Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కారణమేంటి?
Covid-19 cases rising: ఇండియాలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే, కొత్తగా మళ్లీ కరోనా వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణమేంటి?

మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
ఆసియాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం 257 కు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో ఉన్నాయి.
కోవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి కారణమేంటి?
1. కొత్త వేరియంట్ - JN.1
కోవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి కారణం JN.1 వేరియంట్ అని అంటున్నారు. ఇది ఆగస్టు 2023 లో కనిపించింది. WHO దీన్ని 'వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్' గా ప్రకటించింది.
ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసుల ఉప్పెన
2. ఆగ్నేయాసియాలో కొత్త ఉప్పెన
సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ లలో కేసులు బాగా పెరిగాయి. సింగపూర్ లోనే 14,000 కేసులు వచ్చాయి. JN.1 వేరియంట్ దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. ఆయా దేశాలు అప్రమత్తమై చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.
కేవిడ్ ఉప్పెనకు యాంటీబాడీస్ తగ్గడమే కారణమా?
3. ఇండియాలో ఆందోళన చెందాలా?
ఆగ్నేయాసియాలో కేసులు పెరగడానికి ప్రజల్లో యాంటీబాడీస్ తగ్గడమే కారణమట. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి రావొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని ఆరోగ్య శాఖ చెప్తోంది.
కోవిడ్ బారిన పలువురు సెలబ్రిటీలు
4. సెలబ్రిటీలకు కూడా కోవిడ్
కొంతమంది సెలబ్రిటీలకు కూడా కోవిడ్ సోకింది. శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ సోకినట్టు ఆమె సోషల్ మీడియాలో చెప్పారు.
కొత్త వేరియంట్లతోనే మళ్లీ కోవిడ్ వ్యాప్తి
5. కొత్త వేరియంట్ ప్రమాదకరమా?
కొత్త వేరియంట్ ప్రమాదకరమని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, జాగ్రత్తలు పాటించడం మంచిది. మాస్క్ లు, సోషల్ డిస్టెన్సింగ్ లాంటివి పాటించాలి. ఇదివరకు కొత్త వేరియంట్లు వచ్చినప్పుడల్లా కోవిడ్ కేసులు పెరిగిన విషయాలను నిపుణులు గుర్తు చేస్తున్నారు.