iPhone: ఐఫోన్15 కొనేందుకు ఇదే మంచి సమయం, భారీగా ధర తగ్గించిన అమెజాన్
iPhone: ఐఫోన్ కొనేందుకు ఇదే మంచి సమయం. అమెజాన్ లో భారీగా ధరలు తగ్గాయి. ఐఫోన్ 15 ధర ఏకంగా 50,990 రూపాయలకి తగ్గింది. దీనికి ఈఎమ్ఐ సదుపాయం కూడా ఉంది. ఐఫోన్15 ప్రత్యేకలు ఏమిటో తెలుసుకోండి.

తగ్గిన ఐఫోన్ 15 ధర
ఆపిల్ కు చెందిన ఐఫోన్ 1 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు అమెజాన్‌లో ఎలాంటి కూపన్లు లేకుండా 50,990 రూపాయలకే లభిస్తోంది. దీని అసలు ధర 59,900 రూపాయలు. ఈ తగ్గింపు వల్ల ఇది ఐఫోన్ 16e ఫోన్ కు గట్టి పోటీ ఇవ్వండం ప్రారంభించింది.
ఈ ఫోన్ ప్రత్యేకతలు
ఐఫోన్ 15 ఎందుకు కొనాలి? దీని డిజైన్ స్మూత్ గా ఉంటుంది. దీనికి సిరామిక్ షీల్డ్ వల్ల ఎక్కువ రోజులు మన్నుతుంది. డైనమిక్ ఐలాండ్‌తో బ్రైట్ డిస్‌ప్లేతో వస్తుంది. లైవ్ యాక్టివిటీస్ ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ ఫోన్ ప్రత్యేకతలు
దీనికి USB-C పోర్ట్ వస్తుంది. ఇది ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్, ఇయర్‌బడ్స్ అన్నింటికీ ఒకే కేబుల్ వాడే అవకాశం ఉంటుంది. వేగవంతమైన A16 బయోనిక్ చిప్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు స్మూత్‌గా ఉంటుంది. ఇక కెమెరా విషయానికి 48MP కెమెరా వస్తుంది. దీనితో క్లియర్ ఫొటోలు తీసుకోవచ్చు.
ఇందులో లోపాలు
ఐఫోన్ 15 ఐఫోన్ 15లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ లేదు. పాత 60Hz డిస్‌ప్లే ఉంది. ఛార్జింగ్ కూడా కొంచెం స్లోగా అవుతుంది. అంతకుమించి ఇందులో ఇంకేమీ లోపం లేదు. మిగతా ఫోన్లతో పోలిస్తే మాత్రం ఇది చాలా బెటర్ ఫోన్.
దీనికి పోటీ ఈ ఫోన్లే
ఐఫోన్ 15కు ఎన్నో ఆండ్రాయిడ్ ఫోన్లు పోటీ ఇస్తున్నాయి. శాంసంగ్, వన్‌ప్లస్ ఇదే ధరకు మంచి డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తున్నాయి. ఐఫోన్ 15లో జూమ్ కెమెరా లేకపోవడం ఫొటోగ్రఫీ ప్రియులకు కొంచెం నిరాశేనని చెప్పాలి.