IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
IAF Recruitment : భారతీయ వాయుసేనలో కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇవాళ్టి నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. కాబట్టి అర్హతగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకొండి.

అగ్నివీర్ ఉద్యోగాలు
భారత రక్షణ శాఖ అగ్నిపథ్ పథకం కింద నియామకాలు చేపడుతోంది. 'అగ్నివీర్ వాయు (01/2027)' నియామకాలకు వైమానిక దళం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియాామక ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
ముఖ్యమైన తేదీలు:
• రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 12, 2026 (ఉదయం 11 గంటల నుండి)
• దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2026 (రాత్రి 11 గంటల వరకు)
• పరీక్ష తేదీలు: మార్చి 30, 31, 2026
వయోపరిమితి, అర్హతలు
పుట్టిన తేదీ: అభ్యర్థులు 01 జనవరి 2006 నుంచి 01 జూలై 2009 మధ్య జన్మించి ఉండాలి. గరిష్ట వయస్సు 21 ఏళ్లలోపు ఉండాలి.
• వివాహం: అవివాహితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 4 ఏళ్ల సర్వీసులో పెళ్లి చేసుకోకూడదు. మహిళా అభ్యర్థులు సర్వీసులో గర్భం దాల్చకూడదనే నిబంధన కూడా ఉంది.
విద్యా అర్హత
• సైన్స్ విభాగం: 12వ తరగతిలో గణితం, భౌతిక శాస్త్రం, ఇంగ్లీషుతో కనీసం 50% మార్కులు సాధించాలి. (ఇంగ్లీషులో తప్పనిసరిగా 50% ఉండాలి). లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేయాలి.
• ఇతర విభాగాలు: ఏదైనా సబ్జెక్టులో 12వ తరగతి పూర్తి చేసి, మొత్తం 50% మార్కులు, ఇంగ్లీషులో 50% మార్కులు సాధించాలి.
జీతం, ఇతర ప్రయోజనాలు
- నెల జీతం: మొదటి ఏడాది ₹30,000తో మొదలై, ఏటా జీతం పెరుగుతుంది.
• సేవా నిధి: 4 ఏళ్ల సర్వీసును పూర్తి చేసిన వారికి సుమారు ₹10.04 లక్షల సేవా నిధి ప్యాకేజీ ఇస్తారు.
• శాశ్వత ఉద్యోగం: ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25% అగ్నివీరులను వైమానిక దళంలో శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు.
ఎంపిక విధానం
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది:
1. ఆన్‌లైన్ రాత పరీక్ష.
2. శారీరక దారుఢ్య పరీక్ష (PFT), అడాప్టబిలిటీ టెస్ట్.
3. వైద్య పరీక్ష.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి ఉన్నవారు iafrecruitment.edcil.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మధ్యవర్తులను నమ్మవద్దని, అర్హత ఆధారంగానే ఎంపికలు ఉంటాయని వైమానిక దళం హెచ్చరించింది.

