PM AC Yojana: ఉచితంగా ACల పంపిణీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంపై క్లారిటీ ఇదిగో
ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతి ఓ రేంజ్‌లో పెరిగి పోయింది. ప్రభుత్వాలు సైతం సోషల్ మీడియా వేదికగానే తమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో నెట్టింట వైరల్ అవుతోన్న కొన్ని వార్తలపై మళ్లీ ప్రభుత్వాలే క్లారిటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది..

ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంట్లో చల్లటి ఏసీ ఉంటే భలే ఉంటుంది కదూ! అది కూడా ఆ ఏసీ ఉచితంగా లభించే అంతకంటే కూల్ మరొకటకి ఉండదంటారా.? తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త వైరల్ అయ్యింది.
మోదీ ప్రభుత్వం ఉచితంగా ఏసీలు అందిస్తోంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పీఎం ఏసీ యోజన పథకం పేరుతో ఉచితంగా 1.5 కోట్ల మందికి 5 స్టార్ ఏసీలు ఇవ్వనుందని అనేది సదరు సోషల్ మీడియా పోస్ట్ సారాంశం.
కేంద్ర విద్యుత్ శాఖ పేరుతో ఈ ప్రచారం మొదలైంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తను ఖండించింది. విద్యుత్ శాఖ ఇలాంటి పథకం ప్రకటించలేదని స్పష్టం చేసింది. 'మోడీ ఉచిత ACలు' పథకం పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పేసింది.
సోషల్ మీడియాలో లింక్‌లు షేర్ చేస్తూ ఈ వార్తను వ్యాప్తి చేశారు. వ్యక్తిగత సమాచారం కోసం ప్రజలను లింక్‌లు క్లిక్ చేయమని ప్రచారం చేశారు. అయితే ఇది సైబర్ నేరస్థుల పని అని అధికారులు స్పష్టతనిచ్చారు.
అయితే ఇలాంటి ఫేక్ వార్తలు గతంలో కూడా వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లలో సమాచారం చూసుకోండి. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయకండి. ఫేక్ వార్తలను రిపోర్ట్ చేయండి. ఇక నెట్టింట వైరల్ అయ్యే న్యూస్ నిజమో కాదో ఒకసారి PIB వెబ్‌సైట్‌లో వార్త నిజమో కాదో చూసుకోండి.
తెలియని లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఇతరులను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎలాంటి సమాచారమైనా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాతే ఓ అంచనాకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. పీఐబీ చేసిన ట్వీట్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.