నేత్ర మంతెన రాయల్ వెడ్డింగ్ : ఒక్క జగమందిర్ ప్యాలెస్ కే ఎంత ఖర్చో తెలుసా?
Jagmandir Palace : రాజస్థాన్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అందమైన ప్యాలెస్ లే. వీటిలో చుట్టూ నీరు, మధ్యలో అందమైన పురాతన కట్టడం… జగమందిర్ ప్యాలెస్ చాలా ప్రత్యేకం. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా?

జగమందిర్ ప్యాలస్ లో నేత్రా మంతెన వివాహం
jagmandir Island Palace : గతేడాది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఆ స్థాయిలో గ్రాండ్ గా జరిగింది ఓ తెలుగింటి ఆడబిడ్డ వివాహం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యాపారవేత్త రామరాజు మంతెన కూతురు నేత్ర మంతెన వివాహం రాజస్థాన్ లో అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్ రాజమహల్స్ లో రాచరిక సాంప్రదాయంలో నేత్ర మంతెన - వంశీ గాదిరాజు వివాహం ఆకాశమే పందిరి, భూమే పెళ్లి పీటలు వేసిందా అన్నట్లుగా జరిగింది.
ఉదయ్‌పూర్ సరస్సులపై తేలియాడే జగమందిర్ ప్యాలెస్ ఎప్పటినుంచో రాయల్ వెడ్డింగ్స్‌కు ఫేమస్ డెస్టినేషన్. నేత్రా మంతెన డ్రీమ్ వెడ్డింగ్ ఈ ప్రదేశాన్ని మరోసారి వార్తల్లోకి తెచ్చింది. పిచోలా సరస్సు మధ్యలో నిర్మించిన ఈ గోల్డెన్-స్టోన్ ఐలాండ్ ప్యాలెస్ కేవలం ఒక వెడ్డింగ్ వెన్యూ మాత్రమే కాదు చరిత్ర, లగ్జరీ, ప్రత్యేకతల సంగమం. దీని వైభవం హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రపంచాలను ఆకర్షిస్తోంది... ఇక్కడ పెళ్లి చేసుకోవడం కేవలం ఒక వేడుక కాదు, శతాబ్దాల నాటి మేవార్ సామ్రాజ్యంలో జీవించిన అనుభూతినిస్తుంది.
అంబానీల పెళ్లిని తలపించేలా కూతురు పెళ్లిచేశారు రామరాజు మంతెన. ఈ క్రమంలో ఏడాది జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిగా నేత్రా-వంశి గుర్తింపు పొందింది. ఈ పెళ్లికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ తో పాటు అంతర్జాతీయ ప్రముఖులు జెన్నిఫర్, జస్టిన్ బీబర్ వంటివారు హాజరయ్యారు. ఇలాంటి అతిథులు వస్తున్నారు కాబట్టే రాజస్థాన్ ప్యాలస్ లో పెళ్ళి ఏర్పాటుచేసివుంటారు. మరి రాయల్ జగమందిర్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోవాలంటే ఎంత అద్దె చెల్లించాలో తెలుసా?
జగమందిర్ ప్యాలెస్ చరిత్ర
జగమందిర్ ప్యాలెస్ చరిత్ర 17వ శతాబ్దంలో మొదలవుతుంది. మేవార్ రాజవంశం దీనిని రాజరిక శాంతి నిలయంగా 'ఐలాండ్ ప్యాలెస్'గా నిర్మించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యుక్త వయసులో ఇక్కడే ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. తాజ్‌మహల్ డిజైన్‌కు ప్రేరణ ఇక్కడి నుంచే లభించిందని అంటారు.
రాజసం ఉట్టిపడే పాలరాతి విగ్రహాలు, ఏనుగు ఆకారంలో ఉన్న భారీ ప్రతిమలు, సరస్సు నుంచి వచ్చే చల్లని గాలి ఈ ప్యాలెస్‌కు చరిత్ర ఒడిలో ఉన్న ప్రశాంతమైన, అద్భుతమైన స్వర్గంలాంటి రూపాన్ని ఇస్తాయి. ఇప్పటికీ దీని వాస్తుశిల్పంలో మేవారీ కళ, జాలీలతో కూడిన పాలరాయి, రాజ్‌పుత్-మొఘల్ ఫ్యూజన్ డిజైన్ కనిపిస్తుంది.
రాయల్ వెడ్డింగ్స్ కు జగమందిర్ ప్యాలెస్ పర్ఫెక్ట్ ప్లేస్..
నేత్రా మంతెన పెళ్లి కోసం జగమందిర్‌ను ఎంచుకోవడం కేవలం అందం కోసం తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఒక లైఫ్‌స్టైల్ స్టేట్‌మెంట్ కూడా. ఇక్కడ జరిగే ప్రతి ఫంక్షన్ సరస్సుపై తేలియాడే వెలుగులు, ఆకాశంలో వ్యాపించే రంగుల మధ్య జరుగుతుంది. దీనివల్ల వెడ్డింగ్ ఫోటోలు అచ్చం సినిమాటిక్‌గా ఉంటాయి. సెలబ్రిటీలు తరచుగా ప్రైవేట్‌గా, సురక్షితంగా, చాలా రాయల్‌గా ఉండే ప్రదేశాన్ని కోరుకుంటారు. జగమందిర్ ఈ మూడు విషయాల్లోనూ నూటికి నూరు శాతం సరిపోతుంది.
దీని ప్రత్యేకత ఎంతలా ఉంటుందంటే, ఒకే సమయంలో ఒకే వెడ్డింగ్ బుక్ అవుతుంది. దీనివల్ల అతిథులు మొత్తం ఐలాండ్ తమ కోసమే అలంకరించినట్లు భావిస్తారు. నేత్రా పెళ్లిలో ఈ రాజరిక అనుభవమే అతిపెద్ద ఆకర్షణ.
జగమందిర్ ప్యాలెస్‌లో ఒక రాత్రికి అయ్యే ఖర్చు ఎంత?
జగమందిర్ ప్యాలెస్‌లో ఒక రాత్రి రాయల్ వెడ్డింగ్ బుకింగ్ ఏ లగ్జరీ హోటల్ కన్నా చాలా హై-ఎండ్‌గా ఉంటుంది. ఇక్కడ అద్దె ఈవెంట్, డెకరేషన్, సెక్యూరిటీ, మెనూ, ప్రత్యేక బుకింగ్‌ను బట్టి మారుతుంది. ఒక అంచనా ప్రకారం, కేవలం వెన్యూ ఛార్జ్ మాత్రమే రాత్రికి 30-50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మొత్తం ప్రాపర్టీ-ఫెర్రీబోట్లు, లైటింగ్, ప్రీమియం క్యాటరింగ్, రాయల్ సెటప్, ప్రదర్శనలు చేర్చితే, ఒక రాత్రి ఖర్చు సులభంగా 1-1.5 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అందుకే ఇక్కడ పెళ్లి చేసుకోవడం సెలబ్రిటీ స్టేట్‌మెంట్, రాయల్ స్టేటస్ గా పరిగణిస్తారు.
జగమందిర్ ప్యాలెస్ ప్రత్యేకతలు
ఐలాండ్‌కు చేరుకోవడానికి అతిథుల ప్రయాణం కూడా ఒక సినిమాటిక్ అనుభూతినిస్తుంది. బోట్ రైడ్, సరస్సుపై నిర్మించిన ప్యాలెస్ అందం, దూరం నుంచి మిలమిల మెరిసే ప్యాలెస్. లోపలికి చేరుకున్నాక పాలరాతి స్తంభాలు, మేవారీ ఝరోకాలు, క్యాండిల్ లైట్ గ్యాలరీలు, పచ్చని తోటలు ప్రతి ఫంక్షన్‌కు రాయల్ రూపాన్ని ఇస్తాయి. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ప్రైవేట్ ఫైర్‌వర్క్స్, లైవ్ సంగీతం, సరస్సు ఒడ్డున బారాత్ ఎంట్రీ, గ్లోబల్-గౌర్మెట్ మెనూ వెడ్డింగ్‌కు అంతర్జాతీయ టచ్ ఇస్తాయి. జగమందిర్ లగ్జరీ స్థాయి ఎంత ఉన్నతమైనదంటే, ప్రపంచంలోని చాలా మంది సెలబ్రిటీలు ఈ ప్రదేశం కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారు.

