- Home
- National
- Hasina Death sentence: హసీనాకు మరణశిక్ష, ఆమెను వెంటనే అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ
Hasina Death sentence: హసీనాకు మరణశిక్ష, ఆమెను వెంటనే అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ
Hasina Death sentence: హసీనాకు మరణశిక్షను ఖరారు చేసింది యూనస్ ప్రభుత్వం. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె చేసిన నేరాలకు షేక్ హసీనా దోషిగా తేల్చినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఆమెను అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.

షేక్ హసీనాను తిరిగి పంపండి
2024లో జరిగిన ప్రజా తిరుగుబాటుతో బంగ్లాదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆమె దేశం విడిచాక భారత్ ఆశ్రయం కల్పించింది. నేడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది.
హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళతారా?
హసీనాకు మరణశిక్ష విధించడంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ బంద్‌కు పిలుపునిచ్చింది. మరణశిక్ష విధించాలక ఈ తీర్పును తాను అంగీకరించనని, కావాలనే తనకు మరణ శిక్ష విధించారని హసీనా ప్రకటించారు.
భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందంలో ఏముంది?
2013లో భారత్ బంగ్లాదేశ్ మధ్య అప్పగింత ఒప్పందం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ తీర్పును పాటించాల్సిన అవసరం భారత్‌కు లేదు. ప్రాణహాని ఉందని తెలిశాక ఆశ్రయం పొందిన దేశం వారిని తిరిగి పంపాల్సిన అవసరం లేదు. కాబట్టి బంగ్లాదేశ్ భారత్ ను కోరడం తప్ప ఏమీ చేయలేదు.
భారత్ ఏం చేస్తుంది?
2013 భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం ప్రకారం, రాజకీయ నేరస్థుల అప్పగింతను తిరస్కరించే హక్కు రెండు దేశాలకూ ఉంది. భారత్ ఈ ఒప్పందానికే కట్టుబడి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి హసీనాకు భారత్ రక్షణ అందిస్తుందనేది ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం లేఖ
హసీనాను దోషిగా తేల్చిన తరువాత ఆమెను తిరిగి బంగ్లాదేశ్ పంపాలని కోరుతూ ఢాకా భారత్‌కు లేఖ పంపింది. ఆ లేఖ అందినట్లు భారత విదేశాంగ కార్యదర్శి కూడా ధృవీకరించారు. కానీ వివరాలు వెల్లడించలేదు. ఆ లేఖపై ఇంకా భారత్ స్పందించలేదు.