TVK Vijay జాతకాన్ని మార్చేది 'V' లెటర్..? పోటీచేసే అసెంబ్లీ పేరులోనూ V, అయితేనే సీఎం..?
దళపతి విజయ్ జాతకం V అక్షరంతో ముడిపడి ఉందా..? అంటే అవును అనే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన పెట్టిన పార్టీ TVK లో V ఉంది… ఇప్పుడు పోటీచేసే అసెంబ్లీ నియోజకవర్గం పేరు V తోనే స్టార్ అవుతుందట.

విజయ్ V సెంటిమెంట్..
Tamilnadu Assembly Elections 2026 : మరికొద్దిరోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి... అందుకే ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. గతంలో తమిళ ప్రజలు పాలకులను ఎన్నుకునేందుకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండేదికాదు... అయితే DMK (ద్రావిడ మున్నేట్ర కజనం) లేదంటే AIDMK (ఆలిండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం) కు ఓటేసేవారు. కానీ ఈసారి అలాకాదు... హీరో విజయ్ పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం) కూడా రేసులో ఉంది. దీంతో ఎప్పుడూ ద్విముఖ పోరు ఉండే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పేలా లేదు.
అయితే టివికే అధినేత విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నారు. ఈ క్రమంలో టివికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ ఎక్కడినుండి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ కీలక నాయకులు మాత్రం విజయ్ చెన్నై నగరంలోనే పోటీ చేస్తారని... వలచెరి అసెంబ్లీ నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.
విజయ్ పోటీకి వలచెరి అసెంబ్లీయే ఎందుకు..?
భారతదేశంలో ప్రధాన ఐటీ సిటీస్ లో తమిళనాడు రాజధాని చెన్నై ఒకటి. ఈ నగరంలో వలచెరు ప్రాంతం నివాస, వాణిజ్య పరంగా బాగా డెవలప్ అవుతోంది. ఐటీ కారిడార్ అతి సమీపంలో ఉండటంతో ఇక్కడ విద్యావంతులు, ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి ఉద్యోగాలు చేసుకునేవారు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. అందుకే ఈ అసెంబ్లీని విజయ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ పార్టీ టీవికే విద్యావంతులు, యువతను ప్రధానంగా టార్గెట్ చేసింది. కాబట్టి వలచెరు అసెంబ్లీలో అత్యధికంగా యంగ్ ఓటర్స్ మరీముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఓటర్లున్నారు. యువత తమిళ రాజకీయాల్లో మార్పు కోరుకుంటోంది కాబట్టి వలచెరు నుండి పోటీచేస్తే ఈజీగా విజయం సాధించవచ్చని విజయ్ ఆలోచిస్తున్నారట.
ఇక ఐటీ కారిడార్ కు దగ్గర్లో ఉండటంతో వలచెరులో ఉద్యోగులే ఎక్కువ… వీరంతా సాంప్రదాయ పార్టీలకంటే కొత్తగా ఏర్పడిన టివికే పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇలా అన్నిరకాలుగా బలంగా కనిపిస్తున్న సేఫ్ సీటు వలచెరు అసెంబ్లీ నుండే విజయ్ పోటీచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
విజయ్ జాతకం కూడా ఇదే చెబుతోందా..?
కేవలం రాజకీయ పరమైన అంశాలే కాదు విజయ్ జాతకం ప్రకారం కూడా 'V' అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందట. ఈ విషయాన్ని ఇప్పటికే జ్యోతిషులు విజయ్ చెప్పడంలో అలాంటి నియోజకవర్గాల వేటలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు వలచెరు నుండే పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదట పుట్టిపెరిగిన విరుగంబాక్కం నియోజకవర్గం నుండి విజయ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత విరుధాచలం, విక్రంవాడి అసెంబ్లీల పేర్లు వినిపించాయి. ఇప్పుడు వలచెరు. ఈ నియోజకవర్గాలన్నింటిని పేరు 'V' తోనే ప్రారంభం అవుతుంది. విజయ్, పార్టీ పేరులోనే V ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే V అనే పదం విజయ్ కి బాగా కలిసివస్తుందని... అందుకనే ప్రస్తుతం వలచెరు అసెంబ్లీ పేరు పరిశీలనలో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.
వలచెరు అసెంబ్లీలో బలాబలాలు...
వలచెరు అసెంబ్లీ 2008 నియోజర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడింది. అక్కడ ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కోసారి ఒక్కోపార్టీ గెలిచింది. 2011 లో అన్నాడిఎంకే, 2016 లో డిఎంకే, 2021 లో కాంగ్రెస్ గెలిచింది. ఆసక్తికర విషయం ఏంటంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ MNM (మక్కల్ నీది మయ్యం) ఇక్కడ 23,072 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది... దీన్నిబట్టి వలచెరు ప్రజల నాడిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలుస్తోంది... ఇదికూడా విజయ్ ఇక్కడినుండి పోటీకి ఆసక్తి చూపించడానికి కారణమై ఉండొచ్చు.
తమిళ రాజకీయాల్లో టీవికే ప్రభావం చూపుతుందా..?
తమిళ రాజకీయాల్లో పాతుకుపోవాలంటే ఇదే సరైన సమయంగా విజయ్ భావిస్తున్నారు. అధికార డిఎంకేపై ప్రజా వ్యతిరేకత ఉంది... ఏఐడిఎంకే సరైన నాయకత్వం లేక వీక్ గా కనిపిస్తోంది. కాబట్టి టిఎంకే పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నారు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసివస్తుందని విజయ్ భావిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ప్రజావ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ దశలో అన్నాడిఎంకే, బిజెపితో పొత్తుకు కూడా సిద్దమయ్యారు.. కానీ ఈ ప్రయత్నాలు పలించలేవు. ఒంటరిగా పోటీచేస్తున్నా ఓట్లు చీలకుండా జాగ్రత్తపడితే టీవికే బలమైన శక్తిగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

