MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • యువత 9-9-6 రూల్ ఫాలో అవ్వాల్సిందే.. ఇన్ఫోసిస్ మూర్తి వ్యాఖ్యలపై ఫైర్ అవుతోన్న నెటిజన్లు

యువత 9-9-6 రూల్ ఫాలో అవ్వాల్సిందే.. ఇన్ఫోసిస్ మూర్తి వ్యాఖ్యలపై ఫైర్ అవుతోన్న నెటిజన్లు

Narayana Murthy: దేశంలో ప‌ని విధానానికి సంబంధించి ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి ప‌లుసార్లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న చెప్పిన 996 రూల్‌కి సంబంధించి నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 21 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస‌లేంటీ 9 9 6 రూల్.?
Image Credit : Asianet News

అస‌లేంటీ 9-9-6 రూల్.?

చైనాలో కొన్ని టెక్ కంపెనీలు గత దశాబ్దంలో 9-9-6 పని విధానం పాటించేవి. అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పని విధానం అన్న‌మాట‌. ఇలా మొత్తం 72 గంటల వర్క్ వీక్ అవుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. 2021లో చైనా సుప్రీంకోర్టు ఈ విధానాన్ని నిషేధించింది, కానీ పూర్తి స్థాయిలో అమ‌లు కావ‌డం లేదు.

25
నారాయణ మూర్తి ఎందుకు ఉదాహరణ ఇచ్చారు?
Image Credit : Getty

నారాయణ మూర్తి ఎందుకు ఉదాహరణ ఇచ్చారు?

రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి మ‌రోసారి 72 గంటల వర్క్ వీక్ గురించి మాట్లాడారు. 2023లో “భారత అభివృద్ధికి యువత వారానికి 70 గంటలు పనిచేయాలి” అని చెప్పి పెద్ద చర్చకు తెర తీశారు. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. “చైనాలో 9-9-6 అనేది ఉంది. 9 గంటలకు పని మొదలై, రాత్రి 9 గంటలకు ముగుస్తుంది, వారానికి 6 రోజులు ప‌నిదినాలు ఉంటాయి. మొత్తం 72 గంటలు. భారత యువత కూడా ఇలాగే పని చేయాలి” అన్నారు.

Related Articles

Related image1
ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?
Related image2
అత్యంత శక్తివంతమైన వాయు గుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
35
వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ త‌ర్వాత
Image Credit : ANI

వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ త‌ర్వాత

మూర్తి ఇంకా మాట్లాడుతూ.. “ముందు జీవితాన్ని సెట్ చేసుకోవాలి, తరువాతే వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ గురించి ఆలోచించాలి” అని చెప్పారు. ఈ మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఎక్కువ గంటలు పని చేస్తే ఎదుగుదల, జీతాలు, ఉద్యోగ భద్రత లాంటి అంశాలు నిజంగా మెరుగవుతాయా అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి.

45
సోషల్ మీడియాలో విమర్శలు
Image Credit : our own

సోషల్ మీడియాలో విమర్శలు

మూర్తి వ్యాఖ్యలపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భారత ఉద్యోగులకు ఓవ‌ర్‌టైమ్ పే లేకపోవడం, ఎక్కువ పని చేసినా లాభాలు కిందివరికి రాకపోవడం, ఆరోగ్య సమస్యలు పెరగడం, జీతాలు పెద్ద‌గా పెర‌గ‌క‌పోవ‌డం, జీవితం మొత్తం పనికే పరిమితం అవ్వడం వంటి అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. “యూరప్‌లో 10-5-5 అని అంటారు. 10 నుంచి 5 వరకు, 5 రోజులు పని. సంచారం, స్నేహితులతో గడుపుతారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు.” అని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు. ఉద్యోగితో 72 గంట‌లు ప‌ని చేయించి లాభాలు టాప్ మేనేజ్‌మెంట్ పంచుకుంటుంది. ఉద్యోగికి మాత్రం త‌క్కువ వేత‌నం ఇస్తారంటూ మ‌రో యూజ‌ర్ ప్ర‌శ్నించారు. ఇలా సోష‌ల్ మీడియాలోదిక‌గా పెద్ద డిబేట్ న‌డుస్తుంది.

🚨 "There is a saying in China, 9, 9, 6. You know what it means? 9 am to 9 pm, 6 days a week. And that is 72 hours work-week, " said Narayana Murthy. pic.twitter.com/FCeNFynG1F

— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025

55
భారత ఉద్యోగ సంస్కృతిపై కొత్త చర్చ
Image Credit : Getty

భారత ఉద్యోగ సంస్కృతిపై కొత్త చర్చ

మూర్తి వ్యాఖ్యలతో భారతదేశంలో మళ్లీ ఒక పెద్ద చర్చ మొదలైంది. దీని వల్ల దేశంలో పని గంటలు, ఉద్యోగుల హక్కులు, పే-స్రక్చర్, వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ వంటి అంశాలపై కొత్తగా వాదనలు మొదలయ్యాయి. యువతలో చాలామంది ఎక్కువ పని గంటలు ఎదుగుదలకు దారి తీస్తాయా? లేక ఆరోగ్య సమస్యలను పెంచుతాయా? అనే ప్రశ్నలు వేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu
Recommended image2
Now Playing
Lunar Eclipse Visuals From New Delhi: ఇండియా గేట్ పై కనువిందు చేసిన బ్లడ్ మూన్| Asianet News Telugu
Recommended image3
Now Playing
Lunar eclipse India visuals: పూరీ జగన్నాథ ఆలయంపై కనువిందు చేసిన బ్లడ్ మూన్| Asianet News Telugu
Related Stories
Recommended image1
ఇలా నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుంది.. శాస్త్రం ఏం చెబుతోందంటే.?
Recommended image2
అత్యంత శక్తివంతమైన వాయు గుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved