MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Signature Change Legal Validity: సంతకం ఎప్పుడూ ఒకే విధంగా పెట్ట‌డం లేదా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే !

Signature Change Legal Validity: సంతకం ఎప్పుడూ ఒకే విధంగా పెట్ట‌డం లేదా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే !

Signature Change Legal Validity: సంతకం మారితే అది చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అన్ని చోట్ల సంత‌కాలు ఒకే విధంగా కాకుండా మార్చి పెడితే ఏమ‌వుతుంది? భారత చట్టాలు ఏం చెబుతున్నాయి? అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 17 2025, 11:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీ సంతకం మారితే దానికి చట్టబద్ధత ఉంటుందా?
Image Credit : Getty

మీ సంతకం మారితే దానికి చట్టబద్ధత ఉంటుందా?

భారతదేశంలో మీ సంతకం మారినా, అది చట్టపరంగా చెల్లుతుంది. కానీ, పాత సంతకంతో కొత్త సంతకం సరిపోలకపోతే, అది కొన్ని సందర్భాల్లో చట్టపరమైన సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆధార్, పాస్‌పోర్ట్, ఆస్తి పత్రాలు, కోర్ట్ అఫిడవిట్లలో ఒకే విధమైన సంతకం కాకుండా మారితే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత చట్టాల ప్రకారం సంతకం చెల్లుబాటు ఎలా ఉంటుంది?
Image Credit : istockphoto

భారత చట్టాల ప్రకారం సంతకం చెల్లుబాటు ఎలా ఉంటుంది?

సంతకాల విషయంలో భారత చట్టాల్లో ప్రత్యేక రూల్స్ అంటూ ప్రస్తావించలేదు. భారత చట్టాలు ఎక్కడా ఒకే విధమైన సంతకాన్ని జీవితాంతం పాటించాల్సిన అవసరం ఉందని నిర్దేశించవు. కానీ కొన్ని ముఖ్యమైన పత్రాలలో సంతకం ఒకే విధంగా లేకపోతే మీ సంతకానికి చెల్లుబాటు ఉండదు. వాటిలో..

  • బ్యాంకు పత్రాలు, లావాదేవీల పత్రాలు
  • పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్
  • ఆస్తి నమోదు పత్రాలు
  • కోర్ట్ అఫిడవిట్లు
  • ఒప్పందాలు, కాంట్రాక్టు పత్రాలు

ఈ రికార్డుల్లో సంతకాలు ఒకే విధంగా లేకుంటే చట్ట బద్ధంగా చెల్లుబాటులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ పత్రాలను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

35
సంతకం మారడం వల్ల కలిగే సమస్యలు ఏమిటి?
Image Credit : PR

సంతకం మారడం వల్ల కలిగే సమస్యలు ఏమిటి?

సంతకాలు సరిపోల‌కపోతే ఇది కొన్ని చట్టపరమైన, ఆర్థిక సమస్యలకు దారి తీయ‌వ‌చ్చు.

  • బ్యాంకు లావాదేవీలు రద్దు కావడం
  • చెక్ తిరస్కరణ (చెక్ లు బౌన్స్)
  • ఆస్తి నమోదు ఆలస్యం
  • నకిలీ లేదా ఫోర్జ‌రీ అనే అనుమానాలను పెంచుతాయి
  • చట్టపరమైన పత్రాల తిరస్కరణ ఉంటుంది

అందువల్ల, సంతకం మారిన వెంటనే సంబంధిత సంస్థలకి తెలియజేయడం తప్పనిసరి. అలాగే, సంత‌కాల‌ను వేరువేరుగా మార్చి పెట్ట‌కూడ‌దు.

45
సంతకం మారినప్పుడు తీసుకోవలసిన చట్టబద్ధ చర్యలు ఏంటి?
Image Credit : istockphoto

సంతకం మారినప్పుడు తీసుకోవలసిన చట్టబద్ధ చర్యలు ఏంటి?

మీ సంతకం వేరువేరుగా ఉంటే లేదా మారినట్లయితే కొన్ని చ‌ర్య‌ల‌ను వెంట‌నే తీసుకోవడంతో ఇబ్బందులకు దూరంగా వుండ‌వ‌చ్చు. వాటిలో..

