MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • PURE EV Etrys: బైక్ ల‌వ‌ర్స్‌కి పండ‌గే.. 171 కిలోమీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ బైక్

PURE EV Etrys: బైక్ ల‌వ‌ర్స్‌కి పండ‌గే.. 171 కిలోమీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ బైక్

PURE EV Etrys: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్యూర్ ఈవీ రూపొందించిన ప్యూర్ ఈవీ Etryst 350 బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 09 2026, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్క ఛార్జ్‌తో 171 కిలోమీటర్ల రేంజ్
Image Credit : pureenergy.co.in

ఒక్క ఛార్జ్‌తో 171 కిలోమీటర్ల రేంజ్

PURE EV Etryst 350 బైక్‌లో Etryst 350 X అనే ఒకే వేరియంట్ అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 171 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఈ బైక్ గరిష్ఠ వేగం గంటకు 94 కిలోమీటర్లు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, సిటీ రైడ్స్‌కు ఇది మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. బైక్ బరువు సుమారు 120 కిలోలుగా ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు
Image Credit : pureenergy.co.in

బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు

ఈ బైక్‌లో 3.5 కిలోవాట్ లిథియమ్ అయాన్ బ్యాటరీ అమర్చారు. బ్యాటరీ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. కంపెనీ బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. అలాగే మోటార్‌పై 1 సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది.

Related Articles

Related image1
Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?
Related image2
Mini Speaker: జ‌స్ట్ రూ. 500 మాత్ర‌మే.. ఈ స‌మ్మ‌ర్‌లో మీ పిల్ల‌లకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే
35
ధర ఎంత? ఏ రంగుల్లో లభిస్తుంది?
Image Credit : pureenergy.co.in

ధర ఎంత? ఏ రంగుల్లో లభిస్తుంది?

PURE EV Etryst 350 ధర సుమారు రూ.1,53,545గా ఉంది. ఈ బైక్ బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు స్పోర్టీ లుక్ ఉండటంతో యువతను ఈ బైక్ బాగా ఆకట్టుకుంటోంది.

45
బ్రేకింగ్, సస్పెన్షన్ ఫీచర్లు
Image Credit : pureenergy.co.in

బ్రేకింగ్, సస్పెన్షన్ ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చారు. అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు కూడా అందించారు. ముందు, వెనుక హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ ఉండటంతో రోడ్డు గుంతలు ఉన్నా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం ఇస్తుంది.

55
అడ్వాన్స్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న బైక్
Image Credit : pureenergy.co.in

అడ్వాన్స్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న బైక్

PURE EV Etryst 350లో డిజిటల్ డిస్‌ప్లే, డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే లో బ్యాటరీ ఇండికేటర్, స్టాండ్ అలర్ట్, హజార్డ్ వార్నింగ్ సిస్టమ్ కూడా అందించారు. USB ఛార్జింగ్ పోర్ట్, కీ లెస్ లాక్, సెల్ఫ్ స్టార్ట్, రివర్స్ మోడ్, స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. LED హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్, పిలియన్ సీట్, 7 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ప్రీమియంగా మారుస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bikes: ఈ బైక్స్ కొంటే ప‌క్కా పైసా వ‌సూల్‌.. దేశంలో ఎక్కువ రీసేల్ వాల్యూ ఉన్న బైక్స ఇవే
Recommended image2
Best Bikes: పెట్రోల్ ధ‌ర‌లు ఎంతైనా పెర‌గ‌ని.. జొమాటో, రాపిడో బాయ్స్‌కి ఈ బైక్స్ వ‌రం
Recommended image3
EV Scooter: ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం.. అదిరిపోయే ఫీచ‌ర్లతో
Related Stories
Recommended image1
Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?
Recommended image2
Mini Speaker: జ‌స్ట్ రూ. 500 మాత్ర‌మే.. ఈ స‌మ్మ‌ర్‌లో మీ పిల్ల‌లకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved