- Home
- National
- Traffic Rules: వాహనాలపై కులం పేర్లు రాసుకుంటే రూ. 2 వేలు ఫైన్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Traffic Rules: వాహనాలపై కులం పేర్లు రాసుకుంటే రూ. 2 వేలు ఫైన్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Traffic Rules: వాహనాలపై కులాల పేర్లు రాసుకోవడం కామన్. అయితే ఇకపై వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు కానీ గుర్తులు కానీ ఉండడానికి వీళ్లేదని ఆ రాష్ట రవాణా శాఖ స్పష్టం చేసింది. లేదంటే రూ. వేలు జరిమానా చెల్లించాలని, ఆదేశాలు జారీ చేశారు.

నెల రోజుల గడువు ఇచ్చిన రవాణా శాఖ
కార్లు, బైక్‌లు, ఇతర వ్యక్తిగత వాహనాలపై కులానికి సంబంధించిన పదాలు, ట్యాగ్‌లు లేదా గుర్తులు కనిపించకూడదని బిహార్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అలాంటి స్టిక్కర్లు ఉన్నవారు జూన్ మొదటి వారం లోపు వాటిని తొలగించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. రవాణా శాఖ ఈ విషయంపై అన్ని జిల్లా రవాణా అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపించింది. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్‌లు చేపట్టనున్నారు.

రూ. 2 వేల వరకు జరిమానా
మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలు విధించనున్నారు. సెక్షన్ 177 కింద రూ. 500 వరకు ఫైన్ ఉండగా, సెక్షన్ 179 ప్రకారం రూ. 2 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కుల ఆధారిత గుర్తింపులను ప్రదర్శించడం వల్ల సమాజంలో విభేదాలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే వాహనాలను వ్యక్తిగత గర్వం లేదా సామాజిక గుర్తింపు ప్రదర్శనగా ఉపయోగించకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రత్యేక తనిఖీలకు సిద్ధమవుతున్న అధికారులు గడువు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, హైవేలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. వాహనాల నంబర్ ప్లేట్‌ల దగ్గర లేదా వెనుక భాగంలో కులపేర్లు, సంఘ గుర్తులు కనిపిస్తే వెంటనే జరిమానా విధించే అవకాశం ఉంది. అధికారుల ప్రకారం, చాలామంది వాహనాలపై “యాదవ్”, “క్షత్రియ”, “బ్రాహ్మణ” వంటి పదాలను స్టిక్కర్ల రూపంలో ఉపయోగిస్తున్నారు. ఇకపై ఇలాంటి వాటిపై కఠిన నిఘా ఉండనుంది. చట్టపరమైన సమస్యలు రాకుండా ముందుగానే స్టిక్కర్లు తొలగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
సామాజిక ఐక్యతే ప్రధాన లక్ష్యం
సమాజంలో సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కుల ఆధారిత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో లేదా వాహనాలపై కుల, మత, రాజకీయ ఆధారిత గుర్తింపులను ప్రదర్శించడంపై నియంత్రణ అవసరం అని అధికారులు చెబుతున్నారు.
ఏఐ కెమెరాలతో ట్రాఫిక్ వ్యవస్థకు అప్‌గ్రేడ్
ట్రాఫిక్ నిబంధనల అమలులో సాంకేతికతను ఉపయోగించేందుకు బిహార్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఆధునిక ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాట్నా, గయా, భాగల్పూర్, ముజఫర్‌పూర్, దర్భంగా వంటి నగరాల్లో తొలి దశలో ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ స్మార్ట్ కెమెరాలు రెడ్ సిగ్నల్ జంపింగ్, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి.
నిబంధన ఉల్లంఘన జరిగిన వెంటనే ఫైన్ జారీ అయ్యేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. రియల్ టైమ్ వీడియో అనలిటిక్స్‌తో పనిచేసే ఈ టెక్నాలజీని భవిష్యత్తులో ఫేషియల్ రికగ్నిషన్‌తో అనుసంధానం చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి కమాండ్ సెంటర్ ద్వారా మొత్తం ట్రాఫిక్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండనుంది.

