MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Egg Price : ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. ఈ ఎగ్ ఎంత స్పెషలో తెలుసా..?

Egg Price : ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. ఈ ఎగ్ ఎంత స్పెషలో తెలుసా..?

Egg Price : కేవలం ఒక్క ఎగ్ ధర ఏకంగా రూ.25 వేలా..? ఈ ధర విని ఆశ్చర్యపోతున్నారా..? ఈ ధర ఎక్కడో కాదు మన దేశంలోనే. ఈ కోడిగుడ్డు రికార్డు ధర వెనక ఆసక్తికరమైన స్టోరీ ఉంది.. అదేంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 06 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒక్క గుడ్డు ధర ఇంతా..!
Image Credit : Getty

ఒక్క గుడ్డు ధర ఇంతా..!

Egg Price : సాధారణంగా కోడిగుడ్డు ధర ఎంతుంటుంది..? ఇండియాలో ఎక్కడికి వెళ్లినా రూ.5 నుండి రూ.10 వరకు ఉంటుంది. ఇంకా కాస్ట్లీ అంటే డజన్ రూ.100 వరకు ఉంటాయి. కానీ ఒక్కటి... కేవలం ఒకేఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా రూ.25 వేలు. అవును.. మీరు వింటున్నది నిజమే... ఓ కోడిగుడ్డును అక్షరాలా ఇరవైఐదు వేలకు అమ్ముడుపోయింది. ఒక్క గుడ్డు ధర ఇంతా..! అని ఆశ్చర్యపోతున్నారా... అయితే కాస్ట్లీ ఎగ్ వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లద్దాఖ్ ఎగ్ కు రికార్డు ధర..
Image Credit : Unsplash

లద్దాఖ్ ఎగ్ కు రికార్డు ధర..

ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులకు దిగింది... కేవలం ఆర్మీ, అణు స్ధావరాలనే కాదు సామాన్య ప్రజలను కూడా టార్గెట్ చేస్తోంది.. స్కూళ్లు, జనావాసాలపై కూడా దాడులు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇరాన్ ప్రజలకు ఇండియా మానవతా దృక్పథంలో సాయం చేస్తోంది. ప్రజలు కూడా ఇరాన్ కు సాయంగా విరాళాలు సేకరిస్తున్నారు.

ఇరాన్ కోసం భారతీయులు వివిధ రకాలుగా విరాళాలు సేకరిస్తున్నారు... ఇలా ఇటీవల లద్దాఖ్ లో చేపట్టిన విరాళాల సేకరణ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లేహ్ లో ఓ కోడిగుడ్డును వేలం వేశారు... ఇందులో వచ్చే మొత్తాన్ని ఇరాన్ కు అందిస్తామని ప్రకటించారు. దీంతో షబ్బీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ గుడ్డును ఏకంగా రూ.25 వేలకు దక్కించుకున్నాడు. ఇలా ఇరాన్ ప్రజలకు ఒక్క కోడిగుడ్డు భారీ సాయాన్ని అందించింది.

Related Articles

Related image1
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Related image2
Egg: రోజుకి ఒక కోడిగుడ్డు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
34
ఇరాన్ చిన్నారుల కోసం ఇండియా సాయం...
Image Credit : Getty

ఇరాన్ చిన్నారుల కోసం ఇండియా సాయం...

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులు కొనసాగుతున్నాయి. పైకి ఇరాన్ ఈ దాడులకు తిప్పికొడుతున్నట్లు గంభీరంగానే కనిపిస్తోంది.. కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి... దీంతో ఆకలిబాధలు పెరిగిపోయాయి. తినడానికే తిండిలేదు... ఇక పౌష్టికాహారం గురించి మాట్లాడే పరిస్థితే లేదు.

ఇరాన్ లో చిన్నారులు తీవ్ర అణచివేతకు గురవుతున్నారు... పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వీరికి సాయంగానే లద్దాఖ్ లో పౌష్టికాహారం అయినా కోడిగుడ్డును వేలం వేశారు. ఇదికాస్తా రికార్డు ధర పలికింది. ఈ రూ.25 వేలతో పాటు వివిధ పద్దతుల్లో సేకరించిన విరాళాలను ఇరాన్ లో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉపయోగిస్తామని నిర్వహకులు చెబుతున్నారు.

44
ధరాభారంతో ఇరాన్ ప్రజలు విలవిల..
Image Credit : Getty

ధరాభారంతో ఇరాన్ ప్రజలు విలవిల..

యుద్దం ఎఫెక్ట్ ఇరాన్ ప్రజలపై గట్టిగానే పడింది... వారి జీవితాలను తలకిందులు చేసింది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు లక్షలకు చేరాయి. ఇరాన్ లో లీటర్ పాలు 6,50,000, కిలో బియ్యం 2.8 మిలియన్ల ఇరానియన్ రియాల్ పలుకుతోంది... దీన్నిబట్టే ధరలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. డజను గుడ్లు కూడా 1.5 మిలియన్ ఇరానియన్ రియాల్ ఉంది. యుద్దం కారణంగా ఇరానియల్ రియాల్ కరెన్సీ పతనం అయ్యింది... దీంతో ఏకంగా కోటి రూపాయల విలువైన కరెన్సీని కూడా వాడుకలో తెచ్చింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
యుద్ధం
వైరల్ న్యూస్
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Recommended image2
Now Playing
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
Recommended image3
Now Playing
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System
Related Stories
Recommended image1
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Recommended image2
Egg: రోజుకి ఒక కోడిగుడ్డు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved