MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Condom Sale: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విడుద‌ల చేసిన 2025 ఇయర్ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. నిత్యావసరాల నుంచి లగ్జరీ ఉత్పత్తుల వరకు ఈ రిపోర్ట్‌లో తేలిన కొన్ని విష‌యాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 23 2025, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెన్నై యూజర్ రూ.లక్షకు పైగా కండోమ్స్ కొనుగోలు
Image Credit : Instamart, Getty

చెన్నై యూజర్ రూ.లక్షకు పైగా కండోమ్స్ కొనుగోలు

ఈ రిపోర్ట్‌లో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం చెన్నైకి చెందిన ఒక యూజర్. 2025 ఏడాది పొడవునా అతడు కండోమ్స్‌పై మొత్తం రూ.1,06,398 ఖర్చు చేశాడు. 228 సార్లు వేర్వేరు ఆర్డర్లు పెట్టాడు. మొత్తం ఇన్‌స్టామార్ట్‌ ఆర్డర్లలో ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్స్‌కు సంబంధించినదే కావడం గమనార్హం. సెప్టెంబరు నెలలో కండోమ్ అమ్మకాలు మిగతా నెలలతో పోలిస్తే 24 శాతం పెరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారతీయుల మొదటి ఎంపిక పాలు
Image Credit : Getty

భారతీయుల మొదటి ఎంపిక పాలు

భారతీయుల రోజువారీ జీవితంలో పాలు ఎంత ముఖ్యమో ఈ రిపోర్ట్ మరోసారి రుజువు చేసింది. 2025లో ప్రతి సెకనుకు నాలుగు ప్యాకెట్లకు పైగా పాలను ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆర్డర్ చేశారు. ఈ మొత్తం పరిమాణం 26 వేలకుపైగా ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ నిండేంత ఉంటుందని సంస్థ తెలిపింది.

35
పెట్ కేర్, ఫిట్‌నెస్‌పై భారీ ఖర్చులు
Image Credit : Asianet News

పెట్ కేర్, ఫిట్‌నెస్‌పై భారీ ఖర్చులు

పెంపుడు జంతువులపై ఖర్చు కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. చెన్నైకి చెందిన ఒక పెట్ పేరెంట్ ఒక్క ఏడాదిలోనే పెట్ ఉత్పత్తులపై రూ.2.41 లక్షలు ఖర్చు చేసి ‘పెట్ పేరెంట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు. ఇక ఫిట్‌నెస్ ప్రియులు కూడా వెనుకాడలేదు. ఎన్‌సీఆర్ ప్రాంతంలోని నోయిడాకు చెందిన ఒక యూజర్ 1,343 ప్రోటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేసి మొత్తం రూ.2.8 లక్షలు ఖర్చు చేశాడు.

45
లగ్జరీ షాపింగ్‌లోనూ..
Image Credit : Getty

లగ్జరీ షాపింగ్‌లోనూ..

క్విక్ కామర్స్ అంటే కేవలం కూరగాయలు, పాలు మాత్రమే అన్న భావనను ఇన్‌స్టామార్ట్‌ రిపోర్ట్ తుడిచిపెట్టింది. ముంబైకి చెందిన ఒక యూజర్ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా రూ.15.16 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేశాడు. మరోవైపు బెంగళూరులో ఒక యూజర్ కేవలం రూ.10 విలువైన ఒక ప్రింటౌట్ ఆర్డర్ చేసి ఈ ఏడాది అతి చిన్న కార్ట్‌గా నిలిచాడు.

55
మారుతున్న అలవాట్లు
Image Credit : Gemini

మారుతున్న అలవాట్లు

ఈ ఏడాది డేటా చూస్తే భారతీయులు ఇన్‌స్టామార్ట్‌ను నిత్యావసరాలకే కాదు, ప్రత్యేక అవసరాలు, లగ్జరీ కొనుగోళ్లకూ వాడుతున్నట్టు స్పష్టమవుతోంది. చిన్న అవసరాల నుంచి పెద్ద ఖర్చుల వరకు అన్నీ ఒకే యాప్‌లో చేయడం ఇప్పుడు సాధారణంగా మారింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 2025 రిపోర్ట్ భారతీయుల వినియోగ ధోరణిలో వచ్చిన ఈ మార్పులను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Recommended image2
Zodiac sign: వచ్చే వారం ఈ 4 రాశుల వారికి ల‌క్కీ కాలం.. అప్పుల‌న్నీ తీరిపోతాయి. కానీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved