Indian Railway : చార్టర్ ప్లైట్ తెలుసు... మరి ఈ చార్టర్ ట్రైన్ ఏమిటి?
గ్రూప్ ట్రావెల్, పెళ్లిళ్లు, యాత్రల కోసం ఇప్పుడు మొత్తం కోచ్ లేదా రైలు బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రైలు మొత్తాన్ని బుక్ చేసుకోవడం సాధ్యమేనా?
Indian Railway : భారతదేశంలో ఎక్కువమంది రైళ్లనే ప్రయాణాల కోసం వాడతారు... ఎందుకంటే తక్కువ ఖర్చుతో, త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇలా రైల్వేలో ప్రయాణించడానికి ప్రజలంతా ఆసక్తి చూపిస్తుండటంతో టికెట్లు దొరకడం కష్టమవుతోంది. ముందుగానే ఒకటిరెండు టికెట్లు రిజర్వేషన్ చేసుకుందామన్నా కొన్ని రైళ్లలో అవకాశం ఉండదు. అలాంటిది ఓ కోచ్ మొత్తాన్ని లేదంటే రైలు మొత్తాన్ని బుక్ చేసుకోవడం సాధ్యమేనా? అంటే అవునని అంటోంది రైల్వే శాఖ.
ఒకేసారి బల్క్ గా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తే ఇలా చేయండి
ఏదయినా విహారయాత్రకు స్నేహితులంతా గ్రూప్ గా వెళ్ళాల్సివచ్చినా, శుభకార్యానికి బందువులంతా కలిసి వెళుతున్నా ఒకేసారి టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఓ కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం కోచ్ లనే కాదు రైలుకు రైలునే బుక్ చేసుకోవచ్చు.
చాలా సీట్లు ఒకేసారి బుక్ చేసుకుని అందరూ కలిసి రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇండియన్ రైల్వే అవకాశం ఇస్తుంది. మొత్తం కోచ్ లేదా మొత్తం రైలునే చార్టర్ చేసుకోవచ్చు. పెళ్లిళ్లు, యాత్రలు, టూర్స్ లాంటి వాటికి ఈ బుకింగ్ చాలా ఉపయోగకరం. IRCTC ఫుల్ టారిఫ్ రేట్ (FTR) సర్వీస్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
రైల్వేలో మూడు రకాల చార్టర్ సిస్టమ్స్ ఉన్నాయి
1 - రైల్వే కోచ్ చార్టర్ - ఒక కోచ్ మొత్తం బుక్ చేసుకోవచ్చు. 18 నుండి 100 సీట్లు ఉంటాయి.
2 - ట్రైన్ చార్టర్ - మొత్తం రైలే బుక్ చేసుకోవచ్చు. 18 నుండి 24 కోచ్ లు ఉంటాయి.
3 - సెలూన్ చార్టర్ - స్టే చేసేందుకు సదుపాయాలున్న లగ్జరీ ప్రైవేట్ కోచ్ బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఓ కుటుంబం లేదా ఓ గ్రూప్ ప్రయాణించవచ్చు. ఇందులో లివింగ్ రూం, బెడ్ రూం, కిచెన్ వంటి సదుపాయాలు ఉంటాయి.
ముందుగానే బుక్ చేసుకోండి
ఆరు నెలల ముందు నుండి 30 రోజుల ముందు వరకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా 24 కోచ్ లు అంటే ఓ ట్రైన్ ను బుక్ చేసుకోవచ్చు. ప్రతి కోచ్ కి రూ.50,000 రిజిస్ట్రేషన్ మనీ కమ్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. https://www.ftr.irctc.co.in ఈ లింక్ ద్వారా అప్లై చేయాలి.
ఎలా బుక్ చేసుకోవాలి
ముందుగా అకౌంట్ రిజిస్టర్ చేసుకుని, OTP వెరిఫై చేయాలి. తర్వాత కావాల్సిన సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రయాణ వివరాలు, పేర్లు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారో అప్లోడ్ చేయాలి. తర్వాత డిపాజిట్ కట్టి సీట్స్ బుక్ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవాలంటే రైలు బయలుదేరే స్టేషన్ లో లేదా 10 నిమిషాలు ఆగే స్టేషన్ లో చీఫ్ రిజర్వేషన్ సూపరింటెండెంట్ లేదా స్టేషన్ మేనేజర్ ని కలవాలి. ప్రయాణ వివరాలు, పేర్లు, ఐడి ప్రూఫ్ కాపీ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు.