Egg: రోజుకి ఒక కోడిగుడ్డు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
food-life Mar 25 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
ప్రోటీన్‌కు బెస్ట్ సోర్స్
గుడ్లు ప్రోటీన్‌తో నిండిన పోషకాహారం. ఇవి శరీర పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయి.
Image credits: Our own
Telugu
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
గుడ్డులో 'కోలిన్' అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది 'అసిటైల్‌కోలిన్' అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది జ్ఞాపకశక్తికి చాలా ముఖ్యం.
Image credits: Getty
Telugu
కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తుంది
రోజూ గుడ్డు తినడం వల్ల కళ్లకు రక్షణ లభిస్తుంది. గుడ్డు పచ్చసొనలో ఉండే 'లుటిన్', 'జియాక్సంతిన్' అనే పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి భరోసా
గుడ్డులో సల్ఫర్ అధికంగా ఉండే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు, చర్మం, గోళ్లకు అవసరమైన 'కెరాటిన్' అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి సహాయపడతాయి.
Image credits: social media
Telugu
విటమిన్ ఎ, ఇ
గుడ్డులోని తెల్లసొనతో పోలిస్తే, పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి.
Image credits: freepik
Telugu
బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ ఆప్షన్
గుడ్డులో క్యాలరీలు చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన పోషకాహారం.
Image credits: social media
Telugu
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
గుడ్డులో ప్రోటీన్, సెలీనియం, విటమిన్లు ఎ, డి, బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
Image credits: freepik
Telugu
చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది
గుడ్డులో ఉండే 'అల్బుమిన్' అనే ప్రోటీన్ చర్మానికి లోతైన తేమను, పోషణను అందిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Image credits: freepik
Telugu
కాలేయానికి రక్షణ
ప్రోటీన్, కోలిన్ పుష్కలంగా ఉండే గుడ్డు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.