MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • National
  • మీరు ఎక్కేలోపే వందే భారత్ ట్రైన్ డోర్లు క్లోజ్ అయితే... ఏం చేయాలో తెలుసా..?

మీరు ఎక్కేలోపే వందే భారత్ ట్రైన్ డోర్లు క్లోజ్ అయితే... ఏం చేయాలో తెలుసా..?

Tips And Trick : మీరు వందే భారత్ రైల్లో ప్రయాణించాల్సి ఉందనుకుందాం. కానీ రైల్వే స్టేషన్ కు వెళ్లడం కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ డోర్లు క్లోజ్ అయ్యాయి. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 31 2026, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రైలు ప్రయాణ చిట్కాలు..
Image Credit : Gemini ai

రైలు ప్రయాణ చిట్కాలు..

Vande Bharat Train : ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన ఈ రైలును 2019 నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది మోదీ సర్కార్. కేవలం స్పీడ్ మాత్రమే కాదు సాధారణ రైళ్లకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి…సౌకర్యవంతమైన సీటింగ్ కలిగి ఉంటుంది.. అలాగే ప్రయాణికులకు, వైఫై, నాణ్యమైన ఫుడ్, మరింత భద్రత లభిస్తుంది. ఈ రైలు మరో ప్రత్యేకత ఏంటంటే అటోమేటిక్ ప్లగ్ డోర్లు... అంటే నిర్ణీత సమయంలో డోర్లు వాటికవే మూసుకుపోతాయన్నమాట.

అయితే వందే భారత్ రైల్లో ప్రయాణించేవారికి కొన్నిసార్లు ఈ ఆటోమేటిక్ డోర్ల వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. చాలా తక్కువ సమయం డోర్లు తెరిచివుండటం వల్ల కొందరు ట్రైన్ మిస్ అవుతున్నారు... మరికొందరు గమ్యస్థానంలో దిగలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వందే భారత్ ట్రైన్ డోర్లు మూసుకుపోతే ఏం చేయాలి..?
Image Credit : stockPhoto

వందే భారత్ ట్రైన్ డోర్లు మూసుకుపోతే ఏం చేయాలి..?

తొందరగా గమ్యస్థానాలకు చేరాలని భావించేవారే వందే భారత్ రైల్లో ప్రయాణాన్ని కోరుకుంటారు. అయితే రైల్వే స్టేషన్ కు చేరుకోవడం ఆలస్యం అవడంతో కొందరు వందే భారత్ ట్రైన్ మిస్ అవుతుంటారు. ట్రైన్ మనముందే మెళ్ళిగా కదులుతున్నా పరుగెత్తి ఎక్కలేం... ఎందుకంటే అప్పటికే అన్ని డోర్లు ఆటోమెటిక్ గా క్లోజ్ అవుతాయి.

అయితే ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తే ట్రైన్ ను పట్టుకోవచ్చు. వందే భారత్ ట్రైన్ ట్రైన్ అన్నిబోగీల డోర్లు క్లోజ్ అయినా చివర్లో గార్డ్ ఉండే బోగీ మాత్రం తెరిచివుంటుంది. కాబట్టి వెంటనే చివరిబోగీ వద్దకు చేరుకుని గార్డు బోగీలో ఎక్కవచ్చు... అక్కడినుండి మీరు బుక్ చేసుకున్న సీటువద్దకు చేరుకోవచ్చు.

Related Articles

Related image1
Vande Bharat Prices: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు.. టికెట్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Related image2
Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే
34
దిగకుండానే డోర్లు క్లోజ్ అయితే ఏం చేయాలి..?
Image Credit : stockPhoto

దిగకుండానే డోర్లు క్లోజ్ అయితే ఏం చేయాలి..?

లగేజీ ఎక్కువగా ఉండటంతో కొందరు నిర్ణీత సమయంలో వందే భారత్ రైలులోంచి దిగలేకపోతారు. ఇలాంటి సమయంలో కూడా చివరి బోగీకి చేరుకుని గార్డును రిక్వెస్ట్ చేసి దిగిపోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే ముందుగానే లగేజీతో డోర్ వద్దకు చేరుకోవడం ఉత్తమం.

44
వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ప్రారంభం...
Image Credit : Getty

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ప్రారంభం...

వందే భారత్ ట్రైన్స్ లో ప్రయాణానికి భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు... మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఇందులో ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారు. దీంతో ఇటీవల వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. జనవరి 22న అస్సాంలోని కామాఖ్య స్టేషన్, పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ మధ్య మొదటి వందేభారత్ స్లీపర్ ట్రైన్ పరుగుతీసింది.

అయితే దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ స్లీపర్ హైదరాబాద్ కు నడవనున్నట్లు సమాచారం. దేశ రాజధాని డిల్లీ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వందే భారత్ స్లీపర్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు నగరాల మధ్య నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు... వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ లగ్జరీ ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
చిట్కాలు మరియు ఉపాయాలు
ప్రయాణం
యుటిలిటీ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏపీ, తెలంగాణ నుంచి వాయు కాలుష్యం ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపిస్తుందా? అధ్య‌య‌నంలో విస్తుపోయే నిజాలు
Recommended image2
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Recommended image3
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Related Stories
Recommended image1
Vande Bharat Prices: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు.. టికెట్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved