PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రావాలంటే రైతులు ఇలా చేయాలి
PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత జూన్ నెలలో విడుదల కానుంది. రూ.2,000 పొందాలంటే రైతులు కొన్ని పనులు తప్పక పూర్తి చేయాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయంగా మూడు విడతలుగా అందజేస్తారు. ప్రస్తుతం 20వ విడత విడుదల కానుంది. జూన్ నెలలోనే 20వ విడత పీఎం కిసాన్ పేమెంట్ రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. ఈ వారంలోనే ప్రధాని పీఎం కిసాన్ ను విడుదల చేస్తారని సమాచారం.
ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందాలంటే రైతులు కొన్ని తప్పనిసరి అర్హత ప్రమాణాలు, ప్రక్రియలను పూర్తి చేయాలి.
పీఎం కిసాన్ అర్హతా ప్రమాణాలు ఏమిటి?
• దరఖాస్తుదారు భారతీయ పౌరుడు అయి ఉండాలి.
• సాగు చేసే భూమికి చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉండాలి.
• రైతు ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
• ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందేవారు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు అర్హులుకారు.
పీఎం కిసాన్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏమిటి?
1. eKYC పూర్తిచేయాలి
రైతులు pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి “e-KYC” ఎంపికను ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసి సమర్పించాలి. ఇది తప్పనిసరి చేయాలి.
2. ఆధార్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి
ఈ కేవైసీ తో పాటు రైతుల బ్యాంక్ ఖాతా ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. ఇది బ్యాంక్ బ్రాంచ్‌లో లేదా ఆధార్ ఎన్‌బుల్డ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పూర్తిచేయవచ్చు. ఆధార్ లింకింగ్ లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) జరగదు లేదా ఆలస్యం అవుతుంది.
పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ ను ఎలా చెక్ చేయాలి?
రైతులు తమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి. అక్కడ "Farmers Corner" సెక్షన్‌లో "Beneficiary Status" పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి, స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
పైన పేర్కొన్న వివరాలు సమర్పించిన తర్వాతే రైతులకు పీఎం కిసాన్ రూ.2,000 20వ విడతలో జమ అవుతుంది. రైతులు ఈ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సంబంధిత సహాయం కోసం రైతులు దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ 19వ విడతలో రైతుల ఖాతాల్లోకి రూ. 22,000 కోట్లు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) పథకంలో భాగంగా 19వ విడత నిధులు ఫిబ్రవరి 24,2025న విడుదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించి ప్రత్యక్ష లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.22,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేశారు.
ఈ విడతలో సుమారు 9.8 కోట్ల మంది రైతులు లబ్దిదారులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం, ఒక్కో రైతు ఖాతాలో రూ.2,000 చొప్పున జమ చేసింది.