Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • మీకు రాత్రి ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళ కనిపిస్తే ఏం చేస్తారు.? IAS ఇంటర్వ్యూలో అభ్యర్థి సమాధానం ఇదే

మీకు రాత్రి ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళ కనిపిస్తే ఏం చేస్తారు.? IAS ఇంటర్వ్యూలో అభ్యర్థి సమాధానం ఇదే

UPSC: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి. దేశానికి సేవ అందించే ఈ గొప్ప ఉద్యోగం కోసం చాలా మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. దేశ సేవ మాత్రమే కాకుండా మంచి జీవితం, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందీ యూపీఎస్సీ. ఇందులో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా, కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలు వింతగా ఉంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : Apr 15 2025, 10:24 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

ప్రశ్న 1: UPSC ఇంటర్వ్యూయర్: మీ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి సరైనది కానీ కష్టం, మరొకటి తప్పు కానీ సులువు. మీరు ఏది ఎంచుకుంటారు?

UPSC అభ్యర్థి తెలివైన సమాధానం: నేను నా సిద్ధాంతాలను వదులుకోకుండా గమ్యానికి చేర్చే దారి ఏదైనా ఎంచుకుంటాను, అది ఎంత కష్టమైనా సరే. ఎందుకంటే పరిపాలనా సేవలో నిజాయితీ, ధైర్యమే అతిపెద్ద ఆస్తి.

ప్రశ్న 2: UPSC ఇంటర్వ్యూయర్: ఒక రైతు, ఒక నాయకుడు, ఒక అధికారి.. ఈ ముగ్గురిలో ఎవరు చాలా ముఖ్యం?

UPSC అభ్యర్థి సమాధానం: ముగ్గురూ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటివాళ్లే. రైతు మనకు తిండి పెడతాడు, నాయకుడు దిశానిర్దేశం చేస్తాడు, అధికారి వ్యవస్థను అమలు చేస్తాడు. ఈ ముగ్గురూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 3: UPSC ఇంటర్వ్యూయర్: సిస్టమ్ బలహీనంగా ఉన్నప్పుడు IAS అధికారిగా మీరు అవినీతిని ఎలా ఎదుర్కొంటారు?

UPSC అభ్యర్థి సమాధానం: సిస్టమ్‌లో నిజాయితీపరులు, బలమైన వ్యక్తులు ఉంటేనే అది మారుతుంది. నేను ఒక మార్పు తీసుకురాగలిగే వ్యక్తిగా వ్యవస్థలో ఉంటూ దాన్ని బలోపేతం చేయగలను.

23
Asianet Image

ప్రశ్న 4: UPSC ఇంటర్వ్యూయర్: మీరు ఒక మహిళను రాత్రిపూట రోడ్డుపై ఒంటరిగా వెళ్తూ చూస్తే ఏం చేస్తారు?

UPSC అభ్యర్థి సమాధానం: ముందు ఆమె సురక్షితంగా ఉందో లేదో చూస్తాను. ఇబ్బందిగా అనిపిస్తే దగ్గరగా వెళ్తూ సహాయం చేస్తాను. అవసరమైతే లోకల్ పోలీసులకు కాల్ చేస్తాను. ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఆమె భద్రతను నిర్ధారించడమే నా లక్ష్యం.

ప్రశ్న 5: UPSC ఇంటర్వ్యూయర్: మీకు ఎప్పుడైనా చట్టం, నీతి మధ్య సంఘర్షణ వస్తే దేన్ని ఎంచుకుంటారు?

UPSC అభ్యర్థి సమాధానం: చట్టం, నీతి రెండూ కలిసే ఉంటాయి. కానీ సంఘర్షణ వస్తే చట్టాన్ని పాటిస్తూనే నైతిక విలువలకు విరుద్ధంగా లేని పరిష్కారం కోసం చూస్తాను.
 

33
Asianet Image

ప్రశ్న 6: UPSC ఇంటర్వ్యూయర్: మీరు మీ కుటుంబాన్ని దేశం కంటే ఎక్కువ ప్రేమిస్తారా?

UPSC అభ్యర్థి సమాధానం: నా కుటుంబమే నాకు దేశ సేవ చేసే సంస్కారాన్ని ఇచ్చింది. దేశానికి, కుటుంబానికి మధ్య ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో దేశాన్ని కూడా అలాగే కాపాడేవాడే నిజమైన దేశభక్తుడు.

ప్రశ్న 7: UPSC ఇంటర్వ్యూయర్: ఒక నేరస్థుడిని పట్టుకోవడానికి మీరు రూల్స్ తప్పితే ఏం చేస్తారు?

UPSC అభ్యర్థి సమాధానం: నేను నేరాలను ఎదుర్కోవడానికి చట్ట పరిధిలోనే పనిచేస్తాను. ఎందుకంటే రూల్స్ తప్పి నేరంతో పోరాడటం నేరానికి ఆహ్వానం పలికినట్టే అవుతుంది.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
భారత దేశం
విద్య
 
Recommended Stories
Honeymoon Murder case: మంగ‌ళ‌సూత్రం, టీష‌ర్ట్‌..   భ‌ర్త‌ను చంపిన భార్య‌ను ప‌ట్టించిన‌వి ఇవే..
Honeymoon Murder case: మంగ‌ళ‌సూత్రం, టీష‌ర్ట్‌.. భ‌ర్త‌ను చంపిన భార్య‌ను ప‌ట్టించిన‌వి ఇవే..
Honey Moon Murder Case: చంపేసింది చాలకా..ఏడేడు జన్మలకు నీవే తోడుగా ..అంటూ వాట్సాప్‌ స్టేటస్‌!
Honey Moon Murder Case: చంపేసింది చాలకా..ఏడేడు జన్మలకు నీవే తోడుగా ..అంటూ వాట్సాప్‌ స్టేటస్‌!
Crime: ఛీఛీ వీళ్లు అసలు మనుష జన్మే ఎత్తారా..కట్నంగా కిడ్నీ ఇవ్వలేదని..కోడలిని చితకబాదిన అత్తమామలు!
Crime: ఛీఛీ వీళ్లు అసలు మనుష జన్మే ఎత్తారా..కట్నంగా కిడ్నీ ఇవ్వలేదని..కోడలిని చితకబాదిన అత్తమామలు!
Top Stories