MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?

Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?

Kalki bhagwan: కల్కి భగవాన్ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు బాగా వినిపించింది. ఆధ్యాత్మిక గురువుగా పరిచయమైన విజయ్ కుమార్ త‌ర్వాత 'కల్కి భగవాన్', 'అమ్మ భగవాన్' పేర్లతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 08 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలు కల్కి భగవాన్ ఎవరు?
Image Credit : kalki bhagavan/Facebook

అసలు కల్కి భగవాన్ ఎవరు?

కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. 1949లో తమిళనాడులో జన్మించిన ఆయన చెన్నైలో చదువుకున్నారు. డీజీ వైష్ణవ్ కాలేజీలో గణితాన్ని అభ్యసించిన తర్వాత కొంతకాలం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక, ప్రత్యామ్నాయ విద్య వైపు అడుగులు వేశారు. 1980ల మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో 'జీవాశ్రమం' పేరుతో ఒక రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆత్మపరిశీలనపై దృష్టి పెట్టే విధంగా ఈ సంస్థను తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం ఈ ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కూడా కేంద్రంగా మారింది. 1980ల చివర్లో విజయ్ కుమార్ తనను విష్ణువు కల్కి అవతారంగా భావించే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన భార్య పద్మావతి 'అమ్మ భగవాన్' పేరుతో అనుచరులకు పరిచయమయ్యారు. ఈ దంపతుల చుట్టూ ఏర్పడిన ఆధ్యాత్మిక ఉద్యమం తరువాత 'వన్‌నెస్' పేరుతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కల్కి ఆశ్రమం ఎలా అంతగా పాపులర్ అయింది?
Image Credit : Kalki bhagwan/Facebook

కల్కి ఆశ్రమం ఎలా అంతగా పాపులర్ అయింది?

విజయ్ కుమార్ నాయుడు బోధనల్లో ప్రధానంగా ధ్యానం, ఆత్మపరిశీలన, అంతర్గత మార్పు, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన అనుచరులు తమలోని 'వేర్పాటు భావన' తగ్గి, అంతర్గతంగా మార్పు రావాలని ఈ బోధనల ఉద్దేశంగా వివరించేవారు. ఈ ఆధ్యాత్మిక ఉద్యమానికి వరదయ్యపాళెం ప్రధాన కేంద్రంగా మారింది. అక్కడ నిర్మించిన భారీ వన్‌నెస్ టెంపుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లటి పాలరాతి నిర్మాణంతో ఉన్న ఈ ఆలయం 2008లో ప్రారంభమైంది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది ఈ కేంద్రానికి వచ్చేవారు.

కాలక్రమంలో కల్కి భగవాన్‌కు భారీగా అభిమానులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆయన కార్యక్రమాలకు విదేశాల్లోనూ ప్రచారం లభించింది. ప్రముఖులు ఆశ్రమాన్ని సందర్శించడం, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సంస్థకు మరింత గుర్తింపు వచ్చింది. అయితే సంస్థ ఎదుగుదలతో పాటు వివాదాలు కూడా మొదలయ్యాయి. భూముల కొనుగోళ్లు, విరాళాలు, ఆర్థిక లావాదేవీలపై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి.

Related Articles

Related image1
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు
Related image2
నీ క‌ష్టాన్ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నావా.? మీ ఆలోచ‌న‌ను మార్చే క‌థ
35
2019 ఐటీ దాడులు.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన భారీ ఆస్తుల వ్యవహారం
Image Credit : Kalki bhagwan/Facebook

2019 ఐటీ దాడులు.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన భారీ ఆస్తుల వ్యవహారం

కల్కి భగవాన్ చుట్టూ ఉన్న వివాదాల్లో 2019లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలు అత్యంత కీలకమైన ఘటనగా నిలిచాయి. 2019 అక్టోబర్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కల్కి భగవాన్‌తో సంబంధం ఉన్న ఆశ్రమాలు, కార్యాలయాలు, కంపెనీలకు సంబంధించిన 40కిపైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ తెలిపింది.

ఈ సోదాల్లో రూ.500 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అందులో సుమారు రూ.409 కోట్ల నగదు రసీదులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో రూ.43.9 కోట్ల నగదు, సుమారు రూ.18 కోట్ల విలువైన అమెరికా కరెన్సీతో పాటు బంగారం, వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అప్పటి అధికారిక ప్రకటనల ఆధారంగా వార్తా సంస్థలు నివేదించాయి. మరో రిపోర్ట్‌ ప్రకారం సుమారు 88 కిలోల బంగారు ఆభరణాలు, 1,271 క్యారెట్ల వజ్రాలు కూడా గుర్తించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. మొత్తం గుర్తించిన లెక్కల్లో చూపని ఆదాయం రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

45
ఆ తర్వాత కల్కి భగవాన్ ఎక్కడికి వెళ్లారు?
Image Credit : Kalki bhagwan/Facebook

ఆ తర్వాత కల్కి భగవాన్ ఎక్కడికి వెళ్లారు?

2019 సోదాల తర్వాత కల్కి భగవాన్, ఆయన భార్య ప్రజల్లో కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. ఆ సమయంలో తాము దేశం విడిచి పారిపోలేదని, తాము క్షేమంగానే ఉన్నామని విజయ్ కుమార్ నాయుడు వీడియో సందేశం ద్వారా స్పష్టం చేసినట్లు అప్ప‌ట్లో వార్తల్లో వ‌చ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ నివసిస్తున్నారు, రోజువారీగా ఏం చేస్తున్నారు అనే విషయంపై ఎలాంటి స‌మాచారం లేదు.

కల్కి భగవాన్‌కు సంబంధించిన ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణలో ఆయన కుమారుడు ఎన్‌కేవీ కృష్ణ, కోడలు ప్రీతా కృష్ణ కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. 2017లో సంస్థను వారి ఆధ్వర్యానికి అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతరం 'ఏకం', 'O&O Academy' వంటి కొత్త పేర్లతో కొన‌సాగించారు.

55
కల్కి భగవాన్ కథలో అసలు మలుపు ఇదే..
Image Credit : Kalki bhagwan/Facebook

కల్కి భగవాన్ కథలో అసలు మలుపు ఇదే..

కల్కి భగవాన్ ప్రయాణాన్ని చూస్తే ఒక సాధారణ ఎల్‌ఐసీ ఉద్యోగి నుంచి భారీ ఆధ్యాత్మిక ఉద్యమానికి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథ కనిపిస్తుంది. జీవాశ్రమం నుంచి ప్రారంభమైన ప్రయాణం ఆ తర్వాత వన్‌నెస్ ఉద్యమంగా విస్తరించింది. ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ, అంతర్గత చైతన్యం వంటి అంశాలతో దేశ, విదేశాల్లో అనుచరులను సంపాదించారు. అయితే భారీగా ఎదిగిన సంస్థకు ఆర్థిక వ్యవహారాలు, భూములు, ఆస్తులు, సంస్థల నిర్మాణం వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. 2019 ఐటీ సోదాలు ఈ అంశాలపై దేశవ్యాప్తంగా దృష్టిని మళ్లించాయి. అదే సమయంలో సంస్థ నాయకత్వం క్రమంగా విజయ్ కుమార్ నుంచి ఆయన కుమారుడు, కోడలి వైపు మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi: కేవ‌లం ప్ర‌శ్నించ‌డ‌మే కాదు.. దేశ యువ‌త‌కు ప్ర‌ధాని మోదీ సూచన
Recommended image2
Now Playing
గుజరాత్‌లో వింత ఘటన అలల్లా ఎగసి పడుతున్న బావి నీళ్లు | Virparada village | Gujarat mysterious well
Recommended image3
Now Playing
డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu
Related Stories
Recommended image1
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు
Recommended image2
నీ క‌ష్టాన్ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నావా.? మీ ఆలోచ‌న‌ను మార్చే క‌థ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved