MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే

Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే

FSSAI Liquor Ban: మందుబాబులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) బిగ్ షాక్ ఇచ్చింది. ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ వంటి ప్రముఖ లిక్కర్ బ్రాండ్ల సేల్స్‌పై బ్యాన్ విధించింది. అసలు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మనం తాగేది నిజమైన మందేనా? ఓల్డ్ మాంక్, బ్యాగ్‌పైపర్‌, రాయల్ ఛాలెంజ్ ఘరానా మోసం!
Image Credit : Chatgpt

మనం తాగేది నిజమైన మందేనా? ఓల్డ్ మాంక్, బ్యాగ్‌పైపర్‌, రాయల్ ఛాలెంజ్ ఘరానా మోసం!

దేశంలో కోట్ల మంది తాగే ప్రముఖ లిక్కర్ బ్రాండ్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఊహించని షాక్ ఇచ్చింది. ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్, ఆంటిక్విటీ బ్లూ వంటి బిగ్ బ్రాండ్లకు చెందిన కొన్ని కేటగిరీల లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది. లిక్కర్ తయారీలో పాటించాల్సిన కచ్చితమైన క్వాలిటీ రూల్స్ పాటించకపోవడం, పైగా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలపడమే దీనికి ప్రధాన కారణం.

మనం రెగ్యులర్‌గా చూసే ఫేమస్ లిక్కర్ బ్రాండ్ల తయారీలో కంపెనీలు దొంగ దారులు తొక్కాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించిన ల్యాబ్ టెస్టుల్లో తేలింది. నాచురల్‌గా తయారు చేయాల్సిన మందులో కెమికల్స్, ఆర్టిఫిషియల్ రసాయనాలు కలిపి కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారని అధికారులు నిర్ధారించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు ల్యాబ్ టెస్టుల్లో ఏం తేలిందంటే?
Image Credit : Asianet News

అసలు ల్యాబ్ టెస్టుల్లో ఏం తేలిందంటే?

సాధారణంగా నాణ్యమైన విస్కీ లేదా రమ్ తయారు చేయాలంటే దానికి కొంత టైమ్ పడుతుంది. మాల్ట్, ద్రాక్ష, చెరకు పిప్పి వంటి వాటిని ఫర్మెంటేషన్ చేసి, కొన్ని ఏళ్ల పాటు నాచురల్ పద్ధతిలో మెచ్యూర్ అవ్వనివ్వాలి. అప్పుడే దానికి అసలైన టేస్ట్, మంచి స్మెల్ వస్తాయి.

కానీ, ఈ ప్రముఖ కంపెనీలు మాత్రం అంత టైమ్ వెయిట్ చేయకుండా ఒక షార్ట్‌కట్ వెతికాయి. న్యూట్రల్ ఆల్కహాల్‌ తీసుకొని, అందులో పైన బయట నుంచి ఆర్టిఫిషియల్ రమ్ ఫ్లేవర్, విస్కీ ఫ్లేవర్లు కలిపేశారు. అంటే విస్కీలో విస్కీ వాసన వచ్చే ఫ్లేవర్, రమ్‌లో రమ్ వాసన వచ్చే కేమికల్ ఫ్లేవర్ లాంటివి కలిపారు. ఇలా బయటి నుంచి కృత్రిమ సువాసనలు కలపడం ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం.

35
ఏ ఏ బ్రాండ్లు, ఎక్కడెక్కడ బ్యాన్ అయ్యాయి?
Image Credit : Getty

ఏ ఏ బ్రాండ్లు, ఎక్కడెక్కడ బ్యాన్ అయ్యాయి?

ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లలో తయారైన నిర్దిష్ట బ్యాచ్‌లపై ఈ నిషేధం అమలులోకి వచ్చింది.

• యునైటెడ్ స్పిరిట్స్ (మధ్యప్రదేశ్): ఆంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీ.

• ఇన్‌బ్రూ బెవరేజెస్ (మధ్యప్రదేశ్): బ్యాగ్‌పైపర్ డిలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డిలక్స్ నెంబర్ రమ్.

• మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ (మహారాష్ట్ర): దేశంలో ఎంతో పాపులర్ అయిన ఓల్డ్ మాంక్ రమ్‌కి చెందిన 3 వేరియంట్లు.

ఈ లిస్టే కాకుండా మెక్‌డోవెల్స్ నంబర్ 1 రమ్ వంటి మరికొన్ని ప్రోడక్ట్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం.. ఈ బ్యాన్ కేవలం ఈ నిర్దిష్ట ప్లాంట్లలో తయారైన మందుకే పరిమితమా లేక దేశవ్యాప్తంగా అన్ని చోట్లా వర్తిస్తుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

45
7 ఏళ్ల ఓల్డ్ మాంక్ పేరుతో పెద్ద మోసం
Image Credit : our own

7 ఏళ్ల ఓల్డ్ మాంక్ పేరుతో పెద్ద మోసం

అన్నీటికన్నా మైండ్ బ్లాకింగ్ విషయం ఏంటంటే.. ‘ఓల్డ్ మాంక్ నెంబర్ రమ్’ బాటిళ్లపై '7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్' (7 ఏళ్ల పాటు దాచి తయారు చేసిన రమ్) అని ప్రింట్ చేసి మార్కెట్లో అమ్మేశారు. కానీ ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ టెస్టులో తేలిందేంటంటే, అందులో 5 శాతం కంటే తక్కువ మాత్రమే ఒరిజినల్ పాత రమ్ ఉంది. మిగిలిన 95 శాతానికి పైగా ఎలాంటి టేస్ట్ లేని ప్లెయిన్ న్యూట్రల్ స్పిరిట్ మాత్రమే అని తేలింది.

ఇలా తప్పుడు లేబుల్స్ వేసి కస్టమర్లను మోసం చేయడం 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (లేబులింగ్ అండ్ డిస్‌ప్లే) రెగ్యులేషన్స్, 2020' నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీరియస్ అయ్యింది. ఒకవేళ కెమికల్ ఫ్లేవర్లు కలిపితే బాటిల్ ముందు భాగంలో 'రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్' లేదా 'విస్కీ ఫ్లేవర్డ్ స్పిరిట్' అని స్పష్టంగా రాయాలని ఆదేశించింది.

55
రూ.3.3 లక్షల కోట్ల మార్కెట్‌పై హెచ్చరికలు
Image Credit : Getty

రూ.3.3 లక్షల కోట్ల మార్కెట్‌పై హెచ్చరికలు

ఇండియాలో లిక్కర్ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదు. మన దేశంలో ఏడాదికి దాదాపు 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.3 లక్షల కోట్లు) ఆల్కహాల్ సేల్స్ జరుగుతాయి. డయాజియో ఇండియా (యునైటెడ్ స్పిరిట్స్), పెర్నోడ్ రికార్డ్ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. మనం పైన చెప్పుకున్న బ్రాండ్లు ఇండియాలోనే తయారవుతాయి కాబట్టి.. దిగుమతి చేసుకునే స్కాచ్, ప్రీమియం రమ్ కంటే తక్కువ ధరకే దొరుకుతాయి. అందుకే మిడిల్ క్లాస్, యువత వీటిని ఎక్కువగా కొంటుంటారు.

కాగా, ఈ యాక్షన్ మొత్తం లిక్కర్ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని, రూల్స్ బ్రేక్ చేసి కస్టమర్లను మోసం చేస్తున్న కంపెనీలపైనే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ చెప్పింది. గోవాలోని మాండెట్సీ డిస్టిలరీస్‌తో పాటు మహారాష్ట్రలోని మరో ఆరు తయారీ కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చింది. స్టాక్ మార్కెట్లో ఉన్న సరుకును అమ్మడానికి రెండు కంపెనీలకు ఛాన్స్ ఇచ్చినా, బాటిల్ పైకప్పు లేబుల్‌పై అసలు విషయాన్ని బయటపెట్టాలని కండీషన్ పెట్టింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
India Pakistan Border: సైలెంట్‌గా చైనా నుంచి భారీ ఆయుధాలు దింపిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ టార్గెట్‌గా కుట్ర?
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved