- Home
- National
- ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో గోనె సంచుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో గోనె సంచుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం
Birbhum Bus Driver Cash Gold: మాజీ బస్సు డ్రైవర్ ఇంట రూ.50 కోట్లు నిధి సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్‌లో ఒక మాజీ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో పోలీసుల సోదాలు చేయగా, ఏకంగా రూ. 28.5 కోట్ల నగదు, 15 కేజీల బంగారం బయటపడింది.

దొంగల అరెస్ట్‌తో ఊహించని మలుపు
పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఏడుగురు దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగలను తమదైన శైలిలో విచారించగా ఒక ఆసక్తికరమైన సమాచారం బయటపడింది. వారు ఇచ్చిన పక్కా హింట్‌తో పోలీసులు దేవుచా ప్రాంతంలోని ఒక నివాసంపై దాడి చేశారు. ఆ దాడితో ఏకంగా రూ. 50 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారం దొరకడం చూసి స్వయంగా పోలీసులే షాక్ అయ్యారు.
రాత్రంతా నోట్ల లెక్కింపు.. బ్యాంక్ మిషన్లు రంగంలోకి
పోలీసులు బుధవారం (జూలై 29) మధ్యాహ్నం ఆ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. గురువారం ఉదయం వరకు దాదాపు 15 గంటల పాటు ఈ సుదీర్ఘ ఆపరేషన్ నాన్‌స్టాప్‌గా సాగింది. సంచుల్లో నింపి ఉన్న నోట్ల కట్టలను చూసి లెక్కించడం సాధ్యం కాక, స్థానిక బ్యాంకుల నుంచి నోట్ల లెక్కింపు యంత్రాలను రప్పించారు. లెక్కింపు పూర్తయ్యాక దొరికిన సొమ్ము రూ. 28.5 కోట్లు అని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఆ కరెన్సీని దాదాపు 35 గోనె సంచుల్లో నింపి ఉంచడం గమనార్హం.
15 కేజీల గోల్డ్ బిస్కెట్లు.. ఐరన్ ట్రంకుల్లో షిఫ్టింగ్
ఇంట్లో కేవలం నగదు మాత్రమే కాదు, కేజీల కొద్దీ పసిడి కూడా లభించింది. దాదాపు 15 కేజీల బరువున్న సాలిడ్ గోల్డ్ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారం విలువ రూ. 20 కోట్ల నుంచి రూ. 21.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం సొత్తును పోలీసులు ఐరన్ ట్రంక్ పెట్టెల్లో భద్రపరిచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం మొత్త కలిపి దాదాపు రూ. 50 కోట్ల విలువ ఉంటుందని అధికారులు ప్రకటించారు.
బస్సు డ్రైవర్ నుంచి క్వారీ మాఫియా వరకు
ఈ భారీ నిధి దొరికిన దేవుచాలోని ఇల్లు మినార్ మోండల్ అనే వ్యక్తికి చెందింది. ఈయన ఒకప్పుడు ప్రభుత్వ రవాణా సంస్థలో బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, స్థానికంగా రాళ్ల వ్యాపారం, క్రషింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఈయన బిర్భూమ్‌లో చక్రం తిప్పే ప్రముఖ రాళ్ల వ్యాపారి తులు మోండల్ సమీప బంధువు. అంతేకాకుండా తులు మోండల్, తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అనుబ్రత మోండల్‌కు దగ్గరి అనుచరుడిగా పేరుంది. మినార్ మోండల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నెట్‌వర్క్ గుట్టురట్టు.. కొనసాగుతున్న విచారణ
ఈ సొత్తుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో మినార్ మోండల్‌ను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్నట్లు అతను అంగీకరించాడని బిర్భూమ్ ఎస్పీ విదిత్ రాజ్ భుండేష్ తెలిపారు. ఈ సొత్తుతో తులు మోండల్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై సీఎం సువేందు అధికారి స్పందిస్తూ, ఇది ఇసుక, రాళ్ల మాఫియాలపై కొత్త ప్రభుత్వం చేపడుతున్న సీరియస్ చర్య అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Commendable job by our Law Enforcement personnel for the crackdown on Sand Mafia.
Following a precise operation based on source based information, Birbhum Police conducted a major raid under Mohammad Bazar PS targeting the hideout of illegal sand mafia Tullu Mondal alias Mohd… pic.twitter.com/Ln4XJCWKKY— Suvendu Adhikari (@SuvenduWB) July 29, 2026

