MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • National
  • జెన్‌జీల‌ మాటున‌ కంత్రిగాళ్లు.. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల్లో హత్యలు, అత్యాచార నిందితులు

జెన్‌జీల‌ మాటున‌ కంత్రిగాళ్లు.. జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల్లో హత్యలు, అత్యాచార నిందితులు

Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆందోళనలకు సంబంధించి భద్రతా సంస్థలు చేపట్టిన సాంకేతిక విశ్లేషణలో మరింత సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 28 2026, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫేస్ రికగ్నిషన్ ద్వారా 2,873 మంది గుర్తింపు
Image Credit : ANI

ఫేస్ రికగ్నిషన్ ద్వారా 2,873 మంది గుర్తింపు

జూలై 20 నుంచి 25 వరకు జంతర్ మంతర్ పరిసరాల్లో జరిగిన ఆందోళనల సమయంలో రికార్డైన సీసీటీవీ దృశ్యాలు, హై-రిజల్యూషన్ కెమెరాల వీడియోలను పోలీసులు విశ్లేషించారు. వాటిని ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న నేరస్థుల డేటాబేస్‌తో సరిపోల్చగా మొత్తం 2,873 మంది క్రిమినల్ రికార్డు కలిగిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 989 మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయని సమాచారం. హత్య, అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ, దోపిడీ, పోక్సో చట్టం, ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుల్లో నిందితులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తీవ్రమైన నేరాల కేసుల్లో ఉన్నవారూ నిరసనల్లో పాల్గొన్నారా?
Image Credit : ANI

తీవ్రమైన నేరాల కేసుల్లో ఉన్నవారూ నిరసనల్లో పాల్గొన్నారా?

పోలీసుల విశ్లేషణ ప్రకారం, గుర్తించిన వ్యక్తుల్లో 101 మందిపై హత్య కేసులు, 61 మందిపై అత్యాచార కేసులు, 62 మందిపై హత్యాయత్నం, 284 మందిపై దోపిడీ, 229 మందిపై ఆయుధాల చట్టం, 25 మందిపై లైంగిక వేధింపుల కేసులు, 19 మందిపై కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. కొంతమందిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు కూడా ఉన్నాయని, కొందరు పలుమార్లు నిరసన ప్రదేశానికి వచ్చినట్లు సీసీటీవీ విశ్లేషణలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ అంశం దర్యాప్తులో కీలకంగా మారింది.

Related Articles

Related image1
Motivational: విజ‌యం, డ‌బ్బు, గౌర‌వం.. మ‌నిషికి శాశ్వ‌త ఆనందం ల‌భించేది ఎప్పుడో తెలుసా.?
Related image2
రైల్వే స్టేష‌న్ల‌లో లోకో పైల‌ట్లు రింగ్ ఎందుకు మార్చుకుంటారు.? దీని ఉప‌యోగం ఏంటో తెలుసా?
35
హింసాత్మక ఘటనలపై సీసీటీవీ ఆధారాలు
Image Credit : ANI

హింసాత్మక ఘటనలపై సీసీటీవీ ఆధారాలు

నిరసనల సమయంలో కొందరు ఆందోళనకారులు హింసకు పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. బారికేడ్లను ధ్వంసం చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు వీడియోల్లో నమోదైనట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, బస్సుల టైర్లను పంక్చర్ చేయడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనల్లో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు సమాచారం.

45
నిఘా వ్యవస్థ ఎలా పనిచేసింది?
Image Credit : X

నిఘా వ్యవస్థ ఎలా పనిచేసింది?

జంతర్ మంతర్ పరిసరాలతో పాటు ఢిల్లీ నగరంలోని కీలక కూడళ్లు, ప్రవేశ మార్గాలు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసులు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా సేకరించిన ముఖచిత్రాలను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సహాయంతో విశ్లేషించారు. తర్వాత వాటిని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నేరస్థులు, హిస్టరీ షీటర్లు, పరారీలో ఉన్న నిందితుల డేటాతో సరిపోల్చి పరిశీలించారు. ఈ ప్రక్రియలోనే పెద్ద సంఖ్యలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

55
దర్యాప్తు కొనసాగుతోంది.. పలు కోణాల్లో విచారణ
Image Credit : ANI

దర్యాప్తు కొనసాగుతోంది.. పలు కోణాల్లో విచారణ

పోలీసుల సమాచారం ప్రకారం, గుర్తించిన వ్యక్తుల్లో చాలామంది ఈశాన్య ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతాలకు చెందినవారని ప్రాథమికంగా తేలింది. వీరు స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొన్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమీకరించారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా ఏమైనా ప్రేరేపిత ప్రచారం జరిగిందా? హింసాత్మక ఘటనలకు ముందస్తు ప్రణాళిక ఉందా? అనే అంశాలపైనా విచారణ సాగుతోంది. జూలై 20 నుంచి జరిగిన అల్లర్లలో గుర్తించిన వ్యక్తుల పాత్ర, వారి మధ్య ఉన్న సంబంధాలు, ఇతర సంస్థలతో ఏమైనా అనుబంధాలు ఉన్నాయా అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Related Stories
Recommended image1
Motivational: విజ‌యం, డ‌బ్బు, గౌర‌వం.. మ‌నిషికి శాశ్వ‌త ఆనందం ల‌భించేది ఎప్పుడో తెలుసా.?
Recommended image2
రైల్వే స్టేష‌న్ల‌లో లోకో పైల‌ట్లు రింగ్ ఎందుకు మార్చుకుంటారు.? దీని ఉప‌యోగం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved