MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • పాముకాటుతో చ‌నిపోయాడ‌ని గంగా న‌దిలో వ‌దిలేశారు.. క‌ట్ చేస్తే, 8 ఏళ్ల త‌ర్వాత ఊహించ‌ని ట్విస్ట్

పాముకాటుతో చ‌నిపోయాడ‌ని గంగా న‌దిలో వ‌దిలేశారు.. క‌ట్ చేస్తే, 8 ఏళ్ల త‌ర్వాత ఊహించ‌ని ట్విస్ట్

Viral News: బీహార్‌లో జరిగిన ఒక విచిత్ర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాముకాటుతో చనిపోయాడని భావించి గంగానదిలో వదిలేసిన బాలుడు.. ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి వేషంలో తిరిగి తన గ్రామానికి వ‌చ్చిన సంఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 09 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాముకాటుతో చనిపోయాడని భావించిన కుటుంబం
Image Credit : Gemini AI

పాముకాటుతో చనిపోయాడని భావించిన కుటుంబం

బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లా మనోపూర్ ముషహరి గ్రామానికి చెందిన రాహుల్ అనే 12 ఏళ్ల బాలుడు ఎనిమిదేళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట అతడిని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాహుల్ చనిపోయాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని గంగానదిలో నిమజ్జనం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి రూపంలో
Image Credit : Gemini AI

ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి రూపంలో

ఇటీవల ఒక యువ సన్యాసి చేతిలో సారంగి పట్టుకుని గ్రామానికి వచ్చాడు. తానే ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడని భావించిన రాహుల్‌నని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతడు నేరుగా తన తల్లిని గుర్తించడమే కాకుండా తండ్రి, అన్న, బాబాయి, అత్త పేర్లను కూడా చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పుడే శరీరంపై ఏర్పడిన గాయం గుర్తును కూడా గ్రామస్థులు గుర్తించి, ఇతడే రాహుల్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Related Articles

Related image1
నీ క‌ష్టాన్ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నావా.? మీ ఆలోచ‌న‌ను మార్చే క‌థ
Related image2
Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?
35
అస‌లేం జ‌రిగిందంటే.?
Image Credit : Gemini AI

అస‌లేం జ‌రిగిందంటే.?

ఆ యువకుడు చెప్పిన కథ మరింత ఆసక్తికరంగా ఉంది. గంగలో తనను వదిలేసినప్పుడు తాను పూర్తిగా చనిపోలేదని, ఇంకా శ్వాస తీసుకుంటున్నానని తెలిపాడు. నదిలో కొట్టుకుపోతూ మొకామా ఘాట్‌కు చేరుకున్నానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనను రక్షించి గోరఖ్‌పూర్‌కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే ఆధ్యాత్మిక విద్య నేర్పించి, ఎన్నేళ్ల పాటు సన్యాస జీవితం గడిపించిన తర్వాత తన గురువు "నీ తల్లి దగ్గరకు వెళ్లి భిక్ష అడుగు" అని పంపించాడని వివరించాడు.

45
రూ.2 లక్షలు ఇవ్వాల‌ని..
Image Credit : Gemini AI

రూ.2 లక్షలు ఇవ్వాల‌ని..

రాహుల్‌ గ్రామంలో కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి గోరఖ్‌పూర్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడికి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి, తన గురువుకు చికిత్స, పెంపకం కోసం ఖర్చైన డబ్బుగా రూ.2 లక్షలు ఇవ్వాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పేద కూలీ కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని వెంటనే సమకూర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

55
డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటున్న హేతువాదులు
Image Credit : Gemini AI

డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటున్న హేతువాదులు

ఈ ఘటనపై హేతువాద సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా ఇతడే రాహుల్ కాదా అన్నది నిర్ధారించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. పుట్టిన ధ్రువపత్రాలు, పాత రికార్డులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు పరిశీలించడంతో పాటు అవసరమైతే DNA పరీక్ష కూడా నిర్వహించాలని సూచిస్తున్నాయి. శాస్త్రీయ ఆధారాలతో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన బీహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
Recommended image2
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!
Recommended image3
India Day FIA Event: న్యూయార్క్‌లో భారత మువ్వన్నెల వెలుగులు.. త్రివర్ణ కాంతుల్లో మెరిసిన ఎంపైర్ స్టేట్ భవనం
Related Stories
Recommended image1
నీ క‌ష్టాన్ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నావా.? మీ ఆలోచ‌న‌ను మార్చే క‌థ
Recommended image2
Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved