ఆ స్లీపర్ బస్సులు రోడ్లపై తిరగకూడదు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం
NHRC: ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాజస్థాన్, కర్నూలులో జరిగిన జరిగిన ఘటనల నేపథ్యంలో భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ ధర్మాసం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రమాదంతో వెలుగులోకి లోపాలు
రాజస్థాన్‌లోని జైసల్మేర్–జోధ్‌పూర్ హైవేపై అక్టోబర్ 14, 2025 న జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఎన్ఎచ్ఆర్సీ (NHRC)కి వచ్చిన ఫిర్యాదులో బస్సుల రూపకల్పనలో ప్రమాదకరమైన లోపాలు ఉన్నాయని వెల్లడించారు. డ్రైవర్ కేబిన్‌ని పూర్తిగా వేరుగా కట్టడం వల్ల లోపలి అగ్ని ప్రమాదాన్ని డ్రైవర్ గమనించలేడని, ప్రయాణికులతో కమ్యునికేషన్ కూడా సాధ్యం కాకపోవడం ప్రాణనష్టానికి కారణమని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
CIRT పరిశీలనలో బయటపడ్డ ఉల్లంఘనలు
సెంట్రల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (CIRT) చేసిన దర్యాప్తులో బస్సు AIS-052, AIS-119 అనే తప్పనిసరి భద్రతా ప్రమాణాలకు వ్యతిరేకంగా తయారు చేసినట్లు తేలింది. ఇందులో..
* ఫైర్ డిటెక్షన్ & సప్రెషన్ సిస్టమ్ లేకపోవడం
* డ్రైవర్ కేబిన్ సరైన విధానంలో రూపకల్పన లేకపోవడం
* స్లీపర్ బెర్త్‌లపై తప్పు స్లైడర్లు
* అత్యవసర ద్వారాలు సరిపడా లేకపోవడం. వంటి పెద్ద లోపాలు బయటపడ్డాయి. ఈ తప్పులు పూర్తిగా నివారించదగినవి అని NHRC తీవ్రంగా వ్యాఖ్యానించింది.
Article 21 ఉల్లంఘన
ఫిర్యాదుదారు పేర్కొన్న ప్రకారం, ఈ రకమైన ప్రమాదకర బస్సులు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగంలోని Article 21 – జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయి. బస్సు తయారీదారుల నిర్లక్ష్యం, పరిశీలన సంస్థల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని NHRC స్పష్టం చేసింది.
The National Human Rights Commission of India (NHRC) bench, headed by memeber Priyank Kanoongo, issued directions to all Chief Secretaries of states to remove all sleeper coach buses that violate safety norms. pic.twitter.com/MGCHSCeyVh
— ANI (@ANI) November 29, 2025
NHRC కీలక ఆదేశాలు
NHRC అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) కు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రాష్ట్రాలు AIS-052, AIS-119 ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలి. బస్సు తయారీదారులు, బాడీ బిల్డర్లు ఎలాంటి భద్రతా నిబంధనలను చుట్టు తిరగకుండా ఉండేలా జాతీయ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకూ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వీటి ప్రకారం.. CIRT సూచించిన అన్ని భద్రతా మార్పులు తక్షణమే అమలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల్ని రీకాల్ చేసి, సరిచేయాలి. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించి బస్సులను ఆమోదించిన అధికారులు, తయారీదారులపై చర్యలు తీసుకోవాలి. ప్రమాద బాధితులకు నష్టపరిహారం, సహాయం అందించాలి.
దేశవ్యాప్తంగా ప్రమాదకర బస్సుల రీకాల్
భద్రతా ప్రమాణాలు పాటించని స్లీపర్ బస్సులు దేశ రోడ్లపై తిరగకూడదని NHRC స్పష్టంగా తెలిపింది. నిర్మాణంలో లోపాలు, ఆమోద ప్రక్రియలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటివన్ని కలిసి.. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా ఇలాంటి బస్సుల రీకాల్‌కు దారితీసే అవకాశం ఉంది.

