MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • ATM : ఇక ఏటీఎంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లు.. చిల్లర కష్టాలకు చెక్..!

ATM : ఇక ఏటీఎంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లు.. చిల్లర కష్టాలకు చెక్..!

డిజిటల్ లావాదేవీలు పెరిగినా చిల్లర కష్టాలు తప్పడంలేదు… ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ఇకపై ఏటీఎం మెషీన్లలో రూ.10, రూ.20, రూ.50 నోట్లను కూడా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 13 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏటీఎంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లు
Image Credit : Gemini

ఏటీఎంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లు

డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగినా చిన్న నోట్ల వినియోగం ప్రజల్లో ఎక్కువగా ఉంది. చాలామంది బయటకు వెళితే చాలు చిల్లర డబ్బులు దగ్గర పెట్టుకుంటారు… ముఖ్యంగా రూ.10, రూ.20. రూ.50 నోట్లను ఎక్కువగా వాడుతుంటారు. ఇలా చిన్ననోట్ల వినియోగం ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో చిల్లర కొరత నెలకొంది. దీనికి సరికొత్త పరిష్కారంతో ముందుకు వస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).

ఇంతకాలం బ్యాంక్ ఏటిఎంలలో రూ.100, అంతకంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లు మాత్రమే వచ్చేవి… కానీ ఇకపై రూ.10, రూ.20, రూ.50 నోట్లు కూడా వస్తాయట. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూపిఐ జమానాలోనే చిల్లర కష్టాలు..
Image Credit : Getty

యూపిఐ జమానాలోనే చిల్లర కష్టాలు..

ఈ రోజుల్లో చాలామంది యూపీఐ, ఆన్‌లైన్ పేమెంట్స్ వాడుతున్నా చిల్లర అవసరం తప్పడం లేదు. రూ.100 లేదా రూ.500 నోటు ఇస్తే దుకాణదారులు 'చిల్లర లేదు' అనడం చూస్తూనే ఉన్నాం. ఇలా అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు చిల్లర కష్టాలు తప్పడంలేదు. అందుకే కొత్తగా బ్యాంకులు ఏర్పాటుచేసే ఏటిఎంలలో చిన్న కరెన్సీ నోట్లు కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

Related image1
bank account మీ పిల్లలకు పదేళ్లు దాటాయా? బ్యాంక్ ఖాతా, ATM, UPI అన్నింటికీ అర్హులే!
Related image2
Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
35
ఇప్పుడున్న ఏటీఎంలలో చిన్ననోట్లు ఎందుకు రావు..?
Image Credit : Asianet News

ఇప్పుడున్న ఏటీఎంలలో చిన్ననోట్లు ఎందుకు రావు..?

సాధారణ ఏటీఎంలలో చిన్న నోట్లు ఎందుకు రావని చాలామందికి సందేహం ఉంది. దీనిపై మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. పాత ఏటీఎం మెషీన్లలో చిన్న నోట్లు ఇచ్చే సౌకర్యం లేదని తెలిపారు. ఇప్పుడు 'స్మాల్ వ్యాల్యూ డిస్పెన్సర్' అనే కొత్త విధానం ద్వారా చిన్న నోట్లను అందించే ప్రత్యేక ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రజలకు చిల్లర కష్టాలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నామన్నారు. 

45
చిన్ననోట్ల కొరత లేదు..
Image Credit : Asianet News

చిన్ననోట్ల కొరత లేదు..

మార్కెట్లో చిన్న నోట్లు తగినంత సంఖ్యలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు సుమారు 439.40 కోట్ల రూ.10 నోట్లు, 193.70 కోట్ల రూ.20 నోట్లు, 130.30 కోట్ల రూ.50 నోట్లు ముద్రించి విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద మొత్తంలో ఈ నోట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

55
కరెన్సీ నోట్ట ముద్రణ..
Image Credit : Asianet News

కరెన్సీ నోట్ట ముద్రణ..

దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు వివిధ విలువైన నోట్ల డిమాండ్‌ను అంచనా వేసి ముద్రిస్తుందని మంత్రి తెలిపారు. నోట్లతో పాటు నాణేల ద్వారా కూడా చిల్లర అవసరాలను తీరుస్తోంది. ఇదే సమయంలో చిన్న లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపుల వాడకం కూడా వేగంగా పెరుగుతోంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
bank account మీ పిల్లలకు పదేళ్లు దాటాయా? బ్యాంక్ ఖాతా, ATM, UPI అన్నింటికీ అర్హులే!
Recommended image2
Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved