- Home
- Jobs
- Government Jobs : కేవలం పదో తరగతి పాసైతే చాలు... రూ.73,750 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Government Jobs : కేవలం పదో తరగతి పాసైతే చాలు... రూ.73,750 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Government Jobs : మీకు తక్కువ విద్యార్హతలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావిస్తున్నారు. అయితే మీకు అద్భుత అవకాశం వచ్చింది. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. వెంటనే అప్లై చేసుకొండి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ఐటీఐ పూర్తి చేసిన వారి కోసం 210 వర్క్‌మెన్ ఖాళీల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 23, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ విభాగాల్లో జాబ్స్
ఈ నోటిఫికేషన్ ప్రకారం వెల్డర్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్ వంటి వివిధ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (NTC/NAC) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. షిప్‌యార్డ్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ సంస్థల్లో కనీసం 5 ఏళ్ల అనుభవం అవసరం.
వయోపరిమితి, శాలరీ
జనవరి 23, 2026 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 22,500 నుంచి రూ. 73,750 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి రెండో దశలో సంబంధిత ట్రేడ్‌లో ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేపట్టి తుది ఎంపికను పూర్తిచేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 6 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది... జనవరి 23 చివరితేదీ. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.700 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఆసక్తి ఉన్నవారు కొచ్చిన్ షిప్‌యార్డ్ అధికారిక వెబ్‌సైట్ www.cochinshipyard.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

