MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • వ‌చ్చే 24 గంట‌లు అత్యంత జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ అలర్ట్‌. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు

వ‌చ్చే 24 గంట‌లు అత్యంత జాగ్ర‌త్త‌.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ అలర్ట్‌. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు

Flash Flood: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మ‌రో తుపాను భ‌య‌పెడుతోంది. ఇప్ప‌టికే శ్రీలంక‌లో భారీ న‌ష్టానికి కార‌ణ‌మైన దిత్వా విప‌త్తు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు దూసుకొస్తుంది. దీంతో ప‌లు ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 29 2025, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను
Image Credit : Getty

బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను

నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంకకు సమీపంలోని సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను వేగంగా ఉత్తర–వాయువ్య దిశలో కదులుతోంది. ప్రస్తుతం ట్రికోమలికి వాయువ్య దిశగా సుమారు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ–ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దక్షిణ ఏపీలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు
Image Credit : Pixabay

దక్షిణ ఏపీలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు

తుపాను ప్రభావంతో రాబోయే 24 గంటల్లో దక్షిణ ఆంధ్రలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదల సూచనలు జారీ చేశారు. ఈ రోజు (శ‌నివారం) మధ్యాహ్నం తర్వాత తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

Related Articles

Related image1
ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వ‌ర్షం, మ‌రోవైపు చ‌లి. తెలుగు రాష్ట్రాల్లో అల్ల‌క‌ల్లోలం
Related image2
అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా, రూ. 10 వేలు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే.?
35
ఆదివారం నాటికి
Image Credit : Asianet News

ఆదివారం నాటికి

వాతావరణ శాఖ అంచనా ప్రకారం, తుపాను అదే దిశలో కదులుతూ ఆదివారం ఉదయం తమిళనాడు ఉత్తర తీరాలు, పుదుచ్చేరి పరిసరాలు, అలాగే దక్షిణ ఆంధ్ర తీరానికి చేరుకుంటుందని తెలిపింది. శనివారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప‌డే అవకాశం ఉంది. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.

45
తీవ్ర వాయుగుండంగా
Image Credit : Generated by google gemini AI

తీవ్ర వాయుగుండంగా

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ‘దిత్వా’ ప్రస్తుతం కారైకాల్‌కు 220 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. గడిచిన ఆరు గంటల్లో సుమారు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను, ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

55
మత్స్యకారులు, ప్రజలకు కీలక సూచనలు
Image Credit : ChatGPT

మత్స్యకారులు, ప్రజలకు కీలక సూచనలు

వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో, మంగళవారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సందర్భాల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Recommended image3
Now Playing
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
Related Stories
Recommended image1
ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వ‌ర్షం, మ‌రోవైపు చ‌లి. తెలుగు రాష్ట్రాల్లో అల్ల‌క‌ల్లోలం
Recommended image2
అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా, రూ. 10 వేలు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved