డిసెంబర్ లో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు
Bank Holiday: డిసెంబర్ నెలలో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలువులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో ఆర్బీఐ ప్రకటించిన పూర్తి బ్యాంకు సెలవుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

డిసెంబర్ 1 నుంచే బ్యాంకులకు వరుస సెలవులు
డిసెంబర్ 1న (సోమవారం) దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ గా మారాయి. అయితే, అధికారిక సమాచారం ప్రకారం.. ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉండవు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన సెలవు జాబితా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్, నాగాలాండ్‌లోని కోహిమా నగరాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేయనున్నారు.
ఈ రెండు ప్రదేశాల్లో డిసెంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. ఈ రోజు అక్కడి గిరిజన సమాజాల స్థానిక మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులకు గౌరవం తెలిపే ప్రత్యేక దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
ఆర్బీఐ ప్రకటించిన డిసెంబర్ 2025 మొత్తం బ్యాంక్ సెలవులు ఎన్ని?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన 2025–26 అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ 2025లో మొత్తం 13 బ్యాంకు సెలవులు ఉన్నాయి.
ఈ సెలవులు రాష్ట్రాలవారీగా మారుతూ ఉంటాయి. జాతీయ పండుగలు, ప్రాంతీయ పండుగలు, మతపరమైన రోజులు.. ఇలా ఫైనల్ గా సెలవుల లిస్టు ఉంటుంది. అలాగే, ప్రతి ఆదివారం, అలాగే డిసెంబర్‌లో రెండో శనివారం (13), నాలుగో శనివారం (27) బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవి మొత్తం కలుపుకుంటే డిసెంబర్ నెలలో సగానికి పైగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
డిసెంబర్ 2025లో బ్యాంకు సెలవులు ఇవే
డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన జాబితాలో పలు ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు గమనిస్తే..
డిసెంబర్ 1 - అరుణాచల్ ప్రదేశ్ లో ఇటానగర్, కోహిమాలో అన్ని బ్యాంకులు బంద్
డిసెంబర్ 3 - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా గోవాలోని పనాజీలో సెలవు
డిసెంబర్ 7 - దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు ఆదివారం సెలవు
డిసెంబర్ 12 - పా టోగన్ సంగ్మా వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13 - రెండో శనివారంతో అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 14 - ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 18 - సోసో థామ్ వర్ధంతితో షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్ 19 - గోవా విమోచన దినోత్సవం సందర్భంగా పనాజీలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 20 - లోసుంగ్ పండుగతో గాంగ్‌టాక్‌లోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 21 - ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 22 - నామ్సంగ్ పండుగతో గ్యాంగ్‌టాక్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 24 - పనాజీ, షిల్లాంగ్, ఐజ్వాల్, కోహిమా, పూణేలోని కొన్ని ప్రాంతాలలో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 26 - ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లోని బ్యాంకులకు క్రిస్మస్ సెలవు.
డిసెంబర్ 27 - నాల్గో శనివారం అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 28 - ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30 - ఉ కియాంగ్ నంగ్బా వర్ధంతి నేపథ్యంలో షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31 – ఢిల్లీ, పూణే, పనాజీ, షిల్లాంగ్, ఐజ్వాల్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు
సెలవుల్లోనూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
బ్యాంకులకు పలు బ్రాంచీల్లో సెలవులు ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ 24/7 అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. వాటిలో యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు, బిల్లు చెల్లింపులు ఉన్నాయి.
అయితే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, లాకర్ యాక్సెస్ వంటి సేవలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

