MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Deccan odyssey: ఈ రైలు ఎక్కాలంటే రాసిపెట్టుండాలి.. టికెట్ ధ‌ర అక్ష‌రాల రూ. 9 ల‌క్ష‌లు, న‌డిచే ఇంద్ర‌భ‌వ‌నం.

Deccan odyssey: ఈ రైలు ఎక్కాలంటే రాసిపెట్టుండాలి.. టికెట్ ధ‌ర అక్ష‌రాల రూ. 9 ల‌క్ష‌లు, న‌డిచే ఇంద్ర‌భ‌వ‌నం.

Deccan odyssey: సాధార‌ణంగా ఏసీ ట్రైన్ టికెట్ వేల‌ల్లో ఉంటుంది. అలాంటిదో ఒక టికెట్ ధ‌ర రూ. 9 ల‌క్ష‌లు ఉంటే ఎలా ఉంటుంది. ఇదెక్క‌డో విదేశాల్లో కాదు, భార‌త్‌లోనే అంటే న‌మ్ముతారా.? అవును నిజ‌మే. అత్యంత విలాస‌వంత‌మైన డెక్క‌న్ ఓడిస్సీ రైలుపై ఓ లుక్కేయండి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 11 2026, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లగ్జరీ రైలు ప్రయాణం
Image Credit : Deccan odyssey.com

లగ్జరీ రైలు ప్రయాణం

డెక్కన్ ఓడిస్సీ భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఈ రైలు ద్వారా గుజరాత్ అందాలు, డెక్కన్ పీఠభూమి చారిత్రక ప్రదేశాలు, అలాగే గోవా ప్రయాణం వంటి ప్రత్యేక మార్గాలను అనుభవించవచ్చు. రైలులో ప్రయాణించే సమయంలో బయట కనిపించే అద్భుత దృశ్యాలు ఒకవైపు, లోపల ఉన్న రాజసమైన వాతావరణం మరోవైపు.. ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. సౌకర్యవంతమైన గదులు, రుచికరమైన వంటకాలు, సిబ్బంది అందించే నిరంతర సేవ ప్రయాణికులకు 5 స్టార్ అనుభవాన్ని ఇస్తాయి.

25
రైలులో ఉన్న కోచులు, గదుల ప్రత్యేకత
Image Credit : Deccan odyssey.com

రైలులో ఉన్న కోచులు, గదుల ప్రత్యేకత

డెక్కన్ ఓడిస్సీ లో మొత్తం 12 అద్భుతంగా అలంకరించిన కోచులు ఉన్నాయి. ప్రతి కోచ్ డెక్కన్ ప్రాంత చరిత్రను ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. మీరు ప్రయాణించే మార్గం, మీ గది అలంకరణ మధ్య ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. రైలులో రెండు రకాల గదులు ఉన్నాయి. డీలక్స్ కేబిన్లు, ప్రెసిడెన్షియల్ సూట్లు. ప్రతి కోచ్‌లో 4 డీలక్స్ గదులు లేదా 2 ప్రెసిడెన్షియల్ గదులు మాత్రమే ఉంటాయి. అందువల్ల ప్రశాంతత, వ్యక్తిగత స్థలం ఎక్కువగా లభిస్తుంది. ఇక ప్ర‌తీ గ‌దిలో పెద్ద మంచం, అటాచ్డ్ బాత్రూమ్, ఎయిర్ కండిషనింగ్, టెలిఫోన్, 24 గంటల వ్యక్తిగత అటెండెంట్ సేవ ఇవి అన్నీ రాజభవనం తరహా అనుభూతిని కలిగిస్తాయి.

Related Articles

Related image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Related image2
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
35
రైలులో 5-స్టార్ సౌకర్యాలు
Image Credit : Deccan odyssey.com

రైలులో 5-స్టార్ సౌకర్యాలు

డెక్కన్ ఓడిస్సీ లో కేవలం గదులు మాత్రమే కాకుండా మరిన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. సిట్టింగ్ లౌంజ్, హైటెక్ కాన్ఫరెన్స్ కోచ్, హెల్త్ స్పా, రెండు మల్టీ క్యూసిన్ రెస్టారెంట్లు — పేష్వా I, పేష్వా II. ఈ రెస్టారెంట్లలో భారతీయ, ఓరియెంటల్, కాంటినెంటల్ వంటకాలు అందిస్తారు. రుచితో పాటు ఆతిథ్యం కూడా అత్యున్నతంగా ఉంటుంది.

45
ప్రయాణ ఖర్చు వివరాలు
Image Credit : Deccan odyssey.com

ప్రయాణ ఖర్చు వివరాలు

7 రాత్రులు – 8 రోజుల ప్రయాణానికి సింగిల్ ఆక్యుపెన్సీ విష‌యానికొస్తే డీలక్స్ కేబిన్: సుమారు రూ. 4,27,000 నుంచి మొద‌ల‌వుతుంది. ఇక ప్రెసిడెన్షియల్ కేబిన్ అయితే ఏకంగా రూ. 9,24,700 నుంచి మొద‌ల‌వుతుంది. అలాగే డబుల్ ఆక్యుపెన్సీ సుమారు రూ. 6,12,500 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ప్రెసిడెన్షియల్ కేబిన్‌లో ప్ర‌యాణించాలంటే రూ. 9,24,700 ఖ‌ర్చు చేయాల్సిందే. ప్రయాణ ఖర్చు మార్గం, సీజన్ ఆధారంగా మారవచ్చు.

55
ప్రముఖ మార్గాలు
Image Credit : Deccan odyssey.com

ప్రముఖ మార్గాలు

డెక్కన్ ఓడిస్సీ అనేక మార్గాల్లో నడుస్తుంది. అందులో మూడు ప్రముఖ మార్గాలు ఇవి:

జువెల్స్ ఆఫ్ ది డెక్కన్:

ముంబై నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం బీజాపూర్, ఐహోళే, పట్టడకల్, హంపి, హైదరాబాద్ వంటి చారిత్రక నగరాలను చూపిస్తుంది. ఆపై ఔరంగాబాద్‌లో అజంతా, ఎల్లోరా గుహలను దర్శించవచ్చు.

మార్గం: ముంబై–బీజాపూర్–ఐహోళే–పట్టడకల్–హంపి–హైదరాబాద్–ఎల్లోరా–అజంతా–ముంబై

వ్యవధి: 7 రాత్రులు / 8 రోజులు

ఛార్జీలు: సుమారు రూ. 3,96,805 నుంచి

ఇండియన్ ఓడిస్సీ:

న్యూఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం సవాయి మాధోపూర్, ఆగ్రా, జైపూర్, ఉదయపూర్, వడోదరా, ఔరంగాబాద్ మార్గంగా ముంబై చేరుతుంది. ఈ ప్ర‌యాణంలో రణథంబోర్ నేషనల్ పార్క్, తాజ్ మహల్, చాంపానేర్-పావగఢ్ పురావస్తు పార్క్, ఎల్లోరా గుహలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

మార్గం: న్యూఢిల్లీ–సవాయి మాధోపూర్–ఆగ్రా–జైపూర్–ఉదయపూర్–వడోదరా–ఎల్లోరా–ముంబై

వ్యవధి: 7 రాత్రులు / 8 రోజులు

ఛార్జీలు: సుమారు రూ. 3,96,805 నుంచి మొద‌ల‌వుతాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Recommended image2
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved