MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Operation sindoor: 54 ఏళ్ల‌లో భార‌త్ ఇలాంటి చ‌ర్య‌కు దిగ‌డం ఇదే తొలిసారి.. వారిపై యుద్ధ‌మే

Operation sindoor: 54 ఏళ్ల‌లో భార‌త్ ఇలాంటి చ‌ర్య‌కు దిగ‌డం ఇదే తొలిసారి.. వారిపై యుద్ధ‌మే

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రెండు వారాల తర్వాత, భారత్ ఉగ్రవాద స్థావరాలపై భారీ ప్రతీకార చర్యలు తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో ప‌లు ప్ర‌ధాన ఉగ్ర స్థావ‌రాలు తీవ్రంగా ధ్వంస‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : May 07 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Indian Army

Indian Army

ప‌హ‌ల్గామ్ దాడుల త‌ర్వాత ప్ర‌తీ భార‌తీయుడు ప్రతీకారంతో ర‌గిలిపోయాడు. ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ క‌నీసం ఉగ్ర‌దాడిని ఖండిచ‌క‌పోగా.. భార‌త్‌పైనే అవ‌కాకులు చెవాకులు పేల్చింది. త‌మ వ‌ద్ద అణ్వాయుధాలు ఉన్నాయ‌ని భార‌త్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నోటికొచ్చిన‌ట్లు వాగారు అక్క‌డి కొంద‌రు నాయ‌కులు. 
 

26

కాగా భార‌త ప్ర‌భుత్వం మాత్రం ఉగ్ర‌వాదుల అంతం ల‌క్ష్యంగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ప‌లుసార్లు ఉన్న‌త స్థాయి సమావేశం నిర్వ‌హించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త సైన్యానికి పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావ‌రాల‌పై దాడుల‌కు దిగింది. 

Related Articles

Related image1
Operation Sindoor: రాత్రంతా మెలుకవతోనే ప్రధాని మోదీ..
36

ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై క్షిపణుల దాడులు నిర్వహించాయి. 1971 యుద్ధం తర్వాత మొదటిసారి మూడు భద్రతా దళాలు కలిసి పాకిస్తాన్‌పై పెద్ద స్థాయిలో దాడికి దిగిన సందర్భం. ఈ నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ సింధూర్‌కు సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

46
Operation Sindoor

Operation Sindoor

* ఈ దాడులు బుధవారం తెల్లవారుజామున 1:44కి ప్రారంభమయ్యాయి.

* పాక్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.

* ఈ ఉగ్ర స్థావరాల నుంచే భారత్‌పై దాడులు ప్లాన్ అవుతున్నాయని భారత సైన్యం వెల్లడించింది.

56

* ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఖచ్చితమైన లక్ష్యాలను వీక్షించే ‘కామికాజే డ్రోన్లు’ (loitering munitions) ఉప‌యోగించారు.

* మొత్తం తొమ్మిది టార్గెట్లు లక్ష్యంగా చేసుకోగా, వాటిలో జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం బహావల్పూర్, లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం మురిద్కే ఉన్నాయి.

* భారత ఆర్మీ ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను ఎక్కడా లక్ష్యంగా చేయలేదని, తగిన జాగ్రత్తలతో మాత్రమే ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని తెలిపింది.

66

* ఈ దాడులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షణ చేశారని సమాచారం.

* ఆపరేషన్ అనంతరం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు..  విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి వివరణ ఇచ్చారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
పాకిస్తాన్
ఆపరేషన్ సింధూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image3
గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.. రూరల్ ఎకానమీ దిశగా కీలక ముందుడుగు
Related Stories
Recommended image1
Operation Sindoor: రాత్రంతా మెలుకవతోనే ప్రధాని మోదీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved