MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Thalapathy Vijay Trisha: త్రిష ఎమ్మెల్యే కానున్నారా.? మంత్రి ప‌ద‌వి కూడా.? ఆస‌క్తిక‌ర చ‌ర్చ

Thalapathy Vijay Trisha: త్రిష ఎమ్మెల్యే కానున్నారా.? మంత్రి ప‌ద‌వి కూడా.? ఆస‌క్తిక‌ర చ‌ర్చ

Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. నటుడిగా అభిమానాన్ని సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే ప్రభావం చూపిస్తున్నారు. TVK పార్టీ 100కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారానికి దగ్గరపడుతోంది.

2 Min read
Author : Narender Vaitla
Published : May 04 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీవీకే దూకుడు పార్టీలకు షాక్
Image Credit : Asianet News

టీవీకే దూకుడు పార్టీలకు షాక్

ఈ ఎన్నికల్లో టీవీకే ప్రదర్శన రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దశాబ్దాలుగా తమిళనాడును ప్రభావితం చేసిన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి టీవీకే ముందంజలో ఉంది. ఓటర్లలో మార్పు కోరిక పెరగడం, కొత్త నాయకత్వంపై నమ్మకం పెరగడం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, కొత్త ఓటర్లు ఈసారి కీలక పాత్ర పోషించినట్టు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ నివాసం వద్ద సంబరాలు
Image Credit : ChatGPT

విజయ్ నివాసం వద్ద సంబరాలు

ఫలితాల ట్రెండ్స్ బయటకు వచ్చిన వెంటనే చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఆయన కుటుంబసభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ ఆనందంలో మునిగిపోయారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వేడుకల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

35
రెండు స్థానాల్లో విజయం దిశగా
Image Credit : ANI

రెండు స్థానాల్లో విజయం దిశగా

ఈ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చిలోని తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేశారు. ప్రస్తుతం ఈ రెండు చోట్లా ఆయనకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. రెండు స్థానాల్లో గెలిస్తే, నియమాల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ సీటు కొనసాగిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

45
ఖాళీ సీటుపై ఉత్కంఠ
Image Credit : X

ఖాళీ సీటుపై ఉత్కంఠ

విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేస్తే ఆ ఖాళీ సీటు కోసం ఎవరు బరిలో దిగుతారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా నటి త్రిష పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో టిక్కెట్ల విషయంలో ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారన్న వార్తలు రావడం వల్ల ఈ ప్రచారం మరింత బలపడింది. అంతేకాకుండా ఈ స్థానం నుంచి గెలిచిన త్రిష‌ను క్యాబినేట్‌లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది అని చ‌ర్చ న‌డుస్తోంది. అయితే మరోవైపు విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా పోటీ చేసే అవకాశం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

55
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం
Image Credit : Chat gpt

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం

ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు నాంది పలుకుతున్నాయి. కొత్త పార్టీ ఇంత పెద్ద స్థాయిలో ఎదగడం అరుదైన విషయం. టీవీకే ఆధిక్యం చూస్తే ప్రజలు మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతున్న ఈ పరిణామం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముందన‌డంలో సందేహం లేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
రాజకీయాలు
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image2
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Related Stories
Recommended image1
బ‌య‌ట రూ. 1500 ఉండే మందు బాటిల్ ఆర్మీ క్యాంటీన్‌లో రూ. 600కే ఎందుకు ల‌భిస్తుందో తెలుసా.?
Recommended image2
Cooler: కూలర్ నీళ్లు ఎక్కడికి పోతాయి? ఏసీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved