MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Long Jump Queen: ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ ఈమెనే.. ఎవరీ ఆన్సీ సోజన్?

Long Jump Queen: ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ ఈమెనే.. ఎవరీ ఆన్సీ సోజన్?

Long Jump Queen: భారత అథ్లెటిక్స్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ నమోదైంది. అంజు బాబీ జార్జ్ 22 ఏళ్ల ఓల్డ్ లాంగ్ జంప్ నేషనల్ రికార్డును కేరళ స్టార్ అథ్లెట్ ఆన్సీ సోజన్ బ్రేక్ చేసింది. ఇండియా కొత్త లాంగ్ జంప్ క్వీన్ గా ఘనత సాధించింది. ఎవరీ ఆన్సీ సోజన్?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 28 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంజు బాబీ జార్జ్ 22 ఏళ్ల రికార్డు బద్దలు.. కొత్త లాంగ్ జంప్ క్వీన్‌గా ఆన్సీ సోజన్
Image Credit : X/India_AllSports

అంజు బాబీ జార్జ్ 22 ఏళ్ల రికార్డు బద్దలు.. కొత్త లాంగ్ జంప్ క్వీన్‌గా ఆన్సీ సోజన్

భారత అథ్లెటిక్స్ హిస్టరీలో ఒక హిస్టారికల్ మూమెంట్ నమోదైంది. కేరళకు చెందిన 25 ఏళ్ల స్టార్ లాంగ్ జంపర్ ఆన్సీ సోజన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ గా ఆమె నిలిచింది. దిగ్గజ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ పేరు మీద 22 ఏళ్లుగా ఉన్న నేషనల్ రికార్డును ఆన్సీ ఇప్పుడు బద్దలు కొట్టింది.

భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 'నేషనల్ ఇంటర్-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026'లో ఆన్సీ సోజన్ ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది. గ్రౌండ్‌లో ఏకంగా 6.88 మీటర్ల దూరం దూకి రికార్డుల మోత మోగించింది. గతంలో భారత్‌కు చెందిన లెజెండ్రీ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో 6.83 మీటర్ల దూరం దూకి ఈ నేషనల్ రికార్డును సెట్ చేశారు. గత 22 ఏళ్లుగా ఏ ఒక్క ఇండియన్ విమెన్ అథ్లెట్ కూడా కనీసం ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. కానీ, ఆన్సీ సోజన్ తాజాగా ఆ పాత రికార్డును బద్దలు కొట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐదో ప్రయత్నంలో రికార్డ్ బ్లాస్ట్
Image Credit : X/OlympicKhel

ఐదో ప్రయత్నంలో రికార్డ్ బ్లాస్ట్

ఈ కాంపిటీషన్‌లో ఇండియన్ నేవీ కి ప్రాతినిధ్యం వహించిన ఆన్సీ సోజన్, గేమ్ స్టార్టింగ్ నుంచే ఫుల్ ఫామ్‌లో కనిపించింది. తన ఐదో ప్రయత్నంలో ఏకంగా 6.88 మీటర్ల దూరాన్ని కవర్ చేసి సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జరగబోయే 'వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్' కంటే ముందే ఆన్సీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో, వరల్డ్ లెవెల్‌లో భారత్‌కు పతకం వచ్చే ఛాన్సులు భారీగా పెరిగాయి.

Related Articles

Related image1
ITR Filing: ఐటీఆర్ అలర్ట్.. కొత్త పన్ను విధానంలో దాగున్న ఆ 5 సీక్రెట్ బెనిఫిట్స్ ఇవే
Related image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
35
ఆసియా లెవెల్‌లో టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన ఆన్సీ సోజన్
Image Credit : X/OlympicKhel

ఆసియా లెవెల్‌లో టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన ఆన్సీ సోజన్

ఈ 6.88 మీటర్ల హిస్టారికల్ పర్ఫార్మెన్స్‌తో ఆన్సీ సోజన్ ఇంటర్నేషనల్ లెవెల్‌లోనూ తన పవర్ ఏంటో చూపించింది. ఆసియా అథ్లెటిక్స్ హిస్టరీలోనే ఆల్‌టైమ్ బెస్ట్ విమెన్ లాంగ్ జంపర్ల లిస్ట్‌లో ఆమె 8వ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, గత 20 ఏళ్ల హిస్టరీలో ఆసియా వ్యాప్తంగా 6.85 మీటర్ల కంటే ఎక్కువ దూరం దూకిన రెండో విమెన్ అథ్లెట్‌గా ఆన్సీ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

45
బరువు పెరిగినా తగ్గలేదు.. 22 ఏళ్ల నాటి ఒలింపిక్ రికార్డును లేపేసిన ఆన్సీ సోజన్
Image Credit : X/OlympicKhel

బరువు పెరిగినా తగ్గలేదు.. 22 ఏళ్ల నాటి ఒలింపిక్ రికార్డును లేపేసిన ఆన్సీ సోజన్

ఆన్సీ సాధించిన ఈ అద్భుతమైన సక్సెస్ వెనుక ఒక ఎమోషనల్ స్ట్రగుల్ స్టోరీ ఉంది. గతేడాది ఆమె తీవ్రమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడింది. దీనివల్ల ఆమె బరువు చాలా వేగంగా పెరిగిపోయింది. ఒక లాంగ్ జంప్ అథ్లెట్‌కు పెరిగిన బరువుతో రన్‌వే మీద అంత స్పీడ్‌గా పరిగెత్తడం, టేకాఫ్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది చాలా కష్టమైన టాస్క్.

బరువు తగ్గడం ఆన్సీకి చాలా పెద్ద ఛాలెంజ్‌గా మారిన టైమ్‌లో ఆమె కోచ్ అండగా నిలిచారు. ఆ కష్ట కాలం గురించి ఆన్సీ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. "మనం స్పోర్ట్స్ లో హయ్యస్ట్ లెవెల్‌లో పర్ఫార్మ్ చేయాలంటే త్యాగం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. నా కష్ట కాలంలో మా కోచ్ అనూప్ జోసెఫ్ నాకు ఇదే చెప్పారు. మేము మా ట్రైనింగ్, డైట్‌లో చాలా కఠినమైన మార్పులు చేశాం. ఆ హార్డ్ వర్క్ వల్లే ఈరోజు మైదానంలో కొత్త నేషనల్ రికార్డు సాధ్యమైంది" అని ఆన్సీ చెప్పుకొచ్చింది.

55
సూపర్ హిట్‌గా ఆన్సీ కెరీర్ గ్రాఫ్
Image Credit : X/OlympicKhel

సూపర్ హిట్‌గా ఆన్సీ కెరీర్ గ్రాఫ్

25 ఏళ్ల ఆన్సీ సోజన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆమె క్రమంగా సక్సెస్ మెట్లు ఎక్కుతూ వస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో ఆమె కన్సిస్టెంట్‌గా పతకాలు గెలుస్తోంది. 2023 ఏషియన్ గేమ్స్‌లో ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2025 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇక 2026 లో రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో 6.76 మీటర్ల దూరం దూకి ఏషియన్ గేమ్స్ క్వాలిఫికేషన్ మార్క్‌ను రీచ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్‌గా 2026 ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 6.88 మీటర్లతో గోల్డ్ మెడల్ నెగ్గడమే కాకుండా, సరికొత్త నేషనల్ రికార్డును కూడా క్రియేట్ చేసింది. 

A massive 6.88m jump by Ancy Sojan breaks Anju Bobby George's 22 year old women's long jump record of 6.83m at the Inter State Athletics Championships! Huge huge jump for the 25 year old!. pic.twitter.com/roOA8pQ0Xk

— jonathan selvaraj (@jon_selvaraj) June 27, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
ITR Filing: ఐటీఆర్ అలర్ట్.. కొత్త పన్ను విధానంలో దాగున్న ఆ 5 సీక్రెట్ బెనిఫిట్స్ ఇవే
Recommended image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved