అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం లేదు. ఫెడ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి పరిమితం చేయాలని చూస్తోంది. సీఎంఈ ఫెడ్ ఫండ్స్ ఫ్యూచర్స్ ప్రకారం, వచ్చే వారం జరిగే భేటీలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) పెంచే అవకాశం 38% వరకు ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం 60 నుంచి 80 శాతం వరకు ఉందనే అంచనాలు నిపుణుల్లో టెన్షన్ పెంచుతున్నాయి.

అయితే, అమెరికా ఫెడ్ మీటింగ్ ముగిసిన వెంటనే జూన్ నెలకు సంబంధించిన పర్సనల్ కన్సప్షన్ ఎక్స్‌పెండిచర్స్ ద్రవ్యోల్బణం డేటా విడుదల కానుంది. ఈ డేటా ఎక్కువగా ఉంటే సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఖాయమవుతుంది. ఇది బాండ్ ఈల్డ్స్‌ను పెంచి, బంగారంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

45
వడ్డీ రేట్లు పెరిగితే బంగారం పడిపోతుందా?
Image Credit : Getty

వడ్డీ రేట్లు పెరిగితే బంగారం పడిపోతుందా?

గత వారంలో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల డిప్ బయింగ్ జరిగి గోల్డ్‌కు కొంత ఊరట లభించినా, క్రూడ్ ఆయిల్ ధరల ఒత్తిడి వల్ల మళ్లీ పడిపోయింది. అధిక వడ్డీ రేట్లు, బలమైన అమెరికా డాలర్ ఎప్పుడూ బంగారం మార్కెట్‌కు మైనస్ పాయింటే.

• ధర తగ్గడానికి కారణాలు : ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినా లేదా భవిష్యత్తులో పెంచుతామని సంకేతాలు ఇచ్చినా బంగారంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. డాలర్ బలపడితే గోల్డ్ రేట్ ఆన్సస్‌కు $3,890 - $3,950 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది.

• ధర పెరగడానికి కారణాలు: ఒకవేళ ఫెడ్ తన వైఖరిని సడలించి, వడ్డీ రేట్లపై సడలింపు ఇస్తే లేదా పీఎస్ఈ ద్రవ్యోల్బణ గణాంకాలు ఊరట కలిగిస్తే బంగారం మళ్లీ పుంజుకుంటుంది. ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగితే సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపితే, ధర $4,150 - $4,250 వరకు వెళ్లవచ్చు.

55
ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఏం చేయాలి?
Image Credit : iSTOCK

ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఏం చేయాలి?

ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ టగ్ ఆఫ్ వార్ మారింది. ఒకవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు బంగారాన్ని పైకి నెడుతుంటే, మరోవైపు అమెరికా బ్యాంక్ వడ్డీ రేట్ల భయం కిందకు లాగుతోంది. షార్ట్ టెర్మ్ లో చూస్తే అమెరికా ఫెడ్ మీటింగ్ ముగిసే వరకు బంగారం ధరల్లో తీవ్రమైన ఊగిసలాట ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పొజిషన్లు తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మధ్యస్థం నుంచి సుదీర్ఘ కాలంలో చూస్తే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ వల్ల బంగారానికి ఆదరణ అలాగే ఉంటుంది. మున్ముందు పసిడి మెరుస్తుందా లేదా కిందకు దిగివస్తుందా అనేది ఈ వారంలో యూఎస్ ఫెడ్ నిర్ణయమే తేల్చనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
బంగారం
భారత దేశం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: నెల‌కు రూ. 12 వేలు ప‌క్క‌న పెడితే రూ. 43 ల‌క్ష‌లు జ‌మ చేయొచ్చు.. జ‌స్ట్ 15 ఏళ్ల‌లోనే
Recommended image2
House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?
Recommended image3
Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా
Related Stories
Recommended image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved