- Home
- National
- Flight Facts: విమానాలు ఎంత మైలేజ్ ఇస్తాయి? వాటి సర్వీసింగ్‌కు ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.
Flight Facts: విమానాలు ఎంత మైలేజ్ ఇస్తాయి? వాటి సర్వీసింగ్‌కు ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.
ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం తర్వాత విమానాల సాంకేతిక సమస్యలపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో విమానాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

విమానాల సర్వీసింగ్ ఎక్కడ జరుగుతుంది?
ప్రతి విమానానికి నిర్వహణ అవసరం తప్పనిసరి. దీని కోసం ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా నిర్వహణ హ్యాంగర్‌లను ఏర్పాటుచేస్తాయి. పెద్దపెద్ద విమానాశ్రయాల్లో విమాన కంపెనీలకు తమకంటూ స్వంత హ్యాంగర్లు ఉంటాయి. ఇక్కడే రొజూ తనిఖీలు, చిన్నపాటి మరమ్మత్తులు, సర్వీసింగ్ లాంటి పనులు జరుగుతాయి.
ఎక్కువ మరమ్మత్తులు అవసరమైతే మరమ్మత్తుల కోసం MRO కేంద్రాలు (Maintenance, Repair & Overhaul) ఉంటాయి. ఈ కేంద్రాల్లో విమానాన్ని పూర్తిగా పరీక్షించి, లోపాలను గమనించి, అవసరమైన పనులు చేస్తారు.
ఎం.ఆర్.ఓ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?
భారతదేశంలో ప్రధాన MRO హబ్‌లు.. ముంబై, హైదరాబాద్, నాగ్‌పూర్, బెంగళూరులో ఉన్నాయి. ఇక్కడే పెద్దఎత్తున విమానాలకు సర్వీసింగ్ చేస్తారు. అలాగే, కొన్ని విమానాశ్రయాల్లో లైన్ మెయింటెనెన్స్ స్టేషన్లు కూడా ఉంటాయి. ఇవి విమానం రన్‌లో ఉన్నప్పుడు చిన్నతనిఖీలు చేయడానికి ఉపయోగపడతాయి.
విమానానికి సర్వీసింగ్ ఎలా చేస్తారు.?
విమాన సర్వీసింగ్‌లో నాలుగు రకాల చెకింగులు ఉంటాయి:
A Check → చిన్న తనిఖీ, ప్రతి కొన్ని వందల గంటల జర్నీ తర్వాత చేస్తారు
B Check → చాలా వరకు సంస్థలు దీనిని ఏ చెక్‌లోనే కలిపేస్తారు.
C Check → ప్రతి 18-24 నెలలకోసారి చేయాలి. ఇందులో విమానాన్ని చాలా లోతుగా పరిశీలిస్తారు
D Check → అత్యంత కీలకం. ప్రతి 6-10 సంవత్సరాల్లో ఒకసారి చేయాలి. విమానాన్ని పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తారు.
విమానం సర్వీసింగ్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది.?
విమాన సర్వీసింగ్ ఖర్చు అనేది విమాన రకం, ఫ్లైట్ గంటలు, లోపాల తీవ్రత ఆధారంగా మారుతుంది. సాధారనంగా C చెక్‌కి సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లు వరకు ఖర్చవుతుంది. D చెక్‌కి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు ఖర్చవుతుంది.
విమానం ఎంత మైలేజ్ ఇస్తుంది.?
విమానానికి "ఎంత మైలేజ్ ఇస్తుంది?" అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలంటే, గాల్లో ప్రయాణించే విధానం, ఇంధన వినియోగం, వేగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మామూలుగా మనం చూస్తున్న రోడ్ వాహనాల మాదిరిగా విమానాల మైలేజ్ లెక్కించటం కష్టం. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది.
ఉదాహరణకు, బోయింగ్ 737 అనే జెట్ విమానాన్ని తీసుకుంటే, ఇది ఒక నిమిషానికి ఒక్కో ఇంజన్ సుమారు 20 లీటర్ల జెట్ ఇంధనంను ఖర్చు చేస్తుంది. రెండు ఇంజిన్లు కలిపితే నిమిషానికి 40 లీటర్లు. అర్థం చేసుకోవాలంటే, గంటకు ఇది సుమారుగా 2400 లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది.
ఈ విమానం ఒక గంటలో సుమారుగా 900 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే, ప్రతి కిలోమీటరుకు సుమారుగా 2.6 లీటర్లు ఖర్చవుతుందన్నమాట. దీని ప్రకారం, ఒక్క లీటరు ఇంధనంతో ఈ విమానం మొత్తం 384 మీటర్లు (0.384 కిలోమీటర్లు) మాత్రమే ప్రయాణిస్తుంది.
ప్రయాణికుల పరంగా చూస్తే మైలేజ్ మెరుగ్గా ఉంటుంది.
విమానాల్లో మైలేజ్ను ఒక్కో ప్రయాణికుడికి పంచితే అది బాగా మెరుగ్గా కనిపిస్తుంది. ఉదాహరణకు, B737 విమానం సుమారుగా 189 మందిని తీసుకెళ్లగలదు. పై లెక్కన ప్రతి కిలోమీటరుకు 2.6 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని పరిగణిస్తే ఒక్కో ప్రయాణికుడికి ఇది కేవలం 13 మిల్లీ లీటర్ల చొప్పునే ఇంధనం కావాలి అన్నమాట. అంటే లీటరు ఇంధనంతో ఒక్కో ప్రయాణికుడు సుమారుగా 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడు.