- Home
- National
- ప్రతీ టీచర్ చదవాల్సిన వార్త ఇది.. పదో తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్‌లో విస్తుపోయే విషయాలు
ప్రతీ టీచర్ చదవాల్సిన వార్త ఇది.. పదో తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్‌లో విస్తుపోయే విషయాలు
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఆత్మహత్యకు ముందు కుర్రాడు రాసిన లెటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీచర్ల వేధింపులే కారణమా.?
ఢిల్లీలో పదో తరగతి చదువుతోన్న షార్యా పాటిల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలిగించింది. సూసైడ్ లెటర్‌లో స్కూల్‌లో టీచర్లు చేస్తున్న మానసిక వేధింపులే తన నిర్ణయానికి కారణమని రాసుకొచ్చాడు. ఈ విషయం బయటకు రాగానే, సెంట్ కొలంబా స్కూల్ హెడ్‌మాస్టర్‌తో పాటు ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు
ఆత్మహత్యా లేఖలో ఏం ఉంది.?
పోలీసులకు లభించిన స్కూల్ బ్యాగ్‌లో సూసైడ్ లెటర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ లెటర్‌లో తనపై స్కూల్‌లో జరుగుతున్న అవమానాలు, టీచర్లు చేస్తున్న మానసిక వేధింపులు, తనను తరచూ అందరి ముందు అవమానించటం వంటి అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే, ఇలాంటి బాధ మరెవరికీ రాకూడదని టీచర్లపై చర్య తీసుకోవాలి అని కూడా బాలుడు రాసినట్లు సమాచారం.
సంఘటన ఎలా జరిగింది?
నవంబర్ 18న షౌర్యా ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లాడు. అయితే కొద్దిసేపటికే దిల్లీ మెట్రో రైలుకు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తొలుత ప్రమాదంగా భావించినా ఆ తర్వాత బాలుడి స్కూల్ బ్యాగ్‌లో ఉన్న లెటర్ చూసిన తర్వాత ఆత్మహత్య అనే విషయం తెలిసింది.
తండ్రి ఆవేదన..
విద్యార్థి తండ్రి ప్రదీప్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఏడాది నుంచి టీచర్లు తన కుమారుడిని అవమానిస్తున్నారని ఆరోపించారు. చిన్న చిన్న విషయాలకు కూడా తిట్టే వారని, అందరి ముందు అవమానిస్తూ మానసికంగా బాధ పెట్టారన్నారు. స్కూల్‌లో ఫిర్యాదు చేసినా మార్పు లేదని, కంప్లైట్ ఇచ్చిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని అన్నారు. ఆత్మహత్య జరిగిన రోజున, స్టేజ్‌పై డాన్స్ ప్రాక్టీస్‌లో జారిపడగా టీచర్లు అందరి ముందు అతడిని తీవ్రంగా నిందించారని బాలుడి తండ్రి ఆరోపించారు.
గమనిక: ఈ విశ్వంలో అన్నింటికంటే విలువైంది ఏదైనా ఉందంటే అది ప్రాణమే. జీవితంలో కష్టాలు, అవమానాలు లాంటివి ఎదురు కావడం చాలా సాధారణం. అంతదానికి జీవితాన్ని ముగించాలనుకోవడం మూర్ఖులు చేసే పని. ఎంతటి కష్టాన్నైనా కష్టంతో ఎదురించాలి. అప్పుడే విజయం సాధిస్తాం. జీవితానికి అసలైన అర్థం జీవించడం మాత్రమే. ఆ తర్వాతే గెలుపోటములు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

