Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

Telangana Thalli : తెలంగాణ తల్లిగా మారిన తెలుగుతల్లి ఫ్లైఓవర్
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని ప్రసిద్ధ ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’కు కొత్త పేరు పెట్టారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా దీన్ని ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. 1997లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేసిన ఈ ఫ్లైఓవర్ ఎనిమిదేళ్లపాటు నిర్మాణం కొనసాగి, 2005లో మంత్రి కొనేరు రంగారావు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత పేరుమార్పు అవసరమని చర్చ నడుస్తుండగా, ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలోని స్టాండింగ్ కమిటీ తీర్మానంతో అధికారికంగా కొత్త పేరు పెట్టారు.
Heavy Rains : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగుల ప్రమాదం ఉండటంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గోదావరి, కృష్ణా నదుల్లో వరదప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కాగా, భద్రాచలం, కూనవరం, పోలవరం వద్ద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Vijay : కరూర్ విషాదంపై విజయ్ ఆవేదన: “నిజం త్వరలో వెలుగులోకి వస్తుంది”
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ దళపతి ఎన్నికల ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘోర విషాదానికి దారితీసింది. అభిమానుల గుంపులు అదుపుతప్పడంతో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో విజయ్ భావోద్వేగంగా స్పందిస్తూ, “నా జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ అనుభవించలేదు. ప్రజల భద్రతే నాకు ముఖ్యం. నిజం త్వరలో బయటకు వస్తుంది” అని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
India - USA : ట్రంప్ టారిఫ్.. భారత కలప, ఫర్నిచర్‌పై సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా కలపతో తయారు చేసిన ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్లు, ఇతర కలప ఉత్పత్తులపై సుంకాలను ప్రకటించారు. విదేశీ ఉత్పత్తులను అమెరికాలో ఖరీదైనదిగా మారుస్తూ, స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త టారిఫ్‌లు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా, భారత ఫర్నిచర్ వ్యాపారం పై ప్రభావం ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
Cricket : మహిళల వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం.. భారత్ vs శ్రీలంక తొలి ఫైట్
మహిళల వన్డే ప్రపంచకప్ గౌహతిలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టులో ప్రతిక, స్మృతి మంధాన, డియోల్, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, అమన్‌జోత్, స్నేహ్‌రాణా, క్రాంతిగౌడ్, శ్రీచరణి ఉన్నారు.