MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • పాకిస్థాన్ అణు బాంబులు ఎక్కడ దాచిపెట్టిందో తెలుసా?

పాకిస్థాన్ అణు బాంబులు ఎక్కడ దాచిపెట్టిందో తెలుసా?

పాకిస్థాన్ అణు ఆయుధాల నిల్వలు ఎక్కడున్నాయన్న విషయం‌పై 2023లో వెల్లడైన ఓ  నివేదిక కీలకంగా మారింది. ఈ అంశానిక సంబంధించి మస్రూర్ ఎయిర్ బేస్ ప్రాధాన్యత పొందింది. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 01 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pakistan nuclear weapons

Pakistan nuclear weapons

ఇటీవల ఇండియాలోని కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. పహల్గాంలోని మినీ న్యూజిలాండ్ గా పేరుగాంచిన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు అమాయక టూరిస్ట్ లపై కాల్పులకు తెగబడ్డారు.  ఈ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల అణు సామర్థ్యాలపై ప్రపంచ మీడియా ఆసక్తిగా వార్తలు వెలువడిస్తున్నాయి. ఈ క్రమంలో 2023లో విడుదలైన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) నివేదికలో పాకిస్థాన్ అణు ఆయుధాల విషయంలో కీలక వివరాలు వెల్లడయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Pakistan nuclear weapons

Pakistan nuclear weapons

ఈ నివేదిక ప్రకారం... 2023 నాటికి పాకిస్థాన్ వద్ద సుమారు 170 అణు ఆయుధాలు ఉన్నాయని అంచనా. తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య 172కి చేరింది. అయితే పాకిస్థాన్ ఇంకా భారత్ కంటే వెనుకబడ్డ దేశంగా ఉందని, భారత్ వద్ద సుమారు 180 అణు ఆయుధాలు ఉన్నాయని పేర్కొంది.
 

Related Articles

Related image1
India Pakistan Tension : బరితెగిస్తున్న పాక్ ... వరుస కాల్పులతో కవ్వింపు
Related image2
ఇండియా, పాకిస్థాన్ వివాదంలో రంగంలోకి అమెరికా
35
Pakistan nuclear weapons

Pakistan nuclear weapons

పాకిస్థాన్ సంవత్సరానికి సుమారు 14 నుంచి 27 కొత్త అణు ఆయుధాలను తయారు చేసే ప్రయత్నంలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా, పాకిస్థాన్ మిరాజ్ III మరియు మిరాజ్ V వంటి ఫైటర్ జెట్‌ లను అణు ఆయుధాల పంపిణీకి వినియోగిస్తోంది. ఈ విమానాలు రెండు ప్రధాన ఎయిర్ బేస్‌లలో ఉన్నాయని పేర్కొనగా, మస్రూర్ ఎయిర్ బేస్ (కరాచీ సమీపంలో) వాటిలో ఒకటిగా వివరించింది. పాకిస్థాన్ తన అణు ఆయుధాల ఒక భాగాన్ని ఇక్కడే దాచి ఉండవచ్చని అంచనా.

45
Pakistan nuclear weapons

Pakistan nuclear weapons

ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్వోసి వెంబడి పాకిస్థాన్ సైన్యం ఐదోరోజు కూడా  కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులు కుప్వారా, బారాముల్లా మరియు అఖ్నూర్ సెక్టర్లను జరిగాయి. భారత సైన్యం  ఈ కాల్పులకు దీటుగా స్పందించినట్టు రక్షణ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 

55
Pakistan nuclear weapons

Pakistan nuclear weapons

ఈ విధంగా ఒకవైపు అణు ఆయుధాల కలవరం, మరోవైపు సరిహద్దు కాల్పులతో భారత్–పాకిస్థాన్ సంబంధాలు తీవ్ర సంక్షోభ దశలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పాకిస్తాన్
భారత దేశం
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
India Pakistan Tension : బరితెగిస్తున్న పాక్ ... వరుస కాల్పులతో కవ్వింపు
Recommended image2
ఇండియా, పాకిస్థాన్ వివాదంలో రంగంలోకి అమెరికా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved