అమ్మ సెంటిమెంట్‌తో లాటరీ.. రూ.240 కోట్ల జాక్‌పాట్.. జీవితమే మారిపోయింది !
Anilkumar Bolla : అబుదాబిలో నివసిస్తున్న భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లా రూ.240 కోట్లు యూఏఈ లాటరీ గెలుచుకున్నాడు. అమ్మ సెంటిమెంట్‌తో లాటరీ కొంటే రూ.240 కోట్ల జాక్‌పాట్ తో జీవితమే మారిపోయింది.

లాటరీలో రూ.240 కోట్లు గెలిచిన భారతీయుడు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అతి పెద్ద లాటరీ బహుమతి గెలిచిన అదృష్టవంతుడిగా అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల భారతీయుడు అనిల్‌కుమార్ బొల్లా చరిత్ర సృష్టించాడు. ఆయన అక్టోబర్ 18న జరిగిన 23వ లక్కీ డే డ్రా #251018లో Dh100 మిలియన్ జాక్‌పాట్ గెలుచుకున్నాడు. ఇది భారత కరెన్సీలో రూ.240 కోట్లు. యూఏఈ లాటరీ సోమవారం విడుదల చేసిన వీడియో ద్వారా అధికారికంగా ఈ సమాచారం అందించింది. తల్లి సెంటిమెంట్‌తో లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.240 కోట్లు రావడంతో అతని జీవితమే మారిపోయింది.
అనిల్ కుమార్ రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. లో 8,835,372 మంది మంది పాల్గొన్న లాటరీలో అతను రూ.240 కోట్లు గెలుచుకున్నాడు.
The reveal the whole country’s been waiting for! Anilkumar Bolla has made history as The UAE Lottery’s first AED 100 Million Grand Prize Winner!
A defining chapter, a life forever changed, and a reminder of what happens when you #DareToImagine.
Congratulations, Anilkumar! 🎉… pic.twitter.com/PTXObkhSMS— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
రూ. 240 కోట్లు గెలుచుకోవడం పై అనిల్ ఏమన్నారంటే?
అనిల్‌కుమార్ బొల్లా భారీ మొత్తాన్ని గెలుచుకోవడం గురించి మాట్లాడుతూ.. “ఏ మంత్రం లేదు.. ఈజీగానే ఎంపిక చేసుకున్నాను. చివరి నంబర్ మాత్రం చాలా ప్రత్యేకం. అది మా అమ్మ పుట్టినరోజు” అని చెప్పారు. ఆయన ఒకేసారి 12 టికెట్లు కొనుగోలు చేశారు. అందులోని చివరి టికెట్ వాళ్ల అమ్మ పుట్టినరోజు.. అదే ఇప్పుడు ఆయనకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. లాటరీ గెలిచిన క్షణాలను వివరిస్తూ.. “షాక్‌లో సోఫాలో పడిపోయా.. అవును… నేను గెలిచానని మనస్సులో ఆనందం అనిపించింది” అని చెప్పాడు.
ఈ మనీని ఎలా ఉపయోగించబోతున్నాడు?
ఈ మనీని ఏం చేయబోతున్నారనే ప్రశ్నకు.. అనిల్ కుమార్ తన ప్లాన్స్ ను వివరించాడు. పొదుపుగా పెట్టుబడులు పెట్టాలి. ఒక సూపర్‌కార్ కొనాలి. 7 స్టార్ హోటల్‌లో ఒక నెల ఉండి సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పాడు. అలాగే, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి వారితో ఇక్కడే జీవితం సాగిస్తానని చెప్పాడు. “మా అమ్మానాన్నలకు చిన్నచిన్న కోరికలు మాత్రమే ఉన్నాయి. అన్ని నెరవేర్చాలని ఉంది” అని కూడా చెప్పాడు.
కొంత దానం చేస్తాను !
“ఎవరికి అవసరమో వారికి సాయం చేసేలా కొంత డబ్బును సేవా కార్యక్రమాలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నాను” అని అనిల్‌కుమార్ చెప్పాడు. అలాగే లాటరీ కొన్నవాళ్ల గురించి మాట్లాడుతూ.. “ప్రతి విషయం ఒక కారణంతోనే జరుగుతుంది. ముందుకు సాగుతూ ఉండండి… ఒక రోజు అదృష్టం మీ వెంట వస్తుంది” అని తెలిపాడు.
యూఏఈ లాటరీ అధికారులు కూడా ఈ విజయాన్ని గొప్ప మైలురాయిగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు Dh100,000 పొందిన 200కి పైగా విజేతలు.. మొత్తం Dh147 మిలియన్ (రూ.343 కోట్లు పైగా) బహుమతులు పంచినట్లు వివరించారు.
From anticipation to celebration, this is the reveal that changed everything!
Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆
For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.
A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025