- Home
- National
- Railway : విమానాల్లోనే కాదు రైళ్లలోనూ విదేశీ ప్రయాణం...ఇండియాలోని ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లు ఇవే
Railway : విమానాల్లోనే కాదు రైళ్లలోనూ విదేశీ ప్రయాణం...ఇండియాలోని ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లు ఇవే
విదేశాలకు వెళ్లాలంటే విమానమో లేదంటే షిప్ ఎక్కాలి… కానీ రైలులో కూడా వేరే దేశాలకు వెళ్లే అవకాశం భారతీయులకు ఉంది. ఇలా ఏఏ రైల్వే స్టేషన్ల నుండి విదేశాలకు రైళ్ళు నడుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

భారత్ నుండి విదేశాలకు రైలు సర్వీసులు...
Indian Railway : విదేశీ ప్రయాణం అనగానే మనకు ముందుకు గుర్తువచ్చేది విమాన ప్రయాణం. ఓ దేశం నుండి మరో దేశానికి వెళ్లేందుకు ఇప్పుడంతా విమాన సర్వీసులనే ఉపయోగిస్తున్నారు... కానీ ఒకప్పుడు సముద్ర ప్రయాణం ఉండేది. పడవల్లో నెలల తరబడి ప్రయాణించే సమస్య విమానాల రాకతో తీరిపోయింది. అయితే ఈ విమానాలు, పడవలు కాకుండా భారత్ నుండి కొన్నిదేశాలకు వెళ్లేందుకు మరోమార్గం కూడా ఉంది... అదే రైలు ప్రయాణం.
భారత్ తో భూసరిహద్దు కలిగిన కొన్ని దేశాలకు ఇప్పటికీ రైల్వే కనెక్టివిటీ ఉంది. అయితే కేవలం కొన్ని రైల్వే స్టేషన్ల నుండే ఆ దేశాలకు రైళ్లు నడుస్తాయి... అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల మాదిరిగా ఇవి ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లు అన్నమాట. ఇలా దేశంలోని ఏఏ రైల్వే స్టేషన్ల నుండి విదేశాలకు రైళ్ళు నడుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
1. హల్దిబరి రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ జిల్లా కూచ్ బెహార్ జిల్లాలోని హల్దిబరి పట్టణంలో ఉంది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గల చివరి రైల్వేస్టేషన్... ఇక్కడినుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో దేశ సరిహద్దు ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుండి బంగ్లాదేశ్ కు రైల్వే రాకపోకలు సాగుతున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించడంతో పాటు సరుకు రవాణాకు ఈ రైలు సర్వీసులు ఉపయోగపడుతున్నాయి.
2. టెట్రాఫోల్ రైల్వే స్టేషన్
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని మరో రైల్వే స్టేషన్ టెట్రాఫోల్. ఇది పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగనాలు జిల్లాలో ఉంది. ఇక్కడి నుండి బంగ్లాదేశ్ లో సరుకు రవాణా, వాణిజ్య సంబంధిత రైల్లు నడుస్తాయి.
3. సింగబాద్ రైల్వే స్టేషన్
ఈ రైల్వే స్టేషన్ కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఉంది. మాల్డా జిల్లాలోని హబీబ్ పూర్ లో ఈ స్టేషన్ ఉంటుంది. గతంలో ఈ స్టేషన్ నుండి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు రైలు సర్వీసులు ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ స్టేషన్ నుండి కేవలం సరుకు రవాణా రైళ్లు మాత్రమే బంగ్లాదేశ్ కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది చాలా ప్రాచీన రైల్వే స్టేషన్.
4. జయనగర్ రైల్వే స్టేషన్
బిహార్ రాష్ట్రంలోని మదుబని జిల్లాలో ఈ జయనగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి నేపాల్ కు రైలు సర్వీసులున్నాయి. భారత్-నేపాల్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుండి ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. అంటే ఈ రైల్వే స్టేషన్ నుండి నేపాల్ కు రైలు ప్రయాణం చేయవచ్చు.
5. జోగ్బని రైల్వేస్టేషన్
ఈ రైల్వేస్టేషన్ కూడా బిహార్ లో ఉంది. ఇది దేశంలోని చిట్టచివరి రైల్వే స్టేషన్... ఇక్కడి నుండి నేపాల్ కు రైళ్లు నడుస్తాయి. ఇరుదేశాల మధ్య సరుకు రవాణా, వాణిజ్యంకు ఈ రైల్వే స్టేషన్ ఉపయోగపడుతుంది.
6. అటారీ రైల్వే స్టేషన్
సున్నితమైన భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉంది ఈ అటారీ రైల్వే స్టేషన్. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో ఈ స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి గతంలో పాకిస్థాన్ కు సంఝౌతా ఎక్స్ ప్రెస్ నడిచేది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం ఈ ప్యాసింజర్ రైలును నడిపేవారు. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 2019 లో ఈ రైలు సర్వీసును నిలిపివేశారు.