  • సంతకం ఉన్న అన్ని చోట్ల రికార్డులను మార్చాలి. ఉదాహరణకు బ్యాంకులు, గుర్తింపు పత్రాలు, ఆస్తి పత్రాలు మొదలైనవి.
  • కొత్త సంతకానికి మారాలనుకుంటే మార్చిన సంతకం చేయడంతో పాటు దానికి సంబంధిత వివరాల ఒక నోట్ జత చేయాలి.
  • పాత, కొత్త గుర్తింపు పత్రాల నకల్లు దగ్గర ఉంచుకోవాలి. అంటే రెండింటిలోనూ వ్యక్తిగత వివరాలు ఒకేలా ఉండాలి.
  • సంతకం మారినట్లు అఫిడవిట్ తయారు చేయించుకుని అవసరమైతే నోటరీ ద్వారా ధ్రువీకరించించాలి.
  • అన్ని సంబంధిత సంస్థలకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. బ్యాంకులు, ఉద్యోగ స్థలం, పాస్‌పోర్ట్ కార్యాలయం మొదలైనవి.

మీ సంతకం మారిన సందర్భంలో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే చట్టపరమైన పత్రాలలో స్థిరమైన సంతకాన్ని మాత్రమే వాడండి. ప్రామాణిక మార్పులకు సాక్షుల సమక్షంలో లేదా నోటరీ అఫిడవిట్‌తో మార్పును నమోదు చేయాలి.

55
సంతకం మార్పు: కోర్టులో లేదా చట్టపరమైన వివాదాల పరిస్థితేంటి?
Image Credit : istockphoto

సంతకం మార్పు: కోర్టులో లేదా చట్టపరమైన వివాదాల పరిస్థితేంటి?

ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 సెక్షన్ 73 ప్రకారం.. కోర్టు మీ పాత, కొత్త సంతకాలను పోల్చే అధికారం కలిగి ఉంటుంది. అవసరమైతే, హ్యాండరైటింగ్ నిపుణుడి సహాయాన్ని తీసుకుంటారు. సంతకం చెల్లుబాటును నిరూపించేందుకు బయోమెట్రిక్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, అఫిడవిట్లు ఉపయోగించవచ్చు.

ఉదాహరణకు ఒక చెక్కు మీరు కొత్త సంతకంతో జారీ చేస్తే, అది బ్యాంకులో నమోదైన పాత సంతకంతో సరిపోలకపోతే చెక్కు తిరస్కరణకు గురవవచ్చు. అలాగే, నేగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం మీరు చట్టపరమైన చర్యకు గురయ్యే అవకాశం ఉంది.

అయితే, మీ సంతకం మారడం చట్టవిరుద్ధం కాదు. కానీ, సమయానికి సమాచారాన్ని ఇవ్వకపోతే, పలు చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి సంతకాలు మార్చడం లేదా వేరు వేరు ప్రదేశాల్లో వేరువేరుగా పెట్టడం చేయవద్దు. అలా జరిగితే చట్టబద్దత ఉండేలా వివరాలు అందించాలి. 

గమనిక : ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే.. ఇలాంటి సమస్యలు ఉంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
విద్య
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇస్రో మరో చారిత్రాత్మక విజయం.. GSLV-F18 రాకెట్‌తో మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంటంటే.?
Recommended image2
Supreme Court: దానిని అత్యాచారంగా పరిగణించలేం.. సుప్రీం సంచలన వ్యాఖ్య‌లు
Recommended image3
Good Governance : రాజకీయ ఆందోళనలు యువత భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తున్నాయి?
Related Stories
Recommended image1
Hyderabad: డీఫెన్స్ రంగంలో హైదరాబాద్ స్టార్టప్‌ల సంచలనం.. భారత తొలి స్టెల్త్ డ్రోన్లు ఇక్కడి నుంచే.. !
Recommended image2
ENG vs IND: ఉత్కంఠ‌ను పెంచుతున్న మాంచెస్టర్ టెస్టు.. బుమ్రా ఆడ‌తారా? డాసన్ వన్‌మోర్ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved