MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Other Sports
  • Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా

Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా

Rugby Premier League 2026: హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో ముంబై డ్రీమర్స్‌ను ఓడించి హైదరాబాద్ హీరోస్ ఛాంపియన్‌గా నిలిచింది. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీ అందించారు. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా వైరల్ గా మారింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 29 2026, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గచ్చిబౌలిలో హైదరాబాద్ రచ్చ.. ముంబై ఖేల్‌ఖతం
Image Credit : X/Congress4TS

గచ్చిబౌలిలో హైదరాబాద్ రచ్చ.. ముంబై ఖేల్‌ఖతం

భారత రగ్బీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తూ సాగిన హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) సీజన్ 2 గ్రాండ్ సక్సెస్‌గా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో హోమ్ టీమ్ హైదరాబాద్ హీరోస్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో దుమ్ములేపింది. బలమైన ప్రత్యర్థి ముంబై డ్రీమర్స్‌ను 41-17 తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది.

మ్యాచ్ ఆరంభంలో ముంబై కాస్త బాల్ కంట్రోల్ సాధించి జోరు చూపించినా, హైదరాబాద్ డిఫెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో నిలిచింది. పక్కా ప్లానింగ్‌తో కౌంటర్ ఎటాక్‌లకు దిగి ముంబై టీమ్‌కు చుక్కలు చూపించింది. విరామ సమయానికే మ్యాచ్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకున్న హైదరాబాద్ హీరోస్, సెకండ్ హాఫ్‌లోనూ అదే అగ్రెసివ్ గేమ్‌తో టైటిల్‌ను ముద్దాడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెలబ్రిటీల సందడి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా ట్రోఫీ
Image Credit : X/Congress4TS

సెలబ్రిటీల సందడి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా ట్రోఫీ

ఆదివారం జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, హైదరాబాద్ హీరోస్ జట్టుకు విన్నర్స్ ట్రోఫీని బహూకరించారు. ప్లేయర్ల స్పోర్ట్స్ మ్యాన్‌షిప్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, SARG చైర్మన్ శివసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు.

కేవలం రాజకీయ ప్రముఖులే కాదు, మెగాస్టార్ చిరంజీవి, ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి వంటి బిగ్ సెలబ్రిటీలు ఈ ముగింపు వేడుకల్లో సందడి చేయడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

#WATCH | Hyderabad, Telangana: On the HSBC Rugby Premier League Season 2 final, Badminton player PV Sindhu says, "I am really very happy that the Rugby Premier League has been a success... Hyderabad has won today, and it was really good to see... Rahul Bose has been amazing... I… pic.twitter.com/PY6WeC5LaV

— ANI (@ANI) June 28, 2026

VIDEO | After attending Rugby Premier League finals in Hyderabad, actor Chiranjeevi (@KChiruTweets) says, "Everything was beyond my imagination, there was a cheerful atmosphere... Rahul Bose has done fantastic job. CM Revanth Reddy came, it is a great gensture. His vision to make… pic.twitter.com/F1G46KOD1s

— Press Trust of India (@PTI_News) June 28, 2026

35
హైదరాబాద్ విన్నర్స్ ప్రైజ్ మనీ ఎంతంటే?
Image Credit : X/Congress4TS

హైదరాబాద్ విన్నర్స్ ప్రైజ్ మనీ ఎంతంటే?

జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ప్రైజ్ మనీ కూడా భారీగానే అందించారు. టైటిల్ విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ రూ.45 లక్షల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా, రన్నరప్‌గా నిలిచిన ముంబై డ్రీమర్స్‌కు రూ.25 లక్షలు దక్కాయి. ఇక అంతకుముందు జరిగిన థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై బుల్స్‌ను 22-19 తేడాతో ఉత్కంఠభరితంగా ఓడించిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ టీమ్ రూ.15 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకుంది.

45
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో మెరిసిన స్టార్స్
Image Credit : X/Congress4TS

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో మెరిసిన స్టార్స్

హైదరాబాద్ హీరోస్ టీమ్ వన్-సైడెడ్ విక్టరీ కొట్టడం వెనుక ఆటగాళ్ల క్లినికల్ ఫినిషింగ్ ఉంది. ముఖ్యంగా ఫ్రాన్సిస్కో కాస్కుల్లోలా, తైతైఫోనో తావితాకు, శివమ్ శుక్లా, మాన్యుయెల్ మోరెనో, మారిస్ లాంగ్ లీడ్‌లో ఉండి టీమ్‌ను నడిపించారు. సెకండ్ హాఫ్‌లో డీగో అర్డావో రెండు అదిరిపోయే గోల్స్ చేయగా, కెవిన్ వెకేసా, టెరియో తమాని కూడా గోల్స్ బాది ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. ముంబై టీమ్ వైపు నుంచి ఇథన్ మెక్‌ఫార్లాండ్, జేమ్స్ టర్నర్, సుకూమార్ హెంబ్రోమ్ పోరాడినప్పటికీ హైదరాబాద్ కట్టడిని దాటలేకపోయారు.

55
గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్.. రాహుల్ బోస్ హర్షం
Image Credit : X/TelanganaCMO

గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్.. రాహుల్ బోస్ హర్షం

రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ మాట్లాడుతూ.. ఈ సీజన్ గత ఏడాది కంటే అన్ని రకాలుగా సూపర్ సక్సెస్ అయిందని, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రాక, బ్రాడ్‌కాస్టింగ్ టెక్నాలజీ, భారీగా వచ్చిన క్రౌడ్ లీగ్ స్థాయిని పెంచాయని అన్నారు. అలాగే ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా జరగడం వల్ల రగ్బీలో మహిళలకు మంచి కెరీర్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీఎంఆర్ స్పోర్ట్స్ సీఎంబీ సుజోయ్ గంగూలీ మాట్లాడుతూ యువ అథ్లెట్లకు ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రావడం రగ్బీకి ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్‌ను చూపిస్తోందని, ఈ ఈవెంట్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా మారిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

Hyderabad Hosts Rugby Premier League Finals; CM Revanth Reddy Attends as Chief Guest

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో RUGBY PREMIER LEAGUE ఫైనల్స్. 

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 

హాజరైన ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, SARG… pic.twitter.com/XSQlYBq7lX

— Congress for Telangana (@Congress4TS) June 28, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CWG 2026: ఒక్క పంచ్‌తో పాక్ కథ ఖతం.. గోల్డే టార్గెట్ అంటున్న జాదుమణి సింగ్ !
Recommended image2
Long Jump Queen: ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ ఈమెనే.. ఎవరీ ఆన్సీ సోజన్?
Recommended image3
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Related Stories
Recommended image1
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Recommended image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved