MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • LIC : రోజుకు రూ.45 చాలు.. ఏకంగా రూ.25 లక్షలు పొందండి

LIC : రోజుకు రూ.45 చాలు.. ఏకంగా రూ.25 లక్షలు పొందండి

ఎల్ఐసీ అందిస్తున్న కొత్త జీవన్ ఆనంద్ ప్లాన్ ఒకేసారి పొదుపు, భద్రతను అందిస్తుంది. రోజుకు కేవలం రూ.45 ఆదా చేయడం ద్వారా, మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.25 లక్షల వరకు పొందవచ్చు. ఈ ప్లాన్‌తో పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 28 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ...
Image Credit : stockPhoto

ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ...

భారతదేశంలో అత్యంత నమ్మకమైన భీమా సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్సోరేషన్ (LIC) గుర్తింపు పొందింది. ఇప్పటికే కోట్లాదిమంది భారతీయులకు ఈ సంస్థ చేరువయ్యింది… వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ కొత్తకొత్త పాలసీలను తీసుకువస్తుంటుంది. ఇలాంటిదే 'న్యూ జీవన్ ఆనంద్' (ప్లాన్ 915).

ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ లో చేరేవారు డబ్బులు పొదుపు చేయడమే కాదు భద్రతను కూడా పొందుతారు. రోజుకు కేవలం రూ.45 ఆదా చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఆర్థిక భద్రతతో పాటు జీవిత భీమా కూడా ఉండటంతో ఈ ప్లాన్ చాలామందిని ఆకర్షిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోజుకు కేవలం 45 రూపాయలే..
Image Credit : Asianet News

రోజుకు కేవలం 45 రూపాయలే..

తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలిక పొదుపు అవకాశం ఉండటమే ఈ ప్లాన్ ప్రత్యేకత. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల భీమా హామీతో 35 ఏళ్ల కాలానికి ఈ పాలసీ తీసుకుంటే, సంవత్సరానికి సుమారు రూ.16,300 చెల్లించాలి. అంటే నెలకు దాదాపు రూ.1,359 అంటే రోజుకు రూ.45 అన్నమాట.

35
రూ.5 లక్షలు కడితే రూ.25 లక్షలు..
Image Credit : Gemini

రూ.5 లక్షలు కడితే రూ.25 లక్షలు..

ఈ పాలసీ కాలంలో పెట్టుబడిదారుడు మొత్తం రూ.5.7 లక్షలు చెల్లించినప్పటికీ, మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత బోనస్ రేట్ల ప్రకారం 35 ఏళ్లలో సుమారు రూ.25 లక్షల వరకు ఒకేసారి చేతికి వస్తుంది. ఇందులో రూ.5 లక్షల బేసిక్ భీమా హామీ, రివిజనరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా కలిసి ఉంటాయి.

45
లైఫ్ టైమ్ జీవిత భీమా..
Image Credit : stockPhoto

లైఫ్ టైమ్ జీవిత భీమా..

ఈ పాలసీలో 'హోల్ లైఫ్ కవర్' అనేది ఒక ప్రత్యేకమైన ఫీచర్. సాధారణంగా చాలా పాలసీలలో మెచ్యూరిటీ తర్వాత భీమా కవరేజ్ ఆగిపోతుంది. కానీ జీవన్ ఆనంద్ ప్లాన్‌లో, మెచ్యూరిటీ తర్వాత కూడా రూ.5 లక్షల జీవిత భీమా ఉచితంగా కొనసాగుతుంది. పాలసీదారుడు ఎప్పుడు మరణించినా, ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.

55
ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు.
Image Credit : freepik

ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు.

ఇంకా ఈ ప్లాన్‌లో పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్స్‌పై సెక్షన్ 10(10D) కింద పన్ను ఉండదు. అత్యవసరాల కోసం 2 ఏళ్ల తర్వాత లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు 15 నుంచి 35 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రభుత్వ పథకాలు
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image2
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Recommended image3
8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?
Related Stories
Recommended image1
ఎల్ఐసి పాలసీ కట్టలేక ఆపేస్తే కట్టిన డబ్బు తిరిగి రాదా.. ?
Recommended image2
రూ. 1 కోటి టర్మ్ పాలసీ: మీ కుటుంబానికి సరైన ఆర్థిక భద్రత ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved