bank account మీ పిల్లలకు పదేళ్లు దాటాయా? బ్యాంక్ ఖాతా, ATM, UPI అన్నింటికీ అర్హులే!
RBI కీలక నిర్ణయం: ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయంతో బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ అకౌంట్లు తెరవవచ్చు! ATM, UPI సౌకర్యం కూడా లభిస్తుందంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
13

RBI కీలక నిర్ణయంతో ఇప్పుడు పదేళ్లు నిండిన వారు స్వతంత్రంగా బ్యాంక్ ఖాతా తెరవవచ్చు. సొంతంగా లావాదేవీలు నిర్వహించవచ్చ. లేదా వాళ్ల తరఫున తల్లిదండ్రులు లావాదేవీలు చేయవచ్చు.
23
అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్ ఖాతాలు మాత్రమే తెరవడానికి మాత్రమే ఆర్బీఐ అనుమతినిస్తోంది. కరెంట్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. పదేళ్లు దాటిన పిల్లలు కోరితే, బ్యాంకులు వారికి సేవింగ్స్ ఖాతా తెరవవచ్చని RBI ఒక ప్రకటనలో తెలిపింది. ATM, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి అదనపు సౌకర్యాలు కూడా బ్యాంకులు అందిస్తాయి.
33
ఈ ఖాతా నుండి అధికంగా డబ్బు తీసుకోవడానికి వీలులేదు. నిర్ణీత మొత్తంలో ఎల్లప్పుడూ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందో పేర్కొనలేదు. ప్రస్తుతం పదేళ్లలోపు పిల్లలకు తల్లిని సంరక్షకురాలిగా చేర్చి ఖాతా తెరిచే అవకాశం కూడా ఉంది.
Latest Videos