MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • సోషల్ మీడియాలో అతి చేసారో అంతే సంగతి .. వీరినైతే అస్సలు వదిలిపెట్టేలా లేరుగా..!

సోషల్ మీడియాలో అతి చేసారో అంతే సంగతి .. వీరినైతే అస్సలు వదిలిపెట్టేలా లేరుగా..!

పహల్గాం దాడి తర్వాత దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలకు కేంద్రం సిద్దమయ్యింది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ రెండు మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ లేఖ రాసింది. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 06 2025, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
action plan on social media

action plan on social media

పహల్గాం ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. ఇప్పటికే ఈ దాడితో సంబంధమున్న పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది. అలాగే భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నా పాకిస్థాన్ యుట్యూబ్ ఛానల్స్ పై నిషేదం విధించింది. ఇప్పుడు భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేంద్రం చర్యలకు సిద్దమయ్యింది. ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది మోదీ సర్కార్. 

దేశ సమగ్రతను దెబ్బతీసే సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారి వివరాలను పార్లమెంటరీ కమిటీ సేకరిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతల సమయంలో దేశానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యల గురించి ఆరా తీస్తోంది కమిటీ. ఈ మేరకు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి నివేదికను పార్లమెంటరీ కమిటీ కోరింది.

25
action plan on social media

action plan on social media

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు నిషికాంత్ దుబే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం దాడికి సంబంధించి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో దేశ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వీరిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. 

Related Articles

Related image1
India Pakistan Tensions: సింధూ జలల చర్యలు యుద్ధంతో సమానం.. భారత్ పై పాక్ పార్లమెంట్ అక్కసు
Related image2
పాకిస్తాన్ దుశ్చ‌ర్య‌.. భారత రక్షణ వెబ్‌సైట్లు హ్యాక్
35
action plan on social media

action plan on social media

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ లేఖ పంపింది. ఈ క్రమంలో సమాచార సాంకేతిక చట్టం 2000 మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నియమాలు, 2021 ప్రకారం ఇలాంటి ఖాతాలపై యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకునేందుకు సిద్ధమా? అనే అంశాలపై మే 8లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ లేఖలు సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు పంపినట్టు తెలుస్తోంది. 

45
action plan on social media

action plan on social media

ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. ఆయన స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లేఖ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. కమిటీ అనుమతి లేకుండా కమిటీ ఛైర్మన్ లేఖ జారీ చేయలేరని, పార్లమెంటరీ నియమాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదని గోఖలే తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు, ప్రకటనలు వ్యక్తిగతం... రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటరీ కమిటీలను ఉపయోగించరాదని పేర్కొన్నారు.

55
action plan on social media

action plan on social media

ఇటీవల భారత ప్రభుత్వ భద్రతాపరమైన ఆదేశాల మేరకు పాకిస్థాన్ కు చెందిన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధించబడ్డాయి. వీటన్నీ పహల్గాం ఘటన తర్వాత తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వివిధ మంత్రిత్వ శాఖల నుండి కార్యాచరణ ప్రణాళిక కోరడాన్ని ముఖ్య పరిణామంగా చూస్తున్నారు. మరి సదరు మంత్రిత్వ శాఖల సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Recommended image2
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?
Recommended image3
8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Related Stories
Recommended image1
India Pakistan Tensions: సింధూ జలల చర్యలు యుద్ధంతో సమానం.. భారత్ పై పాక్ పార్లమెంట్ అక్కసు
Recommended image2
పాకిస్తాన్ దుశ్చ‌ర్య‌.. భారత రక్షణ వెబ్‌సైట్లు హ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved