MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Automobile
  • Renault Duster 2026 : అదిరిపోయే లుక్, మైలేజ్ తో పిచ్చెక్కిస్తున్న కొత్త రెనాల్ట్ డస్టర్

Renault Duster 2026 : అదిరిపోయే లుక్, మైలేజ్ తో పిచ్చెక్కిస్తున్న కొత్త రెనాల్ట్ డస్టర్

New Renault Duster 2026 : రెనాల్ట్ ఇండియా తన ఐకానిక్ ఎస్‌యూవీ డస్టర్ థర్డ్ జనరేషన్ మోడల్‌ను రూ. 10.29 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లు, టర్బో ఇంజన్, ఏడీఏఎస్ లెవల్ 2 సేఫ్టీతో ఈ కారు మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 24 2026, 10:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సేఫ్టీలో నంబర్ 1.. అదిరిపోయే రేంజ్‌లో కొత్త రెనాల్ట్ డస్టర్ 2026 రీఎంట్రీ
Image Credit : X/MaazMz

సేఫ్టీలో నంబర్ 1.. అదిరిపోయే రేంజ్‌లో కొత్త రెనాల్ట్ డస్టర్ 2026 రీఎంట్రీ

భారతీయ వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ డస్టర్ థర్డ్ జనరేషన్ భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. 2022లో నిలిపివేసిన ఈ ఐకానిక్ బ్రాండ్, ఇప్పుడు సరికొత్త రూపంలో, అత్యాధునిక సాంకేతికతతో తిరిగి వచ్చింది. కొత్త రెనాల్ట్ డస్టర్ 2026 ప్రారంభ ధరను రూ. 10.29 లక్షలు (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
New Renault Duster 2026: కొత్త ప్లాట్‌ఫామ్.. అదిరిపోయే ధరలు
Image Credit : GaadiWaadi

New Renault Duster 2026: కొత్త ప్లాట్‌ఫామ్.. అదిరిపోయే ధరలు

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ సరికొత్త ఆర్‌జిఎమ్‌పి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించారు. ఈ కారు ధరలు బేస్ మోడల్ రూ. 10.29 లక్షల నుండి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ. 18.49 లక్షల వరకు ఉన్నాయి. రెనాల్ట్ ఈ ఎస్‌యూవీని మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. అవి: ఆథెంటిక్, ఎవోల్యూషన్, టెక్నో, టెక్నో ప్లస్, ఐకానిక్. ప్రస్తుతం ఆర్ పాస్ ద్వారా రూ. 21,000 చెల్లించి ఈ కారును ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

36
రెనాల్ట్ డస్టర్‌లో 2026 లో శక్తివంతమైన ఇంజన్
Image Credit : X/Parth_Go

రెనాల్ట్ డస్టర్‌లో 2026 లో శక్తివంతమైన ఇంజన్

ఈ కొత్త డస్టర్‌లో రెనాల్ట్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను అందించింది. మొదటిది 1.0-లీటర్ టర్బో ఇంజన్, ఇది 100hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవది మరింత శక్తివంతమైన 1.3-లీటర్ టర్బో ఇంజన్, ఇది గరిష్ఠంగా 163hp శక్తిని, 280Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. అంతేకాకుండా, మైలేజ్ కోరుకునే వారి కోసం 2026 దీపావళి నాటికి 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

46
New Renault Duster 2026: నెక్స్ట్ లెవల్ ఎక్స్‌టీరియర్ డిజైన్
Image Credit : X/Parth_Go

New Renault Duster 2026: నెక్స్ట్ లెవల్ ఎక్స్‌టీరియర్ డిజైన్

గ్లోబల్ మోడల్‌తో పోలిస్తే భారతీయ డస్టర్ డిజైన్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. ముందు భాగంలో గ్రిల్‌పై రెనాల్ట్ లోగోకు బదులుగా పెద్ద అక్షరాలతో Duster అని రాసి ఉంటుంది, ఇది కారుకు రగ్గడ్ లుక్‌ను ఇస్తుంది. ఐబ్రో షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకతలు. వెనుక వైపు ట్రయాంగిల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, లైట్ బార్ కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

56
రెనాల్ట్ డస్టర్‌లో 2026 : లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
Image Credit : X/Parth_Go

రెనాల్ట్ డస్టర్‌లో 2026 : లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు

డస్టర్ క్యాబిన్ ఇప్పుడు మరింత ప్రీమియంగా మారింది. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. పియానో బ్లాక్ ఫినిషింగ్, లెదరెట్ అప్హోల్స్టరీతో లోపలి భాగం చాలా రిచ్‌గా కనిపిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి. 518 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల ఎక్కువ లగేజీని సులభంగా సర్దుకోవచ్చు.

66
రెనాల్ట్ డస్టర్ 2026 వెర్షన్: సేఫ్టీ ఫీచర్లు.. మార్కెట్ పోటీ
Image Credit : X/RenaultIndia

రెనాల్ట్ డస్టర్ 2026 వెర్షన్: సేఫ్టీ ఫీచర్లు.. మార్కెట్ పోటీ

భద్రత విషయంలో రెనాల్ట్ ఎక్కడా రాజీ పడలేదు. భారత్‌లో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్‌తో వస్తున్న మొదటి రెనాల్ట్ కారు ఇదే. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, 360 డిగ్రీల కెమెరా ప్రామాణికంగా లభిస్తాయి. కంపెనీ ఈ కారుపై 7 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా కర్వ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
భారత దేశం
వ్యాపారం
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Recommended image2
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image3
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Related Stories
Recommended image1
Tata Sierra : 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ తో దుమ్మురేపుతున్న టాటా కారు
Recommended image2
IRCTC : ఏప్రిల్ 1 నుండి రైల్వేలో కొత్త రూల్స్.. టికెట్ బుకింగ్ నుండి రిఫండ్ వరకు అన్నీ మారాయి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved