MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ

Krushi Rishi Certificates : సంప్రదాయ వ్యవసాయ జ్ఞానానికి గుర్తింపుగా శ్రీ సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవంలో 138 మంది రైతులకు కృషి ఋషి పట్టాలు, ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు అందజేశారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 30 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైతులకు అదిరిపోయే గౌరవం: దేశంలోనే తొలిసారి విశ్వవిద్యాలయ స్థాయిలో ‘కృషి   ఋషి’ సర్టిఫికెట్లు
Image Credit : Asianet News

రైతులకు అదిరిపోయే గౌరవం: దేశంలోనే తొలిసారి విశ్వవిద్యాలయ స్థాయిలో ‘కృషి - ఋషి’ సర్టిఫికెట్లు

దేశంలోనే తొలిసారిగా సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. ఏకంగా 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ (SSSUHE) 5వ స్నాతకోత్సవంలో ఈ వినూత్న ప్రయత్నం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పక్కాగా పరీక్షలు నిర్వహించి, రైతుల అనుభవానికి వర్సిటీ స్థాయిలో ఈ గుర్తింపు ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి.

ఇక్కడే 119 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 24 మందికి బంగారు పతకాలు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశారు. బుధవారం సత్యసాయి గ్రామంలోని ప్రేమామృతం ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ వైభవంగా జరిగింది. విశ్వవిద్యాలయ వ్యవస్థాపక కులపతి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఈ ఈవెంట్‌కు అధ్యక్షత వహించారు. మైసూపర్ కొదాగు ఎంపీ, మైసూరు రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ చీఫ్ గెస్ట్‌గా హాజరై డిగ్రీలు, పతకాలు, గౌరవ డాక్టరేట్లు అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రైతులకు ‘కృషి - ఋషి’ గౌరవం
Image Credit : Asianet News

రైతులకు ‘కృషి - ఋషి’ గౌరవం

చిక్కమగళూరు, త్రిప్టూరు (తుమకూరు జిల్లా), అరసీకెరె (హాసన్ జిల్లా) ప్రాంతాలకు చెందిన 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ సర్టిఫికెట్లు అందజేశారు. వారి సంప్రదాయ వ్యవసాయ జ్ఞానానికి, అనుభవానికి విశ్వవిద్యాలయం అధికారికంగా గుర్తింపు ఇచ్చింది.

సద్గురు శ్రీ మధుసూదన్ సాయి మాట్లాడుతూ.. సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానానికి ఇప్పటివరకు విద్యా వ్యవస్థలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు. "దేశంలోనే తొలిసారిగా రైతుల జ్ఞానం, అనుభవానికి వర్సిటీ ద్వారా గుర్తింపు ఇస్తున్నాం. ఈ ఏడాది 138 మంది రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చాం. వచ్చే స్నాతకోత్సవానికి కనీసం 2 వేల మంది రైతులకు ఈ గుర్తింపు ఇవ్వాలన్నదే మా టార్గెట్" అని స్పష్టం చేశారు.

36
ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ల ప్రదానం
Image Credit : Asianet News

ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ల ప్రదానం

సమాజంలో వివిధ రంగాల్లో అపార సేవలు అందించిన ప్రముఖులకు ఈ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్లు అందజేశారు.

• పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్‌.ఎ. మషేల్కర్

• భారత మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్

• తబలా విద్వాంసుడు పండిట్ సురేష్ తల్వాల్కర్

• ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సలహాదారు డాక్టర్ జి.వి. సింగ్‌

• భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్‌.ఆర్‌. రావు

• డాక్టర్ సౌమ్య స్వామినాథన్

• డాక్టర్ ఇందుమతి రావు

వీరందరికీ వర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది.

46
కోటి మంది చిన్నారులకు అల్పాహారం.. వికసిత భారత్ దిశగా అడుగులు
Image Credit : Asianet News

కోటి మంది చిన్నారులకు అల్పాహారం.. వికసిత భారత్ దిశగా అడుగులు

అన్నపూర్ణ ఉదయపు అల్పాహార పథకం గురించి సద్గురు వివరించారు. 25 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1.5 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ కోటి మంది చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సత్కార్యానికి పలు జిల్లాల రైతులు సహజ వ్యవసాయ ఉత్పత్తులతో హెల్ప్ చేస్తున్నారని వెల్లడించారు.

ముఖ్య అతిథి యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీ, స్పేస్, ఏఐ, హెల్త్‌కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో ఇండియా సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తోందన్నారు. "వికసిత భారత్ నిర్మాణంలో విలువల ఆధారిత విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. సత్యసాయి గ్రామం, ఈ యూనివర్శిటీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని ఆకాంక్షించారు.

56
100% ఉచిత విద్య.. అమ్మాయిలే టాప్
Image Credit : Asianet News

100% ఉచిత విద్య.. అమ్మాయిలే టాప్

2019లో స్టార్ట్ అయిన శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌.. ఎడ్యుకేషన్, హాస్టల్, ఫుడ్ సహా అన్ని సౌకర్యాలను పూర్తిగా ఫ్రీగా అందిస్తోంది. ఈ ఇయర్ పట్టాలు పొందిన 119 మంది విద్యార్థుల్లో 60 శాతం మంది అమ్మాయిలే ఉండటం విశేషం.

అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 85 శాతం మంది బీపీఎల్ కుటుంబాలకు చెందినవారు. 67 శాతం మంది ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్లు కాగా, 51 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం.

66
‘స్ఫూర్తి కిరణ’ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి
Image Credit : Asianet News

‘స్ఫూర్తి కిరణ’ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి

గురు, శిష్యుల అనుబంధాన్ని చాటిచెప్పే ‘స్ఫూర్తి కిరణ’ మ్యూజిక్ వీడియోను గురుపౌర్ణిమ సందర్భంగా కాంతార ఫేమ్, ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేశారు.

‘జీవన శిల్పులైన గురువులందరికీ అంకితం’ అనే బ్యూటిఫుల్ మెసేజ్‌తో ఈ పాట రూపుదిద్దుకుంది. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సమర్పణలో రెక్టాంగిల్ ఫిల్మ్స్ ఈ వీడియోను ప్రొడ్యూస్ చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
భారత దేశం
విద్య
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Related Stories
Recommended image1
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
Recommended image2
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved