MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Crime : భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. ఏ పేరెంట్స్ చూడకూడని విధంగా కూతుర్ని చూపించిన నీచుడు

Crime : భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. ఏ పేరెంట్స్ చూడకూడని విధంగా కూతుర్ని చూపించిన నీచుడు

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ నీచుడు దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లిదండ్రులకు కూతురి చావును కళ్లారా చూపిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 28 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కర్ణాటకలో దారుణం
Image Credit : Gemini AI

కర్ణాటకలో దారుణం

Crime : ఈ కలికాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. ముఖ్యంగా నిండునూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అందుకే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త, అక్రమ సంబంధానికి నిండు ప్రాణం బలి... ఇలాంటి వార్తలు తరచూ చూడాల్సివస్తోంది. తాజాగా ఇలాంటి దారుణమే పక్కరాష్ట్రం కర్ణాటకలో వెలుగుచూసింది.

కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు దారుణానికి పాల్పడ్డాడు... భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపుతూ దాన్నంతా వీడియో తీసుకున్నాడు. అంతటితో అతడి రాక్షసత్వం ఆగలేదు… లైవ్ కాల్ చేసిమరీ కన్న కూతురు ఉరికి వేలాడుతూ విలవిల్లాడుతుండటం ఆ తల్లిదండ్రులకు చూపించాడు. ఇలా కట్టుకున్న భార్యకు నరకం చూపిస్తూ చంపడమే కాదు అత్తామామమకు కన్నకూతురి చావును కళ్లారా చూపించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
భార్యను దారుణంగా హతమార్చిన భర్త
Image Credit : Getty

భార్యను దారుణంగా హతమార్చిన భర్త

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో మనసును కలిచివేసే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భర్తే 23 ఏళ్ల భార్యను ఉరితీసి కిరాతకంగా చంపేశాడు. ఉరితాడుకు వేలాడుతూ ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి కూతురి చావును ప్రత్యక్షంగా చూపించాడు. ఈ దారుణానికి పాల్పడిన భర్త ప్రవీణ్ జిగలూరును పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని భాగ్యశ్రీగా గుర్తించారు.

33
భార్యభర్తల మధ్య గొడవేంటి?
Image Credit : Asianet News

భార్యభర్తల మధ్య గొడవేంటి?

కుటుంబ కలహాల కారణంగా భాగ్యశ్రీ అనే వివాహిత గత రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆమె భర్త ప్రవీణ్ ఇటీవలే భార్యతో పాటు అత్తింటివారిని ఒప్పించి కాపురానికి తీసుకెళ్లాడు. భార్యను బాగా చూసుకుంటానని... ఎలాంటి గొడవలు జరగవని మాటిచ్చాడు. భర్త మాటలు నమ్మిన భాగ్యశ్రీ గత ఆదివారమే పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లింది.

అయితే భాగ్యశ్రీ ఇంటికి వచ్చిన రోజు సాయంత్రమే ప్రవీణ్ తో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు మానవ మ్రుగంగా మారాడు... కర్రతో విచక్షణారహితంగా భార్యను చితకబాదాడు... ఆ తర్వాత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఊపిరాడక ప్రాణాల కోసం పోరాడుతుండగా ఆ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. వెంటనే భాగ్యశ్రీ తల్లిదండ్రులకు  కాల్ చేసి, వాళ్ల కూతురు చనిపోతున్న దృశ్యాలను లైవ్‌లో చూపించాడు. ఈ వీడియోను తన స్నేహితులకు, బంధువులకు కూడా పంపాడు.

వారి పెళ్లి సమయంలో గోడపై రాసిన పేర్ల ముందే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించి, దర్యాప్తును వేగవంతం చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : ఈ శనివారం బ్యాంకులకు సెలవుందా? రేపట్నుంచి వరుసగా మూడ్రోజులు సెలవేనా?
Recommended image2
Delhi: కీలక నిర్ణయాలను ఆమోదించిన కేంద్ర కేబినెట్.. వారికి గుడ్ న్యూస్
Recommended image3
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Related Stories
Recommended image1
Crime News: ఒక త‌ప్పు నిండు జీవితాన్ని నాశ‌నం చేస్తుంద‌నేందుకు.. ఈ త‌ల్లి జీవిత‌మే నిద‌ర్శ‌నం
Recommended image2
Crime: ల‌వ‌ర్‌కి రక్తంతో లెటర్ రాసినా నేరమే అని తెలుసా.? జైలుకు వెళ్లాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved