MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Pawan Kalyan: త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..? పెద్ద స్కెచ్చే

Pawan Kalyan: త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..? పెద్ద స్కెచ్చే

Pawan Kalyan: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు జ‌ర‌గ‌నున్నాయా.? ఇందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారా.? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 14 2026, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్‌పై పెరుగుతోన్న ఒత్తిడి
Image Credit : Asianet News

విజయ్‌పై పెరుగుతోన్న ఒత్తిడి

విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై వివిధ రకాల ఒత్తిడులు పెరుగుతున్నాయి. సినిమా వివాదాలు, విచారణలు, వ్యక్తిగత సమస్యలు వంటి అంశాలు ఆయనను రాజకీయంగా కూడా ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు బయటకు రావడం ఆయనకు అసౌకర్యంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కొత్త రాజకీయ వ్యూహం గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

25
ఎన్డీఏ నుంచి బిగ్ ఆఫ‌ర్.?
Image Credit : Asianet News

ఎన్డీఏ నుంచి బిగ్ ఆఫ‌ర్.?

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, విజయ్‌ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగా “రెండున్నర సంవత్సరాలు విజయ్ ముఖ్యమంత్రి… తరువాత రెండున్నర సంవత్సరాలు మరో నాయకుడు ముఖ్యమంత్రి” అనే ప్రతిపాదన వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఆఫర్ రాజకీయంగా చాలా పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

Related image1
నిజ జీవితంలో ‘నాన్న పులి క‌థ’.. భ‌ర్త క‌ళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
Related image2
వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
35
మధ్యవర్తిగా పవన్ కల్యాణ్?
Image Credit : Asianet News

మధ్యవర్తిగా పవన్ కల్యాణ్?

ఈ చర్చల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పేరు కూడా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌కు సౌత్‌లో మంచి పరిచయాలు ఉండటం వల్ల ఆయన ద్వారా ఈ రాజకీయ సందేశం వెళ్లినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. దీంతో సౌత్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

45
ఎడప్పాడి నిర్ణయం కీలకం
Image Credit : Google

ఎడప్పాడి నిర్ణయం కీలకం

ఈ ప్రతిపాదనలో ముఖ్యమైన పాత్ర ఎదప్పాడి కె పలనిస్వామిదేనని చెబుతున్నారు. మొదట ఈ ప్రతిపాదనపై ఆయన కొంత సందేహంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆయన పార్టీకి స్వతంత్రంగా పోటీ చేసే శక్తి ఉందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన సూచనల తర్వాత ఈ అంశంపై మళ్లీ చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

55
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణ‌లు
Image Credit : Asianet News

తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణ‌లు

ఈ రాజకీయ చర్చలు నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు రావచ్చు. విజయ్‌కు ఉన్న యువత మద్ధతు, ఎడప్పాడికి ఉన్న గ్రామీణ ఓటు బ్యాంక్, ఎన్డీఏకు ఉన్న కేంద్ర స్థాయి బలం — ఈ మూడు కలిసి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చలుగానే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
రాజకీయాలు
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు
Recommended image2
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే పనిమనిషి జీతమే ఎక్కువ.. ఏడాదికి 4.8 లక్షల సంపాదన సామీ !
Recommended image3
PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి
Related Stories
Recommended image1
నిజ జీవితంలో ‘నాన్న పులి క‌థ’.. భ‌ర్త క‌ళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
Recommended image2
వేణు స్వామికి తాతలా ఉన్నాడుగా.. గ్యాస్ కొరత గురించి 6 నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved