MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • కోమాలో ఉన్న భ‌ర్త‌తో త‌ల్లి కావాల‌ని కోరిన భార్య‌.. అనుమ‌తిచ్చిన కోర్టు. ఇంత‌కి ఏంటీ ప్రాసెస్.?

కోమాలో ఉన్న భ‌ర్త‌తో త‌ల్లి కావాల‌ని కోరిన భార్య‌.. అనుమ‌తిచ్చిన కోర్టు. ఇంత‌కి ఏంటీ ప్రాసెస్.?

Delhi High Court: ఢిల్లీ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. కోమాలో ఉన్న భారత సైనికుడి స్పెర్మ్‌ను సేకరించి భద్రపరచడానికి అనుమతి ఇచ్చింది. ఆ సైనికుడి భార్య తన కుటుంబాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఈ తీర్పునిచ్చింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 16 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార్య హ‌క్కు నిరాక‌రించ‌లేం
Image Credit : Getty, Gemini AI

భార్య హ‌క్కు నిరాక‌రించ‌లేం

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పురుషేంద్ర కుమార్ కౌరవ్ ఈ కేసులో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. రాతపూర్వక అనుమతి లేకపోయినా, భార్య హక్కులను నిరాకరించలేమని పేర్కొన్నారు. దంపతులు ముందే IVF ద్వారా పిల్లల కోసం ప్రయత్నించినందున, దీనిని చట్టబద్ధమైన అంగీకారంగా పరిగణిం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోమా పేషెంట్ నుంచి స్పెర్మ్ ఎలా తీస్తారు?
Image Credit : Getty

కోమా పేషెంట్ నుంచి స్పెర్మ్ ఎలా తీస్తారు?

ఒక వ్యక్తి కోమాలో ఉన్నప్పుడు సహజంగా స్పెర్మ్ ఇవ్వలేడు. అప్పుడు డాక్టర్లు “సర్జికల్ స్పెర్మ్ రిట్రీవల్ (SSR)” అనే విధానాన్ని ఉపయోగిస్తారు. ఇది చిన్న శస్త్రచికిత్సలా ఉంటుంది. యూరాలజిస్ట్ నేరుగా పురుషుడి వృషణాల నుంచి స్పెర్మ్‌ను సేకరిస్తారు. ప్రమాదం లేదా అనారోగ్యం వల్ల స్పృహ కోల్పోయిన వ్యక్తులలో కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది.

35
PESA, TESA అంటే ఏమిటి?
Image Credit : Getty

PESA, TESA అంటే ఏమిటి?

స్పెర్మ్ సేకరణకు ప్రధానంగా రెండు విధానాలు ఉన్నాయి: PESA (Percutaneous Epididymal Sperm Aspiration) ఈ విధానంలో చిన్న సూదితో ఎపిడిడిమిస్ నుంచి స్పెర్మ్ తీస్తారు. ఇక TESA (Testicular Sperm Aspiration) విధానంలో నేరుగా టెస్టిస్ నుంచి సూదితో స్పెర్మ్ తీస్తారు. ఈ రెండు విధానాలు కూడా అనస్థీషియా ఇచ్చి నిర్వహిస్తారు. కాబట్టి రోగికి ఇబ్బంది తక్కువగా ఉంటుంది.

45
సమయం ఎందుకు చాలా ముఖ్యం?
Image Credit : Getty

సమయం ఎందుకు చాలా ముఖ్యం?

కోమా లేదా బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లో సమయం చాలా కీలకం. డాక్టర్ల ప్రకారం, స్పెర్మ్ నాణ్యత కాపాడాలంటే 48 నుంచి 72 గంటలలోపే ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. ఆ సమయం దాటితే స్పెర్మ్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే కోర్టు అనుమతి, వైద్య ప్రక్రియలు త్వరగా పూర్తి కావడం అవసరం.

55
స్పెర్మ్‌ను ఎలా భద్రపరుస్తారు? ఖర్చెంత?
Image Credit : Getty

స్పెర్మ్‌ను ఎలా భద్రపరుస్తారు? ఖర్చెంత?

సేకరించిన స్పెర్మ్‌ను వెంటనే ఉపయోగించాల్సిన అవసరం లేదు. “క్రయోప్రిజర్వేషన్” ద్వారా చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజ్ చేసి నిల్వ చేస్తారు. ఇవి సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంటాయి. తర్వాత IVF లేదా ICSI విధానంలో ఉపయోగిస్తారు.

ఖర్చు విషయానికి వస్తే సాధారణ PESA లేదా TESAకి రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు అవుతుంది. అదే అధునాతన Micro-TESE విధానానికి రూ. 1.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది. ఈ ఖర్చులో డాక్టర్ ఫీజు, ఆసుపత్రి చార్జీలు, అనస్థీషియా ఖర్చులు ఉంటాయి.

మొత్తం మీద మెడికల్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయ్యిందో ఈ ఉదాహరణ చెబుతోంది. కోమాలో ఉన్న వ్యక్తి నుంచి కూడా స్పెర్మ్ సేకరించడం సాధ్యమవుతోంది. ఇది కుటుంబాలకు కొత్త ఆశను ఇస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన చట్టపరమైన, నైతిక అంశాలు కూడా చాలా ముఖ్యంగా మారుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image2
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Recommended image3
8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?
Related Stories
Recommended image1
HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image2
Hyderabad: 5 ఎక‌రాల్లో రూ. 200 కోట్ల‌తో హైదరాబాద్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved