MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • దుబాయ్‌ ఎయిర్‌షో లో కూలిన భారత యుద్ధ విమానం తేజస్

దుబాయ్‌ ఎయిర్‌షో లో కూలిన భారత యుద్ధ విమానం తేజస్

Tejas Fighter Jet Crash: దుబాయ్ ఎయర్ షోలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం ప్రదర్శన సమయంలో కూలింది. ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా తేజస్‌ కూలింది. దీంతో భారీ మంటలు చెలరేగాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 21 2025, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ ప్రమాదం
Image Credit : X

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ ప్రమాదం

దుబాయ్ ఎయిర్ షోలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం కూలింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రదర్శన సమయంలో కూలిపోయింది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూలింది.

విమానం నేలపై పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. పొగ ఆకాశాన్ని కప్పేసింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వేలాది మంది ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.

ప్రదర్శన ఫ్లైట్ లో పాల్గొంటున్న తేజస్ విమానం విన్యాసాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎత్తు నుంచి నేలపైకి దూసుకొచ్చింది. ఘటన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ సైరన్లు వినిపించాయని ప్రమాదం చూసిన వారు చెప్పారు. పైలట్ ఎజెక్ట్ అయ్యాడా లేదా అనేది అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.

IAF LCA Tejas jet crashes & bursts into flames. The pilot was killed instantly, visuals from Dubai Air Show 25! 

A clear video of the crash while performing the maneuver! pic.twitter.com/vfoJTSbGbH

— Chauhan (@Platypuss_10) November 21, 2025

24
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పంది?
Image Credit : Asianet News

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పంది?

భారత వైమానిక దళం (IAF) ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. “దుబాయ్ ఎయిర్ షో–25లో IAF తేజస్ విమానం కూలింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో వెల్లడిస్తాం” అని ఐఏఎఫ్ ప్రతినిధి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 కంటే ఎక్కువ ఎయిర్ ఫోర్స్ లు పాల్గొంటున్న దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం జరిగిందనీ, సూర్యకిరణ్ అరోబాటిక్ టీంతో పాటు తేజస్ జెట్ కూడా గత వారం అల్ మక్తూమ్ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

An IAF Tejas aircraft met with an accident during an aerial display at Dubai Air Show, today. The pilot sustained fatal injuries in the accident.

IAF deeply regrets the loss of life and stands firmly with the bereaved family in this time of grief.

A court of inquiry is being…

— Indian Air Force (@IAF_MCC) November 21, 2025

Related Articles

Related image1
బిగ్ షాక్.. రిస్క్‌లో 350 కోట్ల వాట్సాప్ యూజర్ల డేటా
Related image2
ఇదే ఇండియా గొప్పతనం.. అందుకే లవ్.. కెవిన్ పీటర్సన్ ఎమోషనల్ పోస్ట్
34
అత్యంత ఆధునిక దేశీయ యుద్ధ విమానం తేజస్
Image Credit : wikipedia

అత్యంత ఆధునిక దేశీయ యుద్ధ విమానం తేజస్

తేజస్ ఒక 4.5 జనరేషన్ మల్టీరోల్ యుద్ధ విమానం. ఈ విమానం ఆఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్, క్లోజ్ కాంబాట్, గ్రౌండ్ అటాక్ మిషన్లు నిర్వహించేలా రూపొందించారు. హాల్ (HAL) వెబ్‌సైట్ ప్రకారం, తేజస్ కుటుంబంలో ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం సింగిల్-సీట్ ఫైటర్ వెర్షన్లు, ట్రైనర్ వెర్షన్లు ఉన్నాయి.

తాజా LCA Mk1A వెర్షన్‌లో AESA రాడార్, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, రాడార్ వార్నింగ్ సిస్టమ్, డిజిటల్ మ్యాప్ జనరేటర్, సురక్షిత రేడియో ఆల్టిమీటర్ వంటి అనేక సరికొత్త వ్యవస్థలు ఉన్నాయి. విమానం భారీ ఒత్తిడుల్లో కూడా మెరుగైన పనితీరును చూపిస్తుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

తేజస్ విమానం కోసం రూపొందించిన మార్టిన్–బేకర్ “జీరో–జీరో” ఎజెక్షన్ సీటు ప్రత్యేకత. ఇది విమానం నిశ్చలంగా పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, పైలట్‌ను సురక్షితంగా బయటకు పంపుతుంది.

44
ఇది తేజస్ జెట్ రెండో ప్రమాదం
Image Credit : our own

ఇది తేజస్ జెట్ రెండో ప్రమాదం

ఈ ప్రమాదం భారత తేజస్ విమానాల చరిత్రలో రెండో ప్రమాదం. మొదటి ప్రమాదం 2024 మార్చి 12న జైసల్మేర్‌లో ఆపరేషనల ట్రైనింగ్ సమయంలో జరిగింది. ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

ఈసారి జరిగిన ప్రమాదంలో పైలట్ పరిస్థితిపై ఇంకా సమాచారం అందలేదు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. దుబాయ్ ఎయిర్ షో నవంబర్ 17న ప్రారంభమై, నవంబర్ 21తో ముగియాల్సి ఉంది. ఆ చివరి రోజునే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద దృశ్యాలను ప్రేక్షకులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
సాయుధ దళాలు
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
రైలులో పెంపుడు కుక్క‌ల‌ను తీసుకెళ్లొచ్చా.? ఇండియ‌న్ రైల్వే ఏం చెబుతోందంటే..
Recommended image2
నెలకు లక్ష సంపాదిస్తున్న ర్యాపిడో డ్రైవ‌ర్‌.. ఇది క‌దా స‌క్సెస్ స్టోరీ అంటే
Recommended image3
పాకిస్థాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు.. ఢిల్లీ పేలుడు సంఘటనలో షాకింగ్ విషయాలు
Related Stories
Recommended image1
బిగ్ షాక్.. రిస్క్‌లో 350 కోట్ల వాట్సాప్ యూజర్ల డేటా
Recommended image2
ఇదే ఇండియా గొప్పతనం.. అందుకే లవ్.. కెవిన్ పీటర్సన్ ఎమోషనల్ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